చిన్నారుల్ని వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్…

ఈ మద్య కాలంలో చిన్నారుల్ని విపరీతంగా వణికిస్తున్న బ్యాక్టీరియల్ ఫీవర్ స్కార్లెట్ ఫీవర్. సాధారణంగా జ్వరం అనగానే వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం. కానీ, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.

ఇతర ఫీవర్లైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటిదే ఈ స్కార్లెట్ ఫీవర్ కూడా. ఇది “స్ట్రెప్టోకోకస్” అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకినప్పుడు ముందుగా గొంతులో మంట, దద్దుర్లు వంటివి మొదలవుతాయి. బాడీ టెంపరేచర్ 102, 103 డిగ్రీల వరకూ ఉంటంది. మిగతా జ్వరాలతో పోలిస్తే ఈ జ్వరానికి సంబంధించిన లక్షణాలు కొంచెం డిఫెరెంట్ గా ఉంటాయి. అవేంటో తెలుసుకొనే ముందు అసలు స్కార్లెట్ ఫీవర్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్కార్లెట్ ఫీవర్ అంటే ఏమిటి?

స్కార్లెట్ ఫీవర్ ని ‘స్కార్లాటినా’ అని కూడా పిలుస్తారు, ఇది విపరీతమైన గొంతు నొప్పి మరియు అధిక జ్వరంతో కూడిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా ఇది 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో వస్తుంది. గతంలో దీనిని తీవ్రమైన అనారోగ్యంగా పరిగణించేవారు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీనిని నివారించవచ్చు.

స్కార్లెట్ ఫీవర్ యొక్క లక్షణాలు ఏమిటి?

  • ఎర్రటి దద్దుర్లు స్కార్లెట్ ఫీవర్ యొక్క సాధారణ సంకేతం
  • నాలుకపై మంట రావడం
  • శరీరంపై దద్దుర్లు
  • గొంతులో ఎర్రటి పొక్కులు ఏర్పడటం
  • నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం
  • గొంతులో పగుళ్లు ఏర్పడటం
  • ఎర్రబడిన ముఖం
  • నోటి చుట్టూ పాలిపోయినట్లు కనిపించటం
  • నాలుకపై ఎర్రటి గడ్డలు
  • నాలుక ఉపరితలంపై తెల్లటి పూత
  • నోరు, మెడ, చేతులు, కాళ్లపై ర్యాషెస్
  • విపరీతమైన దురద
  • తలనొప్పి
  • వికారం
  • వాంతులు
  • కడుపు నొప్పి
  • 101 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం
  • చలి
  • మింగడంలో ఇబ్బంది
  • గొంతులో పసుపు లేదా తెలుపు పాచెస్‌
  • మెడలో వాపు గ్రంథులు
  • టాన్సిల్స్ వాపు
  • ఒళ్ళు నొప్పులు

స్కార్లెట్ ఫీవర్‌కి కారణమేమిటి?

గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ లేదా స్ట్రెప్టోకోకస్ పయోజెనెస్ బ్యాక్టీరియా స్కార్లెట్ ఫీవర్‌కు కారణమవుతుంది. సాధారణంగా, గ్రూప్ A స్ట్రెప్ సాధారణ గొంతు నొప్పి లేదా కొన్ని సందర్భాల్లో జ్వరానికి కారణమవుతుంది.

అయినప్పటికీ, బ్యాక్టీరియా కొన్నిసార్లు టాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది శరీరంపై ఎర్రటి ర్యాషెస్ ని కలిగిస్తుంది. ఇది ఎండోటాక్సిన్, అంటే ఇది బ్యాక్టీరియా కణం విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యే టాక్సిన్. ఇలాంటప్పుడు స్కార్లెట్ ఫీవర్ అనే వ్యాధిగా మారుతుంది.

గ్రూప్ A స్ట్రెప్ వచ్చిన ప్రతి ఒక్కరికీ స్కార్లెట్ ఫీవర్ రాదు. కొంతమంది ఇతరులకి కూడా ఈ టాక్సిన్‌ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది.

స్కార్లెట్ ఫీవర్ ఎలా నిర్ధారణ అవుతుంది?

స్కార్లెట్ ఫీవర్‌ వచ్చిందో… లేదో… తెలుసుకోవటానికి డాక్టర్ పిల్లలకి కొన్ని ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. అందులో భాగంగా పిల్లల నాలుక, గొంతు మరియు టాన్సిల్స్ పరిస్థితిని చెక్ చేస్తారు. లింప్ నోడ్స్ ఉబ్బి ఉన్నాయో… లేదో… చూస్తారు. అలాగే, చలి, జ్వరం, బాడీ పెయిన్స్, వికారం, వాంతులు లేదా ఆకలి లేకపోవటం వంటి ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అని అడుగుతారు.

గ్రూప్ A స్ట్రెప్ ఉందో లేదో తెలుసుకోవడానికి అవసరమైన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకొని వాటిని లేబోరేటరీకి పంపుతారు. అవసరమైతే, యాంటిజెన్ డిటెక్షన్ టెస్ట్ ను కూడా ఆర్డర్ చేయవచ్చు.

స్కార్లెట్ ఫీవర్ ఏ వయసు పిల్లలకు వస్తుంది?

ఈ స్కార్లెట్ ఫీవర్ బడి ఈడు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో ఇది కనిపిస్తుంది. 2 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో ఫీవర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 5 నుంచి 7 సంవత్సరాల ఈడు పిల్లలకి అవకా‌‍శాలు కాస్త తగ్గుతాయి. 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఇంకొంచెం తక్కువ. అసలు ఫీవర్ రాదని కాదుగానీ, వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంతకుమించి వయసు పైబడిన వారికి ఈ ఫీవర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి

మమ్స్ (గవద బిళ్లలు) వంటివి వచ్చిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు వేరొక ఇన్ఫెక్షన్లు సోకేందుకు వీలుంటుంది. దీనితోపాటు స్కార్లెట్ ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

స్కార్లెట్ ఫీవర్ అంటు వ్యాధా?

ఇదొక అంటు వ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుంది. పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఒకరికొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీటి తుంపర్లు పడటం, ఒకరి వస్తువులు మరొకరు వాడడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.

స్కార్లెట్ ఫీవర్‌కు చికిత్స అవసరమా?

స్కార్లెట్ ఫీవర్‌కు సరైన సమయంలో చికిత్స చేస్తే వెంటనే తగ్గిపోతుందని చెప్తున్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లలు 99% ఆసుపత్రిలో చేరే అవసరమే ఉండదు. ఆహారం తీసుకోలేక నీరసపడిపోవడం, మందులు వేసుకోక నిర్లక్ష్యం చేయటం వంటివి చేసిన చిన్నారుల్లో వ్యాధి ముదిరి నిమోనియాకు దారితీస్తే మినహా ఆసుపత్రిలో చేరే అవకాశాలు చాలా తక్కువ.

గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే మరింత ఇబ్బందిరంగా మారుతుంది. గొంతు నుంచి గుండె/కిడ్నీ/మెదడు/ ఎముకల్లోకి ఇన్ఫెక్షన్ చేరి అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

స్కార్లెట్ ఫీవర్‌కు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి?

స్కార్లెట్ ఫీవర్‌కు యాంటీబయాటిక్స్‌తో ట్రీట్మెంట్ ఇస్తారు. యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాను చంపుతాయి అలానే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాతో ఫైట్ చేయటంలో సహాయపడుతుంది. ఇందుకోసం కనీసం వారం రోజులపాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత కూడా నాలుగు రోజులపాటు యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది.

ఫీవర్ తగ్గే సమయంలో చర్మం పొట్టులా ఊడిపోతుంది. కానీ, మళ్లీ యథావిధిగా కొత్త చర్మం వస్తుంది.

స్కార్లెట్ ఫీవర్‌ ను ఎలా నివారించవచ్చు?

స్కార్లెట్ ఫీవర్‌ను నివారించడానికి మంచి పరిశుభ్రతను పాటించడం ఉత్తమ మార్గం. భోజనానికి ముందు మరియు రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినా… దగ్గినా… కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవాలి. మాస్కు వేసుకుంటే మరీ మంచిది.

చల్లని పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. అప్పుడప్పుడు పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అయి పిల్లలకు చెకప్ చేయించడం ఉత్తమం. లేకపోతే వారం తర్వాత మళ్లీ ఫీవర్ వచ్చే వీలుంది.

ముగింపు

గ్రూప్ ఎ బాక్టీరియా విడుదల చేసే టాక్సిన్ వల్ల స్కార్లెట్ ఫీవర్ వస్తుంది. ఇది పిల్లలలో సర్వసాధారణం అయినప్పటికీ, ఎవరైనా ఇన్ఫెక్షన్ ని డెవలప్ చేయవచ్చు.

చర్మంపై కనిపించే ఎరుపు రంగు దద్దుర్లు కారణంగా స్కార్లెట్ ఫీవర్ అనే పేరు వచ్చింది.

చికిత్సలో యాంటీబయాటిక్స్ ఉంటాయి. కొన్ని హోమ్ రెమెడీస్ ఈ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు. కానీ సమస్యను నివారించడానికి ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ఉత్తమ మార్గం. చికిత్స చేసిన తర్వాత, ఈ ఇన్ఫెక్షన్ ఏడు రోజుల్లో క్లియర్ అవుతుంది.

డిస్క్లైమర్:

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment