ఎముకల దృఢత్వానికి ఈ మూడు ఆహార పదార్థాలు తప్పనిసరి!

ఈ కాలంలో చాలా మంది ప్రజలు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులతో బాధపడుతున్నారు. కూర్చున్నా? నిల్చున్నా? తీవ్ర నొప్పులతో బాధ పడుతున్నారు. ఎముకల నొప్పుల కారణంగా నేలపై కూర్చుని లేవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనంతటికీ కారణం.. మనం తీసుకొనే ఆహారంలో పోషకాల లోపమే.

ముఖ్యంగా మనకు వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అయితే, సరైన ఆహారం తీసుకోవడం వలన ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహార పదార్థాలు అవసరం అంటున్నారు. ముఖ్యంగా వీరు 3 రకాల ఆహార పదార్థాలను సూచించారు మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నువ్వులు:

మనకు నువ్వులు మార్కెట్‌లో ఈజీగా లభిస్తాయి. వీటిలో ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. నువ్వుల్లో ఉండే పోషకాలు ఎముకలను మరింత దృఢంగా మార్చుతాయి.

బీన్స్:

బీన్స్ కూడా మన ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఎముకల ఆరోగ్యానికి అనుకూలమైన పోషకాల పవర్ హౌస్ ఈ బీన్స్ అంటారు ఆరోగ్య నిపుణులు. బీన్స్ లో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తాయి. కిడ్నీ బీన్స్, ఎడామామ్ వంటి వాటిని తీసుకోవడం ద్వారా మనకి ఎముకల నొప్పుల సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రాగులు:

రాగులు కూడా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రాగులలో ఉండే పోషకాలు.. ఎముకలను చాల స్ట్రాంగ్‌గా మారుస్తాయి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రాగులు మన ఎముకలకు అద్భుత శక్తిని ఇస్తాయి. రాగులు తో రాగి చిల్లా, పాన్‌ కేక్‌లు, రోటీలు, మరిన్ని రకాలుగా తయారు చేసి పిల్లలకు తినిపిస్తే ప్రయోజనం ఉంటుంది.

వీటితో పాటుగా మరికొన్ని పదార్థాలు కూడా ఎముకలను దృఢంగా మారుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి.. పైనాపిల్, బచ్చలికూర, వాల్ నట్స్, అరటిపండ్లు, బొప్పాయి. వీటిలో ఉండే పోషకాలు ఎముకలకు శక్తిని ఇచ్చి… అనేక సమస్యల నుండి మనల్ని దూరం చేస్తాయి.

Leave a Comment