మీ శరీరం గురించి మీకే తెలియని కొన్ని నిజాలు

నేచర్ సృష్టించిన అద్భుతాలలో మానవ శరీరం కూడా ఒకటి. కానీ, అది తెలియక మనం అద్భుతాల కోసం వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళుతున్నాం. నిజానికి అద్భుతమంటే వేరే ఎక్కడో లేదు, అది మన శరీరంలోనే ఉంది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకూ మన శరీరం ఎన్నో పనులని నిర్వర్తిస్తుంటుంది. ఆ… ఏముందిలే! అవన్నీ డైలీ రొటీన్ గా జరిగే పనులే కదా! అని మనం సిల్లీగా తీసిపడేస్తుంటాం. కానీ, ఆ పనుల వెనుక దాగి ఉన్న అసలు రహశ్యాలు తెలిస్తే మీరిలా మాట్లాడరు. మరి అలాంటి మన శరీరం గురించి మీకు తెలియని కొన్ని సైకలాజికల్ ఫాక్ట్స్ ని నేను ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అవేంటో చూద్దాం పదండి.

మానవ శరీరం గురించి ఎవరికీ తెలియని సైకలాజికల్ ఫాక్ట్స్:

  • మన కడుపులో ఉండే యాసిడ్స్… రేజర్ బ్లేడ్స్ ని కూడా కరిగించగలవు.
  • ఒక్క అంగుళం చర్మం మీద… 3 కోట్లకి పైగా బాక్టీరియా ఉంటుంది.
  • నిద్రించే సమయంలో… మనం వాసన పీల్చలేం.
  • హ్యూమన్ బాడీలో ఉన్న DNA… అరటిపండులో ఉన్న DNA ఈ రెండూ కూడా 50% వరకూ కలుస్తాయి.
  • వేలి ముద్రలు ఉన్నట్టే… నాలుక ముద్రలు కూడా ఉంటాయి. అవి ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.
  • శరీరం నుండి తల వేరు చేసినా… 15 సెకన్ల వరకు తల స్పృహ కోల్పోదు.
  • ఒక మనిషి లేవకుండా… 11 రోజుల వరకూ నిద్రించవచ్చు.
  • మనం తిన్నది అరగడానికి మన కడుపులో ఏ యాసిడ్స్ అయితే సహాయ పడతాయో… అవే యాసిడ్స్ మనం చనిపోయిన 3 రోజులకి… మనల్ని తినడం మొదలుపెడతాయి.
  • మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు వరకూ లాస్ అవుతుంటాం.
  • మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటుందో… మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
  • ఓకే రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే పవర్ తో… ఓ సాధారణ ట్రక్ ని 30 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చు.
  • చింపాంజీ శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని వెంట్రుకలే మన శరీరంపై కూడా ఉంటాయి. కాకపోతే మన శరీరంపై ఉండే వెంట్రుకలు చాలా సన్నగా ఉంటాయి.
  • 90 శాతం కి పైగా జబ్బులు… స్ట్రెస్ వల్లనే వస్తున్నాయని తేలింది.
  • 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే… త్వరగా చనిపోతారు.
  • మన శరీరంపై వచ్చే ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూఉంటాయి. ఆ తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి.
  • హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయే వారిలో… 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారట.
  • మన కళ్ళు… 576 మెగా పిక్సెల్స్ కలిగి ఉన్న కెమెరాతో సమానం.
  • మన నోరు… 100 కోట్లకి పైగా రుచులని గుర్తించగలదు.
  • మన శరీరం… 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో…. 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
  • మీకు IQ ఎంత ఎక్కువ ఉంటే… అన్ని కలలు కంటారని అర్ధం.
  • మన కాలి గోర్లకన్నా… చేతి గోర్లు 4 రెట్లు వేగంగా పెరుగుతాయి.
  • మన బెడ్ పై ఉండే దుమ్ములో… సగానికి పైగా మీ చర్మం నుండీ రాలిందే.
  • మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా… మీ గుండె కొట్టుకోవడం జరుగుతుంది.
  • మీకు 60 సంవత్సరాలు వచ్చే సరికి… నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.
  • మన చర్మం నిమిషానికి… 50,000 డెడ్ సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలకి సమానం.
  • మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు… మీరు ఎదుగుతూనే ఉంటారు.
  • మన బ్రెయిన్ డే టైమ్ కన్నా… నైట్ టైమ్ బాగా షార్ప్ గా పనిచేస్తుంది.
  • ఒక సంవత్సరంలో… 15,000 కలలు కంటారట.
  • మన జీవిత కాలంలో గుండె సగటున 250 కోట్ల సార్లు లబ్‌డబ్ మంటుంది. ఇది కొన్ని మిలియన్ బ్యారెళ్ల రక్తాన్ని పంప్ చేస్తుంది.
  • మెదడు నుండీ న్యూరాన్లకి సంకేతాలు… గంటకి దాదాపు 322 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
  • మన నోటిలో… 60,000 కోట్లకి పైగా బ్యాక్టీరియా ఉంటుంది.
  • మనిషి సగటున రోజుకి ఒకటి నుంచి రెండు లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంటాడు. జీవితకాలం మొత్తం మీద చూస్తే… దీంతో రెండు స్విమ్మింగ్ పూల్స్ ని నింపేయొచ్చు.
  • దవడ కండరాలు… 55 పౌండ్ల ఫోర్స్ కలిగి ఉంటాయి.
  • మన శరీరంలోని అన్ని రక్తనాళాలని వరుసగా కలిపితే… దాదాపు 161,000 కి.మీ. పొడవైన తాడు అవుతుందట.
  • మన కళ్లు… కోటి రకాల రంగులని గుర్తించగలవట.
  • జీవిత కాలంలో మన రెప్పలపై పుట్టే వెంట్రుకలన్నింటినీ కలిపినట్లయితే… వంద అడుగుల పొడవైన తాడు అవుతుంది.
  • తల్లి కడుపులో ఉన్నప్పుడు మూడో నెల నుంచే… బయటనుండీ వచ్చే శబ్దాలను బేబీ వినగలదు.
  • మన ఇష్టాఇష్టాలనేవి… తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదలవుతాయట.
  • ఏటా మన కళ్లు 15 నుంచి 30 గ్యాలన్ల కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి. కళ్లు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండేందుకు… ఈ కన్నీరు మనకి తోడ్పడుతుంది.
  • మనం సాయంత్రం కంటే… ఉదయం ఒక సెం.మీ. ఎక్కువ పొడవుగా కనిపిస్తామట. దానికి కారణం, మనం రోజూ పనులు చేసేటప్పుడు… వెన్నెముక, మోకాళ్లలోని బోన్ మారో కొంచెం కుచించుకుపోతుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మళ్లీ ఇది మామూలు స్థితికి వచ్చేస్తుంది.
  • పురుషుల శరీరం మొత్తంలో… 4 గ్రాముల వరకూ ఐరన్ ఉంటుంది; అదే మహిళల శరీరంలో అయితే… ఇది 3.5 గ్రాముల వరకూ ఉంటుంది. ఈ మొత్తంతో ఒక మేకుని తయారుచేయొచ్చు.
  • ఒక మనిషి రోజులో… 50 వేల సార్లు ఊపిరి పీలుస్తాడు.
  • మన శరీరంలో రక్తం సరఫరా కాని ఒకే ఒక్క భాగం… కంటిలో ఉండే కార్నియా.
  • మనిషి మెదడులో… కొన్ని లక్షల కంప్యూటర్లలో దాచగలిగినంత మెమొరీని దాచవచ్చు. మన మెదడులో 2 పెటా బైట్ల సమాచారాన్ని దాచుకోవచ్చు.
  • మన లివర్ ఎన్నిసార్లు డ్యామేజ్ అయినా… మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవుతూ ఉంటుంది.
  • మన శరీరంలో ఉండే రక్త నాళాలు భూమధ్యరేఖను నాలుగు సార్లు చుట్టి రాగలవు.
  • మన శరీరం కంటికి కనిపించనంత సన్నని కాంతిని విడుదల చేస్తుంది.
  • ఒక వ్యక్తి బొడ్డు బటన్‌లో 67 రకాల బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది.
  • మనంప్రతి సంవత్సరం 4 కిలోల చర్మ కణాలను కోల్పోతుంటాం.
  • పిల్లలు కనీసం ఒక నెల వయస్సు వచ్చే వరకు కన్నీళ్లు పెట్టరు.
  • మనిషి గుండె సగటు జీవితకాలంలో మూడు బిలియన్ల కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది.
  • ఎడమ ఊపిరితిత్తు కుడి ఊపిరితిత్తు కంటే దాదాపు 10 శాతం చిన్నది.
  • మన శరీరంలోని రక్తం శరీర బరువులో 8% ఉంటుంది.
  • పురుషుల కంటే స్త్రీలలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది.
  • పురుషుల కంటే స్త్రీలు రెండు రెట్లు ఎక్కువగా రెప్పపాటు వేస్తారు.
  • ఎవరినైనా ముద్దు పెట్టుకునేటప్పుడు తమ తలను కుడివైపుకు వంచుతారు.
  • ఏదైనా ఊహించని సంఘటన ఎదురైనప్పుడు మన బుగ్గలు ఎర్రబడటం గమనిస్తాం. కానీ ఆ సమయంలో మన బుగ్గలు మాత్రమే కాదు, మన కడుపు కూడా ఎర్రగా మారుతుంది. దీనిని ఎవ్వరూ గమనించరు.
