ఈమధ్య కాలంలో రిలేషన్ షిప్ లో బ్రేకప్ అనేది చాలా కామన్ అయిపొయింది. ప్రమాదకరమైన సంబంధాల్లో విభేదాలు రావడం సహజం. కానీ, చాలా చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా పార్టనర్స్ మద్య గొడవలు తలెత్తుతున్నాయి. చివరికది బ్రేకప్ కి దారి తీస్తుంది. మరి కపుల్స్ లో బ్రేకప్‌కు కారణమయ్యే అంశాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
బ్రేకప్‌కు ప్రధాన కారణాలు
రిలేషన్ షిప్ లో బ్రేకప్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అవి:
నమ్మకం లేకపోవటం
రిలేషన్ షిప్ లో ఒకాసారి నమ్మకాన్ని కోల్పోతే, అది పెద్ద ఇష్యూగా మారుతుంది. అబద్ధాలు చెప్పడం, చీట్ చేయడం, ఇతర వ్యక్తులతో రిలేషన్ షిప్ మైంటైన్ చేయటం వల్ల పార్టనర్స్ లో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. నమ్మకంలేని ఏ రిలేషన్ షిప్ అయినా ఎక్కువ కాలం నిలబడదు.
అనుమానాలు
సంబంధంలో అనుమానాలు పెరిగితే విభేదాలు ఏర్పడి చివరకు బ్రేకప్‌కి దారి తీస్తుంది. అతి అనుమానం వ్యక్తిత్వాన్ని చెడగొడుతుంది. ముఖ్యంగా ఒకరి ప్రైవసీని గౌరవించకపోతే మరింత సమస్యలు వస్తాయి.
కమ్యూనికేషన్ లోపం
ఒక రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే, ముఖ్యంగా వారిమద్య కమ్యూనికేషన్ బాగుండాలి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి సరైన కమ్యూనికేషన్ అవసరం. మాట్లాడకుండా ఉండటం, ఎలాంటి సమస్యలైనా ఎక్స్ ప్రెస్ చేయకుండా ఉండటం, సపోర్ట్ చేయకపోవడం వల్ల విభేదాలు పెరుగుతాయి.
స్వభావాలలో మార్పు
ఒకరికి ఒకటి ఇష్టం, మరొకరికి మరొకటి ఇష్టం. ఇలా ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి. కానీ అవి పూర్తిగా విభిన్నంగా ఉంటే, సరిపోలని వ్యక్తిత్వం వల్ల గొడవలు మామూలే. ఈ తేడాలు ఎక్కువైతే సంబంధం కొనసాగడం కష్టమవుతుంది.
టైమ్ స్పెండ్ చేయలేకపోవడం
బిజీ లైఫ్‌లో మన పార్టనర్ తో సరైన సమయం స్పెండ్ చేయలేకపోతే, రిలేషన్ షిప్ వీక్ అవుతుంది. ప్రత్యేకంగా ఒకరి కోసం టైమ్ స్పెండ్ చేయలేకపోవడం, వారితో క్వాలిటీ టైం గడపకపోవడం వల్ల దూరమైపోతారు.
ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్
డబ్బు అనేది జీవితానికి చాలా ముఖ్యమైనది. కానీ డబ్బుతో సంబంధాన్ని కొలిచినా, లేదా ఆర్ధిక సమస్యలు తలెత్తినా, సంబంధాలు దెబ్బతింటాయి. డైలీ అలవాట్లలో తేడాలు ఉంటే, అంటే… ఒకరు ఎక్కువ ఖర్చు చేస్తే, మరొకరు పొదుపుగా ఉండాలనుకుంటే గొడవలు రావచ్చు.
ఫిజికల్ ఎట్రాక్షన్ తగ్గిపోవడం
పెళ్లయిన తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరిపై మరొకరికి ఫిజికల్ ఎట్రాక్షన్ తగ్గిపోతుంది. లవ్ లో ఉన్నప్పుడు ఫిజికల్ ఎట్రాక్షన్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది. కానీ దానిని కంటిన్యూ చేయటానికి మ్యూచ్వల్ కేర్ అవసరం.
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇంటర్ వెన్షన్
ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరికైనా ముఖ్యమైనవాళ్ళే! కానీ రిలేషన్ షిప్ లో వాళ్ళు ఎక్కువగా ఇంటర్ ఫియర్ అవుతుంటే. రిలేషన్ లో ప్రొబ్లెమ్స్ వస్తుంటాయి.
మెంటల్ స్ట్రెస్
ప్రస్తుత కాలంలో స్ట్రెస్ అనేది చాలా సాధారణంగా మారింది. జాబ్ స్ట్రెస్, పర్సనల్ స్ట్రెస్ వల్ల చాలా మంది తమ పార్టనర్ కి దూరమవుతారు. ఈ స్ట్రెస్ పెరిగితే, రిలేషన్ షిప్ కూడా వీకవుతుంది.
ఇది కూడా చదవండి: హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఈ రూట్ వెజిటబుల్స్ ట్రై చేయండి!
సెల్ఫిష్ నేచర్
రిలేషన్ షిప్ లో ఇద్దరూ బాధ్యతలని బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ ఒకరు మాత్రమే బాధ్యత తీసుకుంటే, మరొకరు సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తే, అది గొడవలకు దారి తీస్తుంది.లవ్, రిలేషన్ లో సెల్ఫిష్ నెస్ పెరగటం వల్ల విభేదాలు పెరుగుతాయి.
జెలసీ ఫీలవ్వటం
కొంతమంది తమ పార్టనర్ ని కంప్లీట్ గా తమ కంట్రోల్ లో ఉంచుకోవాలని అనుకుంటారు. ఇతరులతో మాట్లాడనివ్వక పోవడం, అతిగా జెలసీ ఫీలవ్వటం వల్ల కూడా రిలేషన్ దెబ్బతింటుంది. ఇది బ్రేకప్‌కు ఒక ప్రధాన కారణంగా మారుతుంది.
రొటీన్ లైఫ్ బోర్ కొట్టటం
కొన్నిసార్లు రిలేషన్ షిప్ లో కొత్తదనం తగ్గిపోతే, బోర్ అనిపిస్తుంది. ప్రతి రోజు లైఫ్ రొటీన్ గా నడిస్తే, లైఫ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మార్పులు లేకపోతే, ఒకరి మీద ఒకరికి ఆసక్తి తగ్గిపోయి బోర్ కొడుతుంది.
ఫ్యూచర్ గురించి డిఫెరెంట్ థింకింగ్
కొంతమంది కపుల్స్ ఫ్యూచర్ గురించి డిఫెరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉంటారు. ఉదాహరణకు, ఒకరు పిల్లలు కావాలనుకుంటే, మరొకరు వద్దనుకోవటం, ఒకరు విదేశాలకు వెళ్లాలనుకుంటే, మరొకరు తన దేశంలో ఉండాలనుకోవటం ఇలాంటి డిఫెరెంట్ థింకింగ్ కూడా రిలేషన్ ని బ్రేకప్ స్టేజ్ కి తీసుకెళ్తాయి.
మ్యూచ్వల్ రెస్పెక్ట్ లేకపోవడం
రిలేషన్ షిప్ లో మ్యూచ్వల్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఒకరిపై మరొకరికి రెస్పెక్ట్ ఉండాలి. అలా కాకుండా పార్టనర్ ఫీలింగ్స్ ని పట్టించుకోక పోవటం, ఇన్సల్ట్ చేయటం, మెంటల్ టార్చర్ చేయటం వంటి విషయాలు సంబంధాన్ని అస్తవ్యస్తం చేస్తాయి.
లాంగ్-డిస్టన్స్ రిలేషన్షిప్స్
లాంగ్-డిస్టన్స్ రిలేషన్షిప్ కొనసాగించడం చాలా కష్టం. కెరీర్ పరంగా దూరంగా ఉండాల్సి ఉంటే, మానసికంగా దగ్గరగా ఉండాలి. ఇలాంటి సందర్భాలలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. లేదా టైంని బట్టి వీలైనంత ఎక్కువగా మాట్లాడుకొంటూ ఉండాలి. అలా జరగకపోతే కూడా బ్రేకప్ అయ్యే చాన్స్ ఉంది.
ఫిజికల్, మెంటల్ హారస్‌మెంట్
రిలేషన్ షిప్ లో ఫిజికల్, మెంటల్ హారస్‌మెంట్ ఉంటే, అది బ్రేకప్‌కు ఒక ప్రధాన కారణం అవుతుంది. పార్టనర్ వైలెంట్ గా మారితే, వారి వల్ల మెంటల్లీ డిప్రెస్ అయితే అలాంటి వారిని వదిలేయడమే మంచిది.
అండర్ స్టాండింగ్ లేకపోవటం
రిలేషన్ లో మ్యూచ్వల్ అండర్ స్టాండింగ్ కూడా ఉండాలి. ఒకరినొరొకరు అర్థం చేసుకోలేకపోతే, చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారతాయి. సరైన అండర్ స్టాండింగ్ లేకపోతే, ఏ రిలేషన్ షిప్ కూడా కంటిన్యూ అవ్వదు.
లవ్ ఫెయిల్యూర్
రిలేషన్ షిప్ స్టార్టింగ్ లో ఎక్కువ లవ్, బాండింగ్, కేర్ వంటివి చూపించి, టైం గడిచేకొద్దీ ఇవన్నీ తగ్గిపోతే, ఆ రిలేషన్ వీకవుతుంది. లవ్ లో ఉన్నప్పుడు మాత్రమే రిలేషన్ షిప్ సజీవంగా ఉంటుంది.
ముగింపు
ఇవే కాదు, వీటితో పాటు మరెన్నో చిన్న చిన్న కారణాలు బ్రేకప్‌కి దారి తీస్తాయి. కానీ ఒక రిలేషన్ షిప్ ని నిలబెట్టుకోవడానికి మ్యూచ్వల్ ట్రస్ట్, లవ్, రెస్పెక్ట్, కాన్వర్జేషన్ కరెక్ట్ వేలో ఉండాలి. చిన్న చిన్న సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటే, బ్రేకప్ అనేది కేవలం ఒక ఆప్షన్‌గా మాత్రమే మిగిలిపోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, కలిసి ఉండేందుకు కృషి చేస్తే సంబంధం మరింత బలంగా మారుతుంది.
డిస్క్లైమర్
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు