నిద్రించే ముందు ఈ ఆహారాలు అస్సలు తీసుకోకండి!

ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు కోసం మనకు మంచి నిద్ర చాలా అవసరం. ఈ విషయాన్ని అనేక ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. మనకి రాత్రి సరిగా నిద్రలేకపోతే.. మరుసటి రోజు దాని ప్రబావం చూపుతుంది. దాని వలన మనకు బద్ధకం, అలసట, చిరాకుతో రోజంతా గడిచిపోతుంది. అంతేకాదు, దాని ప్రభావం మన మనసుపైనా పడుతుంది. ఏ పని కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతాము.  

రాత్రి నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మనకు నిద్ర పట్టకపోవడానికి కారణం రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే ఆహారం కూడా అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనకు అలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల నిద్రకు భంగం వాటిల్లుతందని చెబుతున్నారు. మరి రాత్రి సమయంలో మనం తినకూడని ఆ ఆహార పదార్ధాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చికెన్:

Digital illustration showing a person walking after eating to reduce heart attack risk
భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?

చికెన్ అంటే మన అందరికీ ఎంత ఇష్టమున్నప్పటికీ, మనం రాత్రి పూట చికెన్ తినడం మానేయాలి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఇది జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే, రాత్రి పుట చికెన్ తీసుకుంటే డైజేషన్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. చికెన్ జీర్ణం అవడం, ప్రోటీన్స్ మన శరీరానికి అందించడం ఆలస్య అవడం కారణంగా మనకు నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే, మన కడుపులో భారంగా ఉండి కూడా నిద్ర పట్టదు. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి.

చాక్లెట్:

మనం కొన్నిసార్లు రాత్రి సమయంలో తీపి పదార్థాలు తింటాం. మరీ కొంతమంది రాత్రి పడుకునే ముందు చాక్లెట్స్ తింటారు. మనం తీనే చాక్లెట్లలో కెఫిన్, టైరోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి మన నిద్రను చెడగొడతాయి. మెదడును మేల్కొని ఉండేలా ప్రభావితం చేస్తాయి. తద్వారా మనకు నిద్రపట్టదు.

Eating carrots daily reduces cancer risk and improves blood health
క్యారెట్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా?

మద్యం

చాలామందికి రాత్రి సమయంలో మద్యం తాగే అలవాటు ఉంటుంది. అలా రాత్రిళ్ళు మద్యం తాగితే దాని ప్రభావం నిద్రపై పడుతుంది. మద్యం మీ నిద్రని పాడు చేయడమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది.  అలాగే, మద్యం తీసుకోవడం వల్ల వ్యక్తి బరువు పెరుగుతాడు. కొలెస్ట్రాల్ వంటివి పెరుగుతాయి. అదికాస్తా చివరికి డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

Leave a Comment