ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. రోజులో గంటల తరబడి కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ వంటి వాటి ముందు కూర్చోవడం… ఇంకా పడుకొనే ముందు మొబైల్ చూస్తూ పడుకోవటం… ఇలాంటి వాటి ఫలితంగా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. చివరకు నిద్ర ఎప్పుడు వస్తుందా..! అని ఆలోచిస్తూ మెలకువగానే పడుకొని పోతున్నారు. అలాంటి కష్టమైన రాత్రుల్లో కూడా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే క్షణాల్లోనే నిద్ర పోవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకొని ఇప్పుడే ఫాలో అవ్వండి.
వేగంగా నిద్రపోవడానికి చిట్కాలు:
ఇది కూడా చదవండి: నిద్రలో కాలి కండరాలు పట్టేస్తుంటే… ఈ హోమ్ రెమెడీస్ పాటించండి!
- వ్యాయామం చేయటం వల్ల శరీరానికి మాత్రమే ప్రయోజనం కలగదు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. అందుకే రోజూ క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వల్ల ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.
- ప్రతి రాత్రి ఒకే సమయంలో నిద్రించడానికి ప్రయత్నించండి.
- సన్ లైట్ సరిగ్గా పొందనప్పుడు శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ గందరగోళానికి గురి కావచ్చు. ఇది కూడా ఓ రకంగా నిద్రలేమికి దారి తీస్తుంది. అందుకే శరీరానికి కావలసిన విటమిన్ – డి పొందటం ముఖ్యం.
- మీ పడకగది వీలైనంత వరకూ చీకటిగా ఉండేలా జాగ్రత్త పడండి.
- నిద్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ గడియారాన్ని పక్కకు తిప్పండి. ఎందుకంటే, నిద్ర మద్యలో మెలకువ వచ్చి టైమ్ ఎంతయిందోనని పదే పదే చూడటం వల్ల ఒత్తిడిని కలిగిస్తుంది. అలా కలిగిన ఒత్తిడి నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.
- మీరు పడుకొనే గదిని చల్లగా ఉంచటం అవసరం. గది చల్లగా ఉంటే… శరీరం సహజంగా చల్లబడుతుంది. మీ శరీరాన్ని చల్లబరచడం మీ మెదడుకు ఇది పడుకునే సమయం అని సంకేతాలు ఇవ్వటమే!
- పడుకునే ముందు నిద్ర పట్టకపోతే, ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
- దోరగా వేయించిన గసగసాలను పల్చని బట్టలో చుట్టి … నిద్రించే ముందు దాని వాసన పీలుస్తూ ఉండాలి.
- రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసినట్లయితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
- కాఫీ, టీ వంటివి రాత్రి పూట మానేయాలి. వాటికి బదులు గోరువెచ్చని పాలు తాగటం బెటర్.
- నిద్ర పోవడానికి 2 గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి.
- రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఓంకారం జపిస్తూ నిద్రలోకి జారుకోవాలి.
- పడుకొనే ముందు ఏవైనా అందమైన దృశ్యాలను కానీ, లేదా పాజిటివ్ విషయాలని కానీ ఊహించుకోవాలి.
- మృదువైన లలిత సంగీతాన్ని వింటూ ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే నిద్ర దానంతట అదే పడుతుంది.
- మ్యూజిక్ వినడం లేదా బుక్ రీడింగ్ వల్ల నిద్ర త్వరగా పడుతుంది.
- పడుకొనే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఈ కారణంగా కూడా హ్యాపీగా నిద్రపడుతుంది.
- రాత్రిపూట వీలైనంత వరకూ తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. దీని వల్ల ఎలాంటి నిద్ర సమస్యలు ఎదురుకావు.
- రాత్రి పూట భోజనానికి, నిద్రకు మద్య కనీసం గంట, గంటన్నర సమయం వ్యవధి ఉండాలి.
- నిద్రా సమయంలో ఎలాంటి పని ఉన్నా దాన్ని పక్కన పెట్టండి. ఆ సమయంలో నిద్రకన్నా ఇంపార్టెంట్ మరేదీ లేదని గుర్తుంచుకోండి.
విరామం లేని రాత్రి ఎంత నిరుత్సాహాన్ని కలిగిస్తుందో అర్థం చేసుకున్నారు కదా! ఈ రాత్రి త్వరగా నిద్రపోవడానికి పై చిట్కాలు మీకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను.
డిస్క్లైమర్:
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.