హోలీ 2025: హోలీ రంగుల నుంచి మీ చర్మం, జుట్టును ఇలా కాపాడుకోండి!

హోలీ ఒక కలర్ ఫుల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ రోజు పెద్దవాళ్ళంతా చిన్నపిల్లల్లా మారిపోయి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొనే రోజు. అందరూ ఆనందోత్సాహాలతో సెలెబ్రేట్ చేసుకొనే రోజు.

అయితే,హోలీ సందర్భంగా ఉపయోగించే కలర్స్ లో కెమికల్స్ కలిసి ఉండటం చేత అవి మనపై పడ్డప్పుడు చర్మం మరియు జుట్టు ఎఫెక్ట్ అవుతాయి. ఆ కెమికల్స్ ప్రభావం నుండి రక్షించుకోవడం ఎంతగానో అవసరం. హోలీ కలర్స్ లో చాలావరకూ సింథటిక్ కలర్సే ఉంటాయి. అవి చర్మాన్ని పొడిబార్చడం, జుట్టును పొడిబార్చడం వంటి సమస్యలను కలిగించవచ్చు. ఈ సమస్యల నుండి బయటపడటానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూసేద్దామా!

Table of Contents

హోలీ పండుగకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హోలీ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా రంగులు చల్లుకోవాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కానీ అంతకంటే ముందు హోలీ రంగుల వల్ల మీ స్కిన్, అండ్ హెయిర్ దెబ్బతినకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముందుగా…

చర్మ సంరక్షణ

హోలీ ఆదేముందు చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్ పాటించండి.అవి:

బాడీ లోషన్ లేదా కొబ్బరి నూనె

హోలీ ఆడే ముందు బాడీ లోషన్ లేదా కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవాలి. ఇది రంగులు నేరుగా చర్మంపై పడకుండా ప్రొటెక్టివ్ లేయర్‌లా పనిచేస్తుంది.

సన్‌స్క్రీన్

హోలీ ప్రధానంగా ఎండలో ఆడతారు కాబట్టి, SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండే సన్‌స్క్రీన్‌ని తప్పనిసరిగా ఉపయోగించాలి.

నెయిల్ పాలిష్

రంగులు గోళ్ళలోకి పోకుండా ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ వాడండి.

లాంగ్ స్లీవ్స్ & ఫుల్ ప్యాంట్

చర్మాన్ని కప్పేలా ఉన్న బట్టలు ధరించడం వల్ల రంగులు నేరుగా చర్మానికి తగిలే అవకాశం తగ్గుతుంది.

జుట్టు సంరక్షణ

హోలీ ఆదేముందు జుట్టు సంరక్షణ కోసం ఈ టిప్స్ పాటించండి. అవి:

నూనె

హోలీ ఆడే ముందు కొబ్బరి నూనె లేదా బాదం నూనె జుట్టుకు పట్టించి గట్టిగా ముడివేయాలి. ఇది రంగులు జుట్టులోకి పోయే అవకాశాన్ని తగ్గిస్తుంది.

క్యాప్ లేదా స్కార్ఫ్

రంగులు నేరుగా జుట్టుపై పడకుండా ఉండటానికి ఓ హ్యాట్ లేదా స్కార్ఫ్ ఉపయోగించాలి.

జుట్టు ముడి

ఓ పొనీటైల్, జడ లేదా బన్‌గా పెట్టుకోవడం వల్ల రంగులు మీ జుట్టు లోపలికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది.

హోలీ ఆడుతున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

పైన చెప్పుకొన్నవి మాత్రమే కాకుండా హోలీ ఆడుతున్నప్పుడు మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవి:

ఒరిజినల్ కలర్స్ మాత్రమే వాడండి

కెమికల్ కలర్స్ వాడకుండా హోమ్‌మేడ్ నేచురల్ కలర్స్ లేదా ఆర్గానిక్ కలర్స్‌ను ఉపయోగించండి.

అతిగా రంగులను మర్దించవద్దు

రంగులు చర్మం మీద ఎక్కువ రుద్దితే, వాటిలోని రసాయనాలు లోపలకి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది.

కంట్లోకి రంగు పోకూడదు

హోలీ ఆడేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవడం మంచిది. రంగు కళ్లలో పడితే వెంటనే శుభ్రమైన నీటితో కడగాలి.

నీటిని ఎక్కువగా తాగాలి

ఈ సమయంలో డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఎక్కువ నీరు తాగడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణకి ఈ టిప్స్ పాటించండి!

హోలీ తర్వాత చర్మం & జుట్టును శుభ్రం చేసుకునే విధానం

హోలీ ఆడకముందు, ఆడిన తర్వాత తీసుకొనే జాగ్రత్తలు ఒక ఎత్తైతే, హోలీ ఆడిన తర్వాత చర్మం, మరియు జుట్టుని శుభ్రం చేసుకొనే విధానం మరొకఎత్తు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకోండి!

చర్మం శుభ్రం చేసుకోవడం

హోలీ ఆడిన తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకొనే విధానాలు కొన్ని ఉన్నాయి. అవి:

నెమ్మదిగా కడగండి

ఒకేసారి బలంగా రుద్ది చర్మాన్ని క్లీనింగ్ చేయకూడదు. బేబీ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌తో మృదువుగా మర్దించి, గోరు వెచ్చటి నీటితో కడగాలి.

మైల్డ్ సోప్ వాడండి

హర్ష్ కెమికల్ సోప్స్ వాడటం వల్ల చర్మం పొడిబారిపోతుంది. అందుకే మైల్డ్ సోప్ లేదా హర్బల్ సోప్ వాడాలి.

ఫేస్ ప్యాక్ అప్లై చేయండి

నేచురల్ చర్మ సంరక్షణ కోసం పెరుగు, బేసన్ & తేనె కలిపిన ఫేస్ ప్యాక్‌ని అప్లై చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.

మాయిశ్చరైజర్ తప్పనిసరి

రంగుల ప్రభావం తగ్గించడానికి మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.

జుట్టును శుభ్రం చేసుకోవడం

హోలీ ఆడిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకొనే విధానాలు కొన్ని ఉన్నాయి. అవి:

ఆయిల్ థెరపీ

రంగులు పూర్తిగా తొలగించడానికి ముందు కొబ్బరి నూనెను తలకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచాలి.

మైల్డ్ షాంపూ

హర్ష్ కెమికల్ షాంపూలను వాడకుండా మైల్డ్ షాంపూ ఉపయోగించి జుట్టును కడుక్కోవాలి.

కండిషనర్

రంగులు జుట్టును పొడిబారేలా చేసే ప్రమాదం ఉన్నందున, వాటిని కండిషనర్ ఉపయోగించి మృదువుగా ఉంచాలి.

నేచురల్ హెయిర్ ప్యాక్

పెరుగు, గుడ్డు, ఆలివ్ ఆయిల్ కలిపిన హెయిర్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

హోలీ తర్వాత చర్మం మరియు జుట్టును రీహైడ్రేట్ చేయడం

  1. కెమికల్ ఫ్రీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడండి
  2. అరటి పండు & తేనె ఫేస్ మాస్క్ అప్లై చేయండి
  3. అలోవెరా జెల్‌తో చర్మాన్ని మృదువుగా ఉంచండి
  4. జుట్టుకు ఆలివ్ ఆయిల్ & పెరుగు మిక్స్ చేసుకుని అప్లై చేయండి

ముగింపు

హోలీ పండుగను ఆనందంగా, మజాగా జరుపుకోవాలి. కానీ, రంగులు మిగిల్చే దుష్ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మేం చెప్పిన చిట్కాలను పాటించి, మీ హోలీని సురక్షితంగా, మధురంగా జరుపుకోండి!

హ్యాపీ హోలీ! 🌸🎨🎊

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment