వేసవిలో చర్మ సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణకి ఈ టిప్స్ పాటించండి!

వేసవి కాలం వచ్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన ఎండ, చెమట వల్ల చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి, ఈ కాలంలో చర్మం మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మరి దానికోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో చర్మ సంరక్షణ

వేసవి కాలంలో UV కిరణాల నుండీ మన చర్మాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవి:

సన్‌స్క్రీన్ వాడండి

సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ తప్పనిసరి. కనీసం SPF 30 ఉండే సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. ప్రతీ రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయడం మంచిది.

తేమను కాపాడుకోండి

వేసవిలో చర్మం పొడిగాను మరియు డీహైడ్రేటెడ్ గాను మారుతుంది. కాబట్టి, రోజూ మాయిశ్చరైజర్ ఉపయోగించడం అవసరం.

చర్మ శుభ్రత పాటించండి

రోజులో కనీసం రెండు సార్లు ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఆయిల్-ఫ్రీ క్లీన్సర్ వాడితే మెరుగైన ఫలితం పొందవచ్చు.

నేచురల్ ఫేస్ మాస్క్‌లు తయారుచేసుకోండి

పెరుగు, తేనె, ఆలీవ్ ఆయిల్ మిశ్రమంతో ఫేస్ మాస్క్ తయారుచేసుకొని వాడితే చర్మం తేమను నిల్వ చేసుకోవచ్చు.

సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి

వేసవి కాలంలో కాటన్ దుస్తులను ధరించడం వల్ల చర్మానికి కాంతి కలుగుతుంది.

ఇది కూడా చదవండి: సమ్మర్ కేర్… సింపుల్ టిప్స్!

వేసవి కాలంలో ఆరోగ్య సంరక్షణ

వేసవి కాలంలో ఎండతీవ్రత నుండీ మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవి:

నీటిని ఎక్కువగా తాగండి

రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఎలక్ట్రోలైట్ కలిగిన పానీయాలు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉంటుంది.

ఆహార అలవాట్లు మార్చుకోండి

వేసవి కాలంలో ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, పుచ్చకాయ వంటి వాటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

తేలికపాటి వ్యాయామం చేయండి

అధిక వేడి కారణంగా ఎక్కువ శ్రమ పడే వ్యాయామాలు మానేయాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్, యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది.

చల్లటి నీటితో స్నానం చేయండి

అసలే బయట ఎండ వేడి ఎక్కువగా ఉండుంది. దీనికి తోడు వేడి నీటితో స్నానం చేస్తే చర్మం మరింత పొడిగా మారుతుంది. కాబట్టి శరీరాన్ని చల్లబరుచుకోనేందుకు చల్లటి నీటితో స్నానం చేయాలి.

తగినంత విశ్రాంతి తీసుకోండి

ఎండ వేడిమి వల్ల శరీరానికి అలసట కలుగుతుంది. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది.

వేసవి కాలంలో పిల్లలు మరియు వృద్ధుల సంరక్షణ

పిల్లలు మరియు వృద్ధులు వడదెబ్బకు తేలికగా గురవుతారు. అందుకే ఈ క్రింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవి:

  • వారిని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య బయటికి వెళ్లనీయకూడదు.
  • తేలికపాటి, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకొనేలా చూడాలి.
  • తరచూ నీటిని తాగిస్తూ ఉండాలి.

వేసవిలో హీట్ స్ట్రోక్ నుండీ సంరక్షణ

వేసవి కాలంలో ఎండతీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో బయట ఎక్కువగా గడుపుతుంటే, మీరు హీట్ స్ట్రోక్, లేదా డీ హైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. దాని బారినుండీ రక్షించుకోవాలంటే ఈ క్రింది టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవి:

  • ఎక్కువగా ఎండలో తిరగకండి.
  • స్వీట్ డ్రింక్స్, కెఫీన్, ఆల్కహాల్ వంటి వాటిని తగ్గించండి.
  • చల్లని ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించండి.
  • శరీర ఉష్ణోగ్రత పెరిగితే తక్షణమే నీటితో మొహాన్ని కడుక్కోవాలి.

ముగింపు

వేసవి కాలంలో చర్మం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. సరైన ఆహారం, తగినంత నీరు, సన్‌స్క్రీన్ వాడకం, హాయిగా విశ్రాంతి తీసుకోవడం ద్వారా వేసవి సమస్యలను ఎదుర్కొనవచ్చు.

ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!😊😎

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment