Top 5 Foods To Purify Your Blood | మీ ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేసే ఈ 5 ఆహారాల గురించి విన్నారా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే… మన శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలి. శరీర భాగాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే… వాటికి రక్త సరఫరా సక్రమంగా జరగాలి. అలా రక్త సరఫరా సరిగా జరగాలంటే ఎప్పటికప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి. ఇదంతా నిత్యం జరిగే మన బాడీ సైక్లింగ్.

నిజానికి మన శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి.  టాక్సిన్స్ ఎక్కువైతే అది వివిధ రకాల జబ్బులకి దారితీస్తుంది. రక్తం మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. దానితో పాటు హార్మోన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, కూడా ట్రాన్స్ ఫర్ అవుతుంటాయి. ఇది బాడీని బాలన్స్ చేస్తుంది. ఇంకా బాడీ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. 

అలా చేయకపోతే చర్మం, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో ఉండే ఆ టాక్సిన్స్ ని తొలగించడానికి తగినన్ని నీళ్లు తాగడంతోపాటు కొన్ని ముఖ్య ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇవి టాక్సిన్స్ ని తొలగించడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

లెమన్ జ్యూస్ 

లెమన్ జ్యూస్ బ్లడ్, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ని క్లీన్ చేయటంలో  సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే అసిడిక్ ప్రాపర్టీస్  శరీరంలోని pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి. 

Dietary fiber foods such as fruits, vegetables, whole grains, and legumes that support healthy aging and longevity
డైటరీ ఫైబర్ దీర్ఘాయువును పెంచుతుంది – శాస్త్రవేత్తలు చెప్పిన అద్భుత రహస్యాలు!

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్ బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ దుంపలు హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచడానికి, బ్లడ్ ని డిటాక్సిఫై చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇది బ్లడ్ ప్రెజర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.

పసుపు

పసుపు మన దేశంలో దాదాపు ప్రతి వంటకంలో కనిపిస్తుంది. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాక బ్లడ్ డిటాక్సిఫై చేయడానికి కూడా సహాయపడుతుంది.  

బ్రకోలి 

బ్రకోలి  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, విటమిన్ సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఎక్కవగా ఉంటాయి. ఇవన్నీ రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Colorful Plant-Based Diet plate with fruits, vegetables, grains, and nuts representing sustainable wellness.
ప్లాంట్-బేస్డ్ డైట్ సీక్రెట్: హెల్త్ + సస్టైనబుల్ లైఫ్

ముగింపు 

ఈ 5 రకాల ఫుడ్స్ తీసుకోవటం వల్ల మన బాడీలో  ఎప్పటికప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగి టోటల్ బాడీ హెల్దీగా ఉంటుంది.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment