వేసవి వస్తుందంటే చాలు… మార్కెట్లో పుచ్చకాయలు తెగ హడావుడి చేసేస్తుంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండు కాబట్టి సమ్మర్ సీజన్లో దీనిని తీసుకొంటే బాడీ డీ-హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఎండాకాలం మాత్రమే కాదండోయ్… ఏ కాలమైనా దీనిని తీసుకోవచ్చని చెప్తున్నారు డైటీషియన్లు.
ముఖ్యంగా పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలామంచిది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇక పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే లైకోపీన్ మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లని అందిస్తుంది.
పుచ్చకాయలో విటమిన్ ఎ, సి, ఇ, కె, జింక్, మెగ్నీషియం, నియాసిన్ వంటి అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఈ పోషకాల వల్ల మన శరీరంలో ఉండే అనేక సమస్యలు దూరమవుతాయి. పుచ్చకాయల్లో 92% నీరే ఉంటుంది. కాబట్టి ఇది అధిక కేలరీలను కరిగించటంలో సహాయపడుతుంది. ఇక పుచ్చకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైడ్రేటెడ్ గా ఉండటం:
పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుచ్చకాయ తినడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుంది. దీనివల్ల అవయవాల పనితీరు సజావుగా జరుగుతుంది. కణాలకు తగినంత పోషకాలు అందుతాయి. టోటల్ గా బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
బరువు తగ్గటం:
పుచ్చకాయ బరువు తగ్గించేందుకు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే, పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇటువంటి తక్కువ క్యాలరీల సాంద్రత కలిగిన ఆహారాలను తినడంవల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనిద్వారా బరువు తగ్గుతారు.
మూత్రపిండాల సమస్యలు దూరం :
పుచ్చకాయ పొటాషియం, కాల్షియంలకి గొప్ప మూలం. ఇది శరీరంలోని మలినాలని బయటకు పంపడంలో సహాయపడుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా మూత్రపిండాల వ్యాధులని తగ్గిస్తుంది. సెల్ డిఫరెన్సియేషన్ ప్రాసెస్ లో కాల్షియం కీ రోల్ ప్లే చేస్తుంది. సెల్ స్ట్రక్చర్ ను నిర్వహించడంతోపాటు సెల్ ఫంక్షన్లను నియంత్రిస్తుంది.
కండరాల నొప్పులు మాయం:
ముఖ్యంగా పుచ్చకాయలో ఎల్-సిట్రుల్లైన్ ఉంటుంది. ఇది కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు, శారీరక పనితీరును మెరుగుపరిచి, కండరాలను బలంగా తయారుచేస్తుంది.
క్యాన్సర్ తగ్గుతుంది:
పుచ్చకాయలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడటానికి దోహదపడుతుంది. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు కారణమవుతాయి. అలాగే, పుచ్చకాయలో ఉండే లైకోపీన్… ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తపోటు దూరం:
పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరం ద్వారా అర్జినైన్‌గా మారుతుంది. ఈ అర్జినైన్ సిట్రులిన్‌తో పాటు, నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విడదీసి… విశ్రాంతినిచ్చి… రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే, పుచ్చకాయలో ఉండే కెరోటినాయిడ్లు సిరలు-ధమనులు గట్టిపడకుండా నిరోధించడంలో హెల్ప్ అవుతాయి.
చర్మ సౌందర్యం పెరుగుతుంది:
పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది కావున ఇది చర్మానికి మంచి పోషణను అందించడంలో సహాయపడుతుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.
ముగింపు:
పుచ్చకాయలో ఉండే అధిక నీటి కంటెంట్ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అలాగే పూర్తి అనుభూతిని కలిగిస్తుంది. అయినప్పటికీ, మితిమీరి మాత్రం తీసుకోకండి.