బ్యాక్ పెయిన్ రిలీఫ్ కి ఉత్తమ యోగాసనాలు

ఈమధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ టోటల్ గా చేంజ్ అయింది. డైలీ ఎక్కువసేపు కూర్చునే ఉండే ఉద్యోగాల వల్ల సరైన శరీర భంగిమ లేకుండా పోతుంది. దీంతో బ్యాక్ పెయిన్ అనేది సాధారణ సమస్యగా మారింది.

ఒకప్పుడైతే ఇది వయస్సు రీత్యా వచ్చే సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, మరికొన్ని ఆరోగ్య సమస్యలు వెన్నునొప్పికి ప్రధాన కారణాలు కావచ్చు. అయితే దీనికి బెస్ట్ మెడిసిన్ యోగా. అదెలానో ఇప్పుడు చూద్దాం.

వెన్నునొప్పిని తగ్గించే యోగాసనాలు  

యోగా శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా ఉపశమనం ఇస్తుంది. వెన్నునొప్పిని తగ్గించే కొన్ని ముఖ్యమైన యోగాసనాలను ఇప్పుడు తెలుసుకుందాం. అవి:

భుజంగాసనం (Cobra Pose)

భుజంగాసనం వెన్ను కండరాలను బలపరచడంలో మరియు వెన్నుని నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వెన్నెముకను మరింత ఫ్లెక్సిబుల్ గా చేసి నొప్పిని తగ్గిస్తుంది.

ఎలా చేయాలి?

  1. నేలపై యోగా మ్యాట్ వేయండి.
  2. పొట్ట భాగం నేలకే ఆనించి పడుకోండి.
  3. చేతులను భుజాల దిగువ భాగంలో ఉంచండి.
  4. శ్వాసను లోపలికి తీసుకుంటూ పై భాగాన్ని పైకెత్తండి.
  5. తల వెనక్కి వంచి కొన్ని సెకండ్లు ఆ స్థితిలో ఉండండి.
  6. మెల్లగా మొదటి స్థితికి రండి.
  7. ఈ ఆసనాన్ని 3 నుండి 5 సార్లు చేయండి.

మార్జరీ ఆసనం (Cat-Cow Pose)

ఈ ఆసనం వెన్నుకు సున్నితమైన మసాజ్ లా పని చేస్తుంది. వెన్నుని నిటారుగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

A collage of four yoga inversion poses for beginners, including Downward Facing Dog, Shoulder Stand, Legs Up the Wall, and Headstand in a peaceful yoga studio.
యోగా ఇన్వర్షన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఎలా చేయాలి?

  1. మోకాళ్ల మీద కూర్చొని చేతులను నేల మీద ఉంచండి.
  2. శ్వాసను లోపలికి తీసుకుంటూ వెన్నును పైకి వంచండి (Cat Pose).
  3. శ్వాసను వెలువరించేటప్పుడు వెన్నును కిందికి వంచండి (Cow Pose).
  4. ఈ ఆసనాన్ని 10-15 సార్లు నెమ్మదిగా చేయండి.

అర్ధ మత్స్యేంద్రాసనం (Half Spinal Twist Pose)

ఈ ఆసనం వెన్నుని బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎలా చేయాలి?

  1. నేలపై కుర్చొని ఒక కాలు మడచి, మరో కాలు దాని పైగా ఉంచండి.
  2. విరుద్ధ ప్రక్క చేతిని మడచిన కాలి మీద ఉంచి, శరీరాన్ని మెల్లగా అటు ఇటు తిప్పండి.
  3. మరో వైపు కూడా ఇదే విధంగా చేయండి.

ఇది కూడా చదవండి: యోగా ఇన్వర్షన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

శలభాసనం (Locust Pose)

ఈ ఆసనం వెన్నెముకకు బలాన్ని ఇచ్చి, వెన్నునొప్పిని తగ్గిస్తుంది.

ఎలా చేయాలి?

  1. పొట్ట భాగం నేలపై పెట్టి పడుకోండి.
  2. చేతులను పక్కగా ఉంచండి.
  3. శ్వాసను లోపలికి తీసుకుని, కాళ్లు మరియు పై భాగాన్ని పైకి ఎత్తండి.
  4. కొద్దిసేపు ఆ స్థితిలో ఉండి, మెల్లగా మళ్లీ ముందుకు రండి.

తాడాసనం (Mountain Pose)

ఈ ఆసనం శరీరాన్ని నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎలా చేయాలి?

  1. నిటారుగా నిలబడి, చేతులను పైకి ఎత్తండి.
  2. గట్టిగా నిలబడి, శరీరాన్ని చాచండి.
  3. శ్వాసను మెల్లగా తీసుకోవాలి.

అదోముఖ శ్వానాసనం (Downward Dog Pose)

ఈ ఆసనం వెన్ను భాగాన్ని బలపరుస్తుంది.

A fit man and woman practicing strength-focused yoga poses
యోగా ద్వారా మజిల్స్ బిల్డ్ చేయటం సాధ్యమేనా!

ఎలా చేయాలి?

  1. చేతులు, మోకాళ్లపై నిలబడి, నడుమును పైకి ఎత్తండి.
  2. శరీరాన్ని V ఆకారంలో ఉంచండి.
  3. కొద్దిసేపు ఆ స్థితిలో ఉండండి.

ఉపయోగకరమైన చిట్కాలు

  • ప్రతిరోజూ కనీసం 15-30 నిమిషాల పాటు యోగా చేయండి.
  • సరైన శరీర భంగిమను పాటించండి.
  • ఎక్కువ సేపు ఒకే స్థితిలో కూర్చోకుండా, తరచుగా బ్రేక్ తీసుకోండి.
  • మంచి పోషకాహారం తీసుకుని, నీరు ఎక్కువగా తాగండి.

ముగింపు 

ఈ యోగాసనాలను పాటించడం ద్వారా వెన్నునొప్పి తగ్గడంతో పాటు, శరీరానికి మంచి స్థిరత్వం, అలాగే ఆరోగ్యాన్ని పొందవచ్చు. యోగాను నిత్యం అలవాటు చేసుకుంటే, మీరు మీ వెన్నుని నిటారుగా ఉంచి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు!

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment