మధుమేహులకి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కంటే పోహా ఎందుకు బెటర్?

డయాబెటిక్ పేషెంట్లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మీకో డౌట్ రావచ్చు. షుగర్ పేషెంట్లు ఇడ్లీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలానే కొంతమంది పోహాని కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే, పోషక విలువల పరంగా చూస్తే, బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో ఇడ్లీ, లేదా పోహా ఈ రెండిటిలో ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం.

పోహా అంటే అటుకులతో చేసిన ఉప్మా. అటుకులలో గ్లూటెన్ తో పాటు ఫ్యాట్ కూడా ఉండదు. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో 70 శాతం కార్బోహైడ్రేట్లు, 30 శాతం ఫైబర్ ఉంటాయి. అందుచే గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక అటుకులతో చేసిన ఈ పోహాని తినడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ గ్లూకోజ్ ని స్లోగా బ్లడ్ లోకి ఫ్లో అయ్యేలా చేస్తుంది. దీంతో బ్లడ్ గ్లూకోజ్ సడెన్ గా పెరగడాన్ని నిరోధిస్తుంది. అంతేకాక, దీన్ని తీసుకోవటం వల్ల నీరసం తగ్గి, శక్తి పెరుగుతుంది.

ఇంకా ఇడ్లీ , పోహా ఇవి రెండూ ప్రోబయోటిక్ కంటెంట్లే! కానీ, ఇడ్లీతో పోలిస్తే పోహాలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. పోహాలో అదనంగా బీన్స్, శనగలు, క్యారెట్, క్యాలీఫ్లవర్, కొత్తిమీర వంటివి కూడా జోడిస్తారు. దీనివల్ల పోహాకి మరింత పోషక విలువలు పెరుగుతాయి.

అంతేకాక, పోహ చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఉదయం, సాయంత్రం అల్పాహారంగా తీసుకోవచ్చు. దీనిని తిన్నప్పుడు కడుపు నిండిన అనుభూతి లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఫైనల్ గా చెప్పాలంటే, మధుమేహులు ఇడ్లీ కన్నా పోహా తినటమే ఎంతో బెటర్.

డిస్క్లైమర్:

పోహాని మీ డైట్ లో భాగంగా చేసుకొనే ముందు నిపుణులను సంప్రదించి ఆ తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.

Leave a Comment