  • ప్రతి 3-4 సెకన్లకు మన శరీరంలోని దాదాపు 50,000 కణాలు చనిపోతాయి మళ్ళీ వెంటనే వాటి స్థానంలో కొత్తవి రీప్లేస్ అవుతాయి.
  • ఫింగర్ ప్రింట్స్ అనేవి తల్లి గర్భంలో మూడో నెల పిండంగా ఉన్నప్పుడే ఏర్పడతాయి.
  • మీ గుండె జీవితకాలం మొత్తంలో 182 మిలియన్ లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది.
  • మగవారి శరీరంలో ఉండే అతి చిన్న కణాలు స్పెర్మ్ కణాలు.
  • నవ్వినప్పుడు మన శరీరంలో 17 కండరాలు స్పందిస్తే, సీరియస్ గా ఉన్నప్పుడు 43 కండరాలు స్పందిస్తాయి.
  • ఎంత ప్రయత్నించినా… తుమ్మినప్పుడు కళ్ళు తెరిచి ఉంచడం అసాధ్యం.
  • మీరు ఉదయం కంటే, రాత్రిపూట 8 మి.మీ పొడవు తగ్గుతారు. ఎందుకంటే పని సమయంలో కొన్ని కండరాలు కుంచించుకు పోతాయి.
  • ఒక వ్యక్తి తన జీవితకాలంలో 4,239 సార్లు లైంగిక సంబంధం కలిగి ఉంటాడు.
  • లేచి ఉన్నప్పుడు కంటే నిద్రిస్తున్నప్పుడు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.
  • పూర్తిగా గాలి చొరబడని గదిలో బంధించబడి ఉన్నట్లయితే, మీరు ఆక్సిజన్ అందక కాదు, కార్బన్ డయాక్సైడ్ ఎక్కువై చనిపోతారు.
  • మానవ అస్థిపంజరం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దానికదే రిపేర్ చేయబడి రీస్టోర్ అవుతుంది.
  • హ్యూమన్ బాడీలో ఉండే బిగ్గెస్ట్ మజిల్ గ్లూటియస్ మాగ్జిమస్.
  • మన శరీరంలో ఉండే మొత్తం బ్యాక్టీరియా మొత్తం కణాల పరిమాణం కంటే పది రెట్లు ఎక్కువ.
  • మీకు 70 ఏళ్లు వచ్చేసరికి, దాదాపు 100 పౌండ్ల చర్మాన్ని పోగొట్టుకుంటారు.
  • మన తుమ్ము గంటకు 100 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.
  • మెదడులో ఉండే మొత్తం నాడీ కణాలని కౌంట్ చేయాలంటే దాదాపు 3,000 సంవత్సరాలు పడుతుంది.
  • కనుబొమ్మల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని “గ్లాబెల్లా” అని పిలుస్తారని మీకు తెలుసా!
  • మన శరీరంపై అనేక చోట్ల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయని అనుకొంటాం. నిజానికి మన ముఖంపై ఉండే వెంట్రుకలే ఎక్కువ వేగంగా పెరుగుతాయి.
  • మన బాడీలో కడుపు, ప్లీహము, ఒక ఊపిరితిత్తు, అపెండిక్స్, ఒక కిడ్నీని తీసివేసినా కూడా సంపూర్ణ జీవితాన్ని పొందవచ్చు.
  • ఆహారం ఎక్కువగా తినేవారు తక్కువగా వినికిడి శక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే, తినే ఆహారం ద్వారా వినికిడి ప్రభావితమవుతుంది,
  • నడిచేటప్పుడు వేసే ఒక్క అడుగు వల్ల మొత్తం 200 కండరాలు కదులుతాయి.
  • మిమ్మల్ని మీరు చక్కిలిగింతలు పెట్టుకోవడం ఎప్పటికీ అసాధ్యం.
  • పెద్దవారి కంటే శిశువుకు 99 ఎముకలు ఎక్కువగా ఉంటాయి. అయితే వయస్సు పెరిగేకొద్దీ, ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి,
  • ప్రతి వ్యక్తికి వారి శరీరం లోపల మరియు వెలుపల సుమారు 4 పౌండ్ల విలువైన బ్యాక్టీరియా ఉంటుంది.
  • మంచి మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం ద్వారా హార్ట్ బీట్ రేట్ ని తగ్గించుకోవచ్చు.
  • ప్రతి 10 రోజులకు ఒకసారి నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ రీప్లేస్ అవుతాయి.
  • మీ చిటికెన వేలు మీ చేతిలో అతి చిన్నదే అయినా, ఇది మీ చేతి బలానికి 50% బాధ్యత వహిస్తుంది.
  • సాదారణంగా అబద్ధం చెప్పేటప్పుడు ముందు రెప్పవేసి, ఆ తర్వాత మాటల వేగాన్ని పెంచుతారు.

ముగింపు

మొత్తం మీద శరీరం అద్భుతమైనది. అది పనిచేసే విధానం విశేషమైనది. మనం రోజంతా దానితో గడిపినప్పటికీ, మన శరీరంలో మనకే తెలియని ఇన్ని విషయాలు దాగున్నాయని ఇప్పటివరకూ తెలియదు. అందుకే, ఇకనైనా ప్రతిరోజూ మీ కోసం చేసే ప్రతి పనినీ గమనించండి. దాని వెనుక ఉన్న సైకలాజికల్ రీజన్స్ ఏంటో తెలుసుకోండి.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment