ఆవలింతలు వస్తున్నాయంటే, శరీరం అలసిపోయింది… ఇక రెస్ట్ కోరుకుంటుంది… త్వరగా నిద్రపోండి… అని మన మైండ్ మనకిచ్చే గొప్ప సిమ్ టమ్. ఆవులించడం అనేది నోటిని తెరవడం, లోతుగా శ్వాసించడం మరియు ఊపిరితిత్తులను గాలితో నింపడం వంటి అసంకల్పిత చర్య. అలా కాకుండా, తరచుగా ఆవలింతలు వస్తుంటే మాత్రం వెంటనే మీ గుండె పదిలమేనా అని ఆలోచించాలి. మరి విపరీతమైన ఈ ఆవలింతలకు గల కారణాలేమిటో తెల వాలంటే ఇది చదవండి.
ఆవలింత అంటే ఏమిటి?
ఆవలింత అనేది ఒక అసంకల్పిత చర్య. ఆవిలించినప్పుడు నోటిని పూర్తిగా తెరిచి, లోతుగా ఊపిరి పీల్చుకుంటారు. ఆపై త్వరగా ఊపిరి పీల్చుకుంటారు.
ఆవలింత అనేది ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలియదు, కానీ, సాదారణంగా అలసట మరియు విసుగు వంటివి ఏర్పడినప్పుడు ఇది వస్తుంద. మరో ముఖ్య విషయం ఏంటంటే, వేరొకరు ఆవులించడం గురించి విన్నప్పుడు లేదా మరొకరు ఆవులించడం వంటివి చూసినప్పుడు కూడా మన ప్రమేయం లేకుండా ఆవులింత వస్తుంది.
కొన్ని ఆవలింతలు తక్కువ సమయం ఉంటాయి మరి కొన్ని ఎక్కువ సమయం ఉంటాయి. ఆవలింతతో పాటు మన కళ్ళలో నుండీ నీరు కారటం కూడా గమనిస్తాం.
విపరీతమైన ఆవలింత కారణాలు
ఒక్కోసారి విపరీతమైన ఆవలింతలు వస్తుంటాయి. దానికి ముఖ్యంగా 2 కారాణాలు చెప్పుకోవచ్చు. అవి:
సాధారణ కారణాలు
నిద్రలేమి, అలసట, పని ఒత్తిడి వంటి కారణాలు కొన్నైతే, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ వంటి డిప్రెషన్ లేదా యాంగ్జయిటీకి ఉపయోగించే మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లో భాగంగా పగటిపూట నిద్రపోవడం, మరియు ఈ రకమైన ఆవలింతలు రావటం జరుగుతుంది.
ఇతర కారణాలు
గుండెపోటు, మూర్ఛ, నాడీ సంబంధిత రుగ్మతలు, లివర్ ఫెయిల్యూర్, బ్రెయిన్ ట్యూమర్, మల్టిపుల్ స్క్లేరోసిస్ వంటి కారణాల వల్ల ఈ రకమైన ఆవలింతలు రావటం జరుగుతుంది.
ఇది కూడా చదవండి: Top 5 Foods To Purify Your Blood | మీ ఒంట్లో రక్తాన్ని శుద్ధి చేసే ఈ 5 ఆహారాల గురించి విన్నారా?
మీ వ్యాయామంపై ఆవలింత ప్రభావం
ఆవలింత వైద్య ప్రపంచంలో ఛేదించలేని ఒక రహస్యం. కొన్ని స్టడీస్ ప్రకారం బ్రెయిన్ ని కూల్ చేయటంలో ఆవలింత సహాయపడుతుంది అని తెలుసుకున్నారు.
మితిమీరిన ఆవలింత అనేది వాగస్ నాడికి సంబంధించినది గుండె వైద్యులు చెబుతారు. ఇది మెదడు దిగువ నుండి గుండె నుంచి ఉదర భాగం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, గుండె చుట్టూ రక్తస్రావం ఎక్కువైనా కూడా ఆ వ్యక్తులు ఎక్కువగా ఆవలిస్తారు. ఇది గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఎక్కువగా ఆవలింతలు హార్ట్ స్ట్రోక్ కు ముందు లేదా తరువాత రావచ్చునని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా సమ్మర్ టైంలో వర్కౌట్స్ చేసేటప్పుడు ఆవలింతలు వస్తే గుండెపోటుకు వచ్చే ఛాన్స్ ఎక్కువని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం పడుతున్నారు.
చివరిమాట
మీరు విపరీతంగా ఆవులిస్తున్నట్లు అనిపిస్తే, కారణాన్ని గుర్తించడానికి వైద్యునితో అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో, మీలో ఉన్న సమస్యకి చికిత్స చేసిన తర్వాత ఆవలింతలకి కారణాలని కనుగొనవచ్చు..
డిస్క్లైమర్:
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.