మనలో చాలా మందికి ఉదయం లేస్తూనే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దానివల్ల బాడీ రీచార్జ్ అయినట్లు తెగ ఫీలై పోతూ ఉంటాం. ఇది మనల్ని నిద్ర మేల్కొలపడానికి, అప్రమత్తంగా ఉండటానికి ఇంకా రోజును ఉత్సాహంగా గడపడానికి సిద్ధంగా ఉండేలా సహాయపడుతుంది. అయితే మనం తాగే మొదటి కప్పు కాఫీ మనపై ఎలాంటి ప్రభావాలని చూపిస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా మేము మీకు తెలియచేస్తాము. అలానే పరగడుపున కాఫీ తాగటం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏమిటో కూడా ఎక్స్ ప్లోర్ చేద్దాం.
కాగ్నిటివ్ ఫంక్షనింగ్ పెంచుతుంది
ఉదయాన్నే తీసుకొనే ఫస్ట్ కాఫీ సిప్ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ మరియు అలర్ట్ నెస్ మీద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కాఫీలో ఉండే బేసిక్ కాంపోనెంట్ అయిన కెఫీన్ మనలో అలర్ట్ నెస్, అటెన్షన్, అండ్ మెమరీని పెంచుతుంది. ఇంకా మజిల్ కాంట్రాక్షన్ ఫోర్స్ ని కూడా పెంచుతుంది. దీనివలన రోజంతా ఫిజికల్ యాక్టివిటీస్ ని ఈజీగా చేసుకోగలరు.
మూడ్ ని కంట్రోల్ చేస్తుంది
ఉదయాన్నే తాగే మొదటి కప్పు కాఫీ మన మానసిక స్థితి మరియు భావోద్వేగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కెఫీన్ నిద్ర లేమి ఉన్న వ్యక్తులలో ఉండే డిప్రెషన్ మరియు ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: The Science Behind Ghee in Coffee for Improved Health
హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది
ఉదయాన్నే తాగే బెడ్ కాఫీ హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుందని ప్రూవ్ అయింది. దీనితో పాటు స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, మరియు కొన్ని రకాల క్యాన్సర్ ల బారినుండీ కూడా కాపాడుతుంది.
వెయిట్ కంట్రోల్ చేస్తుంది
ఉదయం పూట మొదటి కాఫీ బరువు నిర్వహణపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కెఫీన్ మనలో మెటబాలిజాన్ని పెంచుతుంది. ముఖ్యంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులలో ఇది ఫ్యాట్ బర్నింగ్ కి తోడ్పడుతుంది.
ముగింపు
ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా! అయితే దీనిని మితంగా మాత్రమే తాగాలి. అంటే రోజుకు 3 లేదా 4 కప్పులు మాత్రమే. పరిమితిని మించి తాగితే అది మన శరీరంపై నెగెటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది. So Friends! ఎర్లీ మార్నింగ్ లేవండి! ఫస్ట్ సిప్ కాఫీని ఆస్వాదించండి!! దానితో వచ్చే ప్రయోజనాలను అనుభవించండి!!!