ఈ నేచురల్ టిప్స్ తో మీ కంటి చూపును మెరుగు పరుచుకోండి!

మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియాలలో కళ్ళు కూడా ఒకటి. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో, కంటి చూపును మెరుగుపరచడానికి, అనేక సహజ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ ప్రపంచంలో మనం కంప్యూటర్ దగ్గరే గంటల తరబడి గడుపుతాము. ఇది మన కళ్ళకి విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అలా కాకుండా, మంచి కంటి చూపును కలిగి ఉండడానికి ఎలాంటి సహజ పద్ధతులని పాటించాలో ఇప్పుడు చూద్దాం.

కంటిచూపుని మెరుగుపరిచే సహజ చిట్కాలు

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం సహజసిద్ధమైన పద్ధతులు అనుసరించడం ఎంతో ప్రయోజనకరం. ఇక్కడ, త్రిఫల జలం నుండి అలోవేరా ప్యాక్ వరకు, దృష్టిని సహజంగా మెరుగుపరచే 5 మార్గాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

త్రిఫల జలం

త్రిఫల, మూడు శక్తివంతమైన ఔషధ మొక్కలైన ఆమ్ల, హరితకీ, బిభీతకీల మిశ్రమం. ఇది ముఖ్య్మగా ఆయుర్వేదంలో  ఉపయోగించబడుతుంది. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C వంటివి కంటి అలసటను తగ్గించి, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

తయారుచేసే విధానం

  • ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణంని  ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టండి.
  • ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి, దానితో కళ్లను కడగండి.
  • అలాగే నిత్యం త్రిఫల జలాన్ని త్రాగడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేసి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది.

అలో వెరా మరియు హనీ ప్యాక్

అలో వెరా కూలింగ్ లక్షణాల కోసం ప్రసిద్ధి చెందింది, అలాగే తేనె సహజ చికిత్సకారిగా పనిచేస్తుంది. ఈ రెండింటి మిశ్రమం కంటి చుట్టూ ఉన్న చర్మం యొక్క ఎర్రదనాన్ని మరియు పొడిబారిన చర్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

తయారుచేసే విధానం

  • తాజా ఆలో వేరా జెల్ ను తీసుకుని, దానిలో కొన్ని చుక్కలు ఆర్గానిక్ హనీని  కలపండి.
  • ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, 10-15 నిమిషాలు ఉంచండి.
  • తరువాత చల్లని నీటితో కడగండి.

నెయ్యి మసాజ్

ఆయుర్వేదం ప్రకారం, స్వచ్ఛమైన ఆవు నెయ్యి విటమిన్ A యొక్క సహజ మూలం. ఇది మంచి దృష్టికి అవసరం. తేలికపాటి గోరువెచ్చని నెయ్యి మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచి, కంటి అలసటను తగ్గిస్తుంది.

Illustration showing a person taking control of their healthcare journey with health icons like fitness, nutrition, medical checkups, and technology.
హెల్త్ టిప్స్: హెల్త్‌కేర్ జర్నీని కంట్రోల్ చేయడానికి 6 మార్గాలు

తయారుచేసే విధానం

  • రాత్రిపూట, ఒక చుక్క గోరువెచ్చని ఆవు నెయ్యిని తీసుకుని, కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేయండి.
  • అలాగే, రోజుకు ఒక టీస్పూన్ నెయ్యిని గోరువెచ్చటి పాలతో కలిపి త్రాగడం వల్ల ఆప్టిక్ నర్వ్ లను పోషించడంలో సహాయపడుతుంది.

సోంపు మరియు బాదం టానిక్

సోంపు గింజలు మరియు బాదం కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. సోంపు యాంటీఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉండగా, బాదం విటమిన్ E మరియు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తుంది. ఇవి వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

తయారుచేసే విధానం

  • 5-6 బాదం పప్పులని మరియు ఒక టీస్పూన్ సోంపు గింజలను రాత్రంతా నానబెట్టండి.
  • ఉదయాన్నే వాటిని గోరువెచ్చటి పాలతో కలిపి మిక్సీలో బ్లెండ్ చేసి, పడుకునే ముందు త్రాగండి.
  • ఇది రోజుకు ఒకసారి చేయడం దృష్టి స్పష్టతను మెరుగుపరచి, కంటి అలసటను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: Interventions to Prevent Myopia in East Asian Children

కంటి వ్యాయామాలు

నిత్య కంటి వ్యాయామాలు చేస్తే కంటి కండరాలను బలపరచి, దృష్టిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వ్యాయామాలు చేసే విధానం

పామ్ మసాజ్

చేతులను బాగా రుద్దుకుని, కళ్లపై ఉంచి, కొన్ని సెకన్ల పాటు విశ్రాంతి ఇవ్వండి.

నజర్ సుల్తాన్

దూరంలోని ఒక వస్తువును కొన్ని సెకన్ల పాటు చూడండి, తరువాత దగ్గరలోని ఒక వస్తువును చూడండి. ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.

A person drinking water in summer to prevent heat stroke
వడదెబ్బ ఎవరినీ వదలదు… దాన్ని ఇలా హ్యాండిల్ చేయండి
కను గుడ్లని రౌండ్ గా తిప్పటం 

కళ్లను రౌండ్ గా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి. ఇలా రోజూ కొద్దిసేపు చేస్తే,  కంటి కండరాలు  రీ-జనరేట్ అవుతాయి, వ్యాయామాలులను శక్తివంతం చేస్తుంది

ముగింపు 

ఈ సహజ పద్ధతులను నిత్యం అనుసరించడం  ద్వారా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, దృష్టిని సహజంగా మెరుగుపరచుకోవచ్చు.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment