కంటిశుక్లం గురించి మీ కళ్ళు ఏం చెప్తున్నాయి?

కంటి లెన్స్ ఎప్పుడూ చాలా క్లియర్  గానూ మరియు ట్రాన్స్పరెంట్ గానూ ఉంటుంది. ఒక చిత్రాన్ని రూపొందించడానికి ఈ లెన్స్ కాంతిని రెటీనాలోకి కేంద్రీకరిస్తుంది. దీనివల్ల మనం వస్తువులను స్పష్టంగా చూడడానికి సహాయపడుతుంది. కానీ, కొన్ని పరిస్థితులలో లెన్స్ అస్పష్టతను కలిగి ఉంటుంది. ఇది రెటీనాలోకి కాంతి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. దీని వలన దృష్టి మసకబారుతుంది. ఈ పరిస్థితిని ‘కంటిశుక్లం’ అంటారు.

సాధారణంగా కంటిశుక్లం ప్రారంభ దశలో ఎటువంటి సమస్యలను కలిగించదు. ఎందుకంటే లెన్స్‌లోని చిన్న భాగాన్ని మాత్రమే అది ప్రభావితం చేస్తుంది. కానీ, శుక్లం పెరిగేకొద్దీ, లెన్స్‌లోని ఎక్కువ భాగాలను ప్రభావితం చేయటం మొదలుపెడుతుంది. దీనివల్ల రోగికి వస్తువులను చూడటం కష్టమవుతుంది. ఫలితంగా రెండు కళ్ళు ప్రభావితమవుతాయి, నిజానికి, కంటిశుక్లం ఒక కంటి నుండి మరొక కంటికి వ్యాపించదు. కానీ, ఒక కంటిలోనే ఒకటి కంటే  మరొకటి వేగంగా అభివృద్ధి చెందుతుంది. 

40 ఏళ్లు పైబడిన వారికి కంటిశుక్లం చాలా సాధారణం. చికిత్స చేయకుండా వదిలేస్తే అది అంధత్వానికి దారితీయవచ్చు. మరి అలాంటి కంటిశుక్లాన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటిశుక్లాన్ని అభివృద్ధి చేసే అంశాలు 

కంటిశుక్లం పెరగటానికి ఈ క్రింది అంశాలు దోహదం చేస్తాయి. అవి:

  • పెరుగుతున్న వయస్సు
  • మధుమేహం
  • కాంతికి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వటం 
  • ధూమపానం
  • ఊబకాయం
  • అధిక రక్త ప్రసరణ 
  • మునుపటి గాయం లేదా వాపు
  • మునుపటి కంటి శస్త్రచికిత్స
  • కార్టికోస్టెరాయిడ్ మందులు దీర్ఘకాలికంగా ఉపయోగించటం 
  • ఆల్కహాల్ అధిక మొత్తంలో త్రాగడం

కంటిశుక్లం ఇలా నివారించండి

కంటిశుక్లం అభివృద్ధికి సంబంధించి కొన్ని అంశాలు ఇక్కడ చెప్పుకొందాం. వాటిని నివారించ గలిగితే కంటిశుక్లాన్ని నివారించినట్లే. 

Patient with chest pain showing second heart attack risk and prevention
రెండవ గుండెపోటు ప్రమాదం ఎందుకు రిస్క్ ఎక్కువ?

ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవటం 

అనారోగ్య సమస్యలు మరియు అధిక రక్త ప్రసరణ వంటివి క్యాటరాక్ట్ అభివృద్ధికి దోహదపడతాయి. అందుకే, మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. 

ఆహారం విషయంలో శ్రద్ధ వహించటం 

మీ మొత్తం కంటి ఆరోగ్యంలో ఆహారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వలన కంటి  ఆరోగ్యం మెరుగుపడడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్ మరియు గ్లుటాథియోన్ రిచ్ ఫుడ్స్ బ్రోసోలి, బచ్చలికూర, ఆవకాడోస్ మరియు గ్రేప్ ఫ్రూట్స్ వంటివి కంటి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

ధూమపానం మరియు మద్యపానం వంటివి మానుకోండి

అధిక మొత్తంలో ధూమపానం లేదా ఆల్క హాల్ వంటివి తీసుకోవడం వలన ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ముఖ్యంగా ధూమపానం చేయడం వల్ల రక్తనాళాల్లో సమస్యలు తలెత్తుతాయి.

మీ కళ్ళను కాపాడుకోండి

కంటి ఆరోగ్యానికి అవసరమైన వైద్యం సన్‌గ్లాసెస్. సన్ గ్లాసెస్ కాంతిని ఫిల్టర్ చేయడానికి మరియు హానికరమైన UV కిరణాల నుండి మీ కళ్ళను రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే పగటి పూట బయటకి వెళ్ళినప్పుడల్లా సన్‌గ్లాసెస్ ధరించడం ఒక మంచి ఆలోచన. సూర్యుడు ప్రకాశవంతంగా ఒకే కోణంలో తీక్షణంగా మీ దృష్టికి భంగం కలిగిస్తున్నట్లైతే, సన్‌గ్లాసెస్ ధరించటం ఒక బెటర్ ఛాయిస్. 

ఏడాది కొకసారి కంటి వైద్యుడిని సందర్శించండి

ఇది కంటిశుక్లాలను నిరోధించనప్పటికీ, పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడంలో ఇది మీకు సహాయపడుతుంది. అలాగే, మాస్క్యులర్ క్షీణత మరియు గ్లాకోమా వంటి వాటిని ముందుగానే గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. 

A close-up of a person sneezing in a doctor's office, a visual representation of respiratory infection symptoms.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు: లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణా మార్గాలు

చివరి మాట

మీ రోజువారీ జీవితంలో మీరు మార్పులను అనుభవిస్తుంటే, దయచేసి మీ డాక్టర్‌ని తొలిదశలో సంప్రదించండి! లేదంటే క్యాటరాక్ట్ సమస్యలని ఎదుర్కొనవచ్చు.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment