అర్ధరాత్రిళ్లు గొంతు ఎండిపోవడం… దాహం వేయటం…నిద్ర మేల్కోవడం… ఇదంతా చాలా చిరాకు తెప్పించే విషయం. ఇలా నిద్రించే సమయంలో తరచూ మెలకువ రావటం వల్ల నిద్రకి ఆటంకం ఏర్పడుతుంది. అయితే, ఈ సమస్య ఎక్కువగా సమ్మర్ సీజన్లో మాత్రమే వస్తుందని చాలామంది భావించి లైట్ తీసుకుంటారు.
నిజానికి ఇది డీహైడ్రేషన్ వల్ల మాత్రమే కాదు, ఇంకా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరగవచ్చు. అందువల్ల తరచూ ఇదే సమస్య మీకు ఎదురవుతుంటే… దానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోండి.
డీహైడ్రేషన్:
సాదారణంగా ప్రతి వ్యక్తి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువగా తాగితే శరీరానికి సరిపడేంత నీరు తాగలేదని అర్థం. శరీరంలో వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతే… బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. మీరు దాహంతో వేకప్ అవుతున్నారు అంటే… దానికి గల మేజర్ రీజన్ ఈ డీహైడ్రేషన్. ఇంకా పిల్లలు, వృద్ధుల్లో వారి హైడ్రేషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందువల్లనే వీళ్ళు తరచూ డీహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు.
అనీమియా:
అనీమియా అనేది రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రభావితం చేసే ఒక రుగ్మత. ఈ అనీమియా కొన్నిసార్లు డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. అందువల్ల ఇది రాత్రి వేళ మిమ్మల్ని మేల్కొల్పుతుంది. రక్తహీనత సాధారణంగా మైల్డ్ కండిషనే కావచ్చు, కానీ దానిని చికిత్స చేయకుండా వదిలేస్తే, అది మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
డయాబెటిస్:
డయాబెటిస్ మెల్లిటస్, మరియు డయాబెటిస్ ఇన్సిపిడస్ వంటి కొన్ని మెడికల్ కండిషన్స్ అధిక దాహాన్ని కలిగిస్తాయి. మధుమేహం ఉన్నవారు షుగర్ ని సరిగ్గా ప్రాసెస్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఫలితంగా, వారి కిడ్నీస్ నేచురల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రీస్టోర్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తాయి. ఈ క్రమంలో యూరినేషన్ ని ఇంక్రీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఎక్కువసార్లు యూరిన్ బయటికి వెళుతుందో… అప్పుడు శరీరంలోని లిక్విడ్స్ తగ్గిపోయి… విపరీతమైన దాహం వేస్తుంది.
క్రానిక్ డిసీజెస్:
గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, లివర్ ఫెయిల్యూర్ వంటి క్రానిక్ డిసీజెస్ ఏవైనా ఉంటే, వాటి వల్ల బాడీలోని వాటర్, మరియు ఎలక్ట్రోలైట్ లెవెల్స్ బ్యాలెన్స్ అవ్వకపోతే, అలాంటి సందర్భాలలో తీవ్రమైన దాహం అనిపించవచ్చు.
స్లీప్ అప్నియా:
స్లీప్ అప్నియా ఉన్నవారికి రాత్రిపూట నిద్రించే సమయంలో ఒకానొక దశలో ముక్కు నుండీ శ్వాస అందక… నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఈ సమయంలో నోరు పొడిబారి పోయి… గొంతు ఎండిపోతుంది. అలాంటప్పుడు చాలా దాహం వేస్తుంది. సాదారణంగా ఈ సమస్య ఉన్నవారు continuous positive airway pressure (CPAP) అనే డివైస్ ని ఉపయోగించటం వల్ల నోరు పొడిబారదు.
మెనోపాజ్:
ముఖ్యంగా ఆడవారిలో మెనోపాజ్ సమయంలో వారి హార్మోన్లలో తేడాలు వస్తాయి. రీ-ప్రొడక్టివ్ హార్మోన్స్, ఈస్ట్రోజెన్, మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ శరీరంలోని ద్రవాలని అదుపు చేయటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ కారణంగానే మెనోపాజ్ సమయంలో, శరీరంలో హార్మోన్లలో మార్పులు రావటం, వేడి ఆవిర్లు పుట్టటం, రాత్రిపూట చెమటలు పట్టటం, మరియు దాహం పెరగడానికి కారణమవుతాయి.
ఎలక్ట్రోలైట్స్:
బాడీ ఫంక్షనింగ్ సరిగ్గా జరగాలంటే, దానికి సరైన మోతాదులో ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ అవసరమవుతాయి. అదే బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లూయిడ్స్ అవసరమవుతాయి. ఆ సమయంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్-బ్యాలెన్స్ అవుతాయి. ఉదాహరణకి ఎక్కువసేపు వర్కౌట్స్ చేయడం, ఎండలో పనిచేయటం, వాంతులు, విరేచనాలు, లేదా జ్వరం కారణంగా శరీరంలో ఎక్కువ ఫ్లూయిడ్స్ ని కోల్పోతారు. వీటిని ఫుల్ ఫిల్ చేయటానికి శరీరానికి ఎక్కువ లిక్విడ్స్ అవసరమవుతాయి.
కాఫీ, టీలు:
కొంతమంది పగలు కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల నీటిని తక్కువగా తాగుతుంటారు. కెఫీన్ మీ శరీరంలోని వాటర్ పర్సంటేజ్ ని తగ్గించేస్తుంది. దీనివల్ల శరీరం తేమను కోల్పోతుంది. దీంతో రాత్రుళ్ళు గొంతు ఎండిపోతుంది.
హ్యాంగోవర్:
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొనే వారికి హ్యాంగోవర్ అనేది కామనే! ముందురోజు రాత్రి ఆల్కహాల్ తీసుకొన్నట్లయితే, మరుసటి రోజంతా దాని తాలూకు ప్రభావం వారిపై ఉంటుంది. ఫలితంగా రోజంతా హ్యాంగోవర్ అవుతారు. శరీరం సాధారణం కంటే వేగంగా ద్రవాలను కోల్పోతుంది. తాగే నీరు సరైన మిశ్రమంలో హైడ్రేట్ కాకపోతే, వెంటనే డీహైడ్రేట్ అవుతుంది. ఈ క్రమంలో రాత్రి పడుకున్నప్పుడు త్రోట్ డ్రై అయిపోతుంది.
మసాలాలు:
మసాలా ఫుడ్ తీసుకోవటం వల్ల బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఈ కారణంగా కూడా రాత్రి వేళల్లో గొంతు ఎండిపోయి… దాహం వేస్తుంది.
ఉప్పు:
తినే ఆహారంలో ఉప్పుని ఎక్కువగా తీసుకొంటే, అది చెమట రూపంలో శరీరం నుండీ విపరీతంగా బయటకి వెళ్లి పోతుంది. దీంతో బాడీ వెంటనే డీహైడ్రేషన్ కి గురవుతుంది. వెంటనే శరీరంలో హైడ్రేషన్ లోపించి గాఢనిద్రలో దాహం వేస్తుంది.
హ్యూమిడిటీ:
రూమ్ టెంపరేచర్ హ్యూమిడిటీ కలిగి ఉంటే… అలాంