మన డైలీ రొటీన్ లో మనం తీసుకొనే డైట్ తో పాటు తాగే వాటర్ కి కూడా ఓ లెక్క ఉంది. సాదారణంగా మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తెగ్గితే… ఇమ్యూన్ సిస్టమ్ వీకవుతుంది. దీనివల్ల తరచుగా రోగాల బారిన పడతాం. అందుకే ఎల్లప్పుడూ తగినంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కానీ సీజన్ ని బట్టి మనం తాగే వాటర్ పర్సంటేజ్ మారుతుంటుంది. మిగతా సీజన్లతో పోల్చి చూస్తే… వింటర్ లో చలి కారణంగా తక్కువ నీరు తాగుతుంటాం. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? వింటర్ సీజన్లో కూడా డీ హైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే మన బాడీలో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి? అనే విషయాల గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
శరీర నిర్వహణ కోసం నీరు మనకు చాలా అవసరం. నీరు మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని వల్ల శరీరంలో నీటి కొరత అనేదే ఉండదు. కానీ, వింటర్ సీజన్ అలా కాదు, ఎటు చూసినా చలి చంపేస్తుంటుంది. మన బాడీ ఎప్పుడూ వెచ్చదనాన్నే కోరుకుంటూ ఉంటుంది. అందుకే వాటర్ కి బదులు వేడి వేడి కాఫీ, టీ లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు.
అందుకే చర్మం పొడిబారటం, పెదాలు పొడిబారడం అలాగే పెదవులపై పగుళ్లు ఏర్పడటం, కొన్నిసార్లు ఆ పగిలిన పెదాలనుంచి రక్తం కారటం, ముఖంలో మెరుపు తగ్గడం, ముఖంపై మచ్చలు, ముడతలు ఏర్పడటం, ఇలా అనేక సమస్యలు ఏర్పడతాయి. ఇవి మాత్రమే కాదు, నీటిని తక్కువగా తాగటం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలన్నా కావాల్సినంత నీటిని తాగాలి.
తక్కువ నీరు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బరువు అదుపులో ఉండేలా ఎప్పుడూ కావాల్సినంత నీటిని తాగాలి. అంతేకాదు.. నీళ్లు తక్కువగా తాగడం వల్ల ముఖంలో మెరుపు తగ్గి, ముఖంపై మచ్చలు, ముడతలు వంటివి ఏర్పడతాయి.
ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలంటే, తగిన మోతాదులో నీటిని తాగాలి. అందుకోసం మనం రోజుకు 4 నుంచీ 5 లీటర్లు అంటే 8 నుంచీ 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. ఒకవేళ చలికాలంలో చల్లటి నీటిని తాగలేక పోతే… దానికి బదులు గోరువెచ్చని నీటిని తాగినా మంచిదే! గోరువెచ్చని నీటి వల్ల ఇంకా అదనపు ప్రయోజానాలు కూడా పొందవచ్చు.
ముగింపు
ఏదేమైనా శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా ఉండాలంటే, దానికి సరిపడా నీటిని అందించాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరం తేమని కోల్పోకుండా ఉండటమే కాకుండా చర్మం ఉత్తేజితమవుతుంది.
డిస్క్లైమర్:
ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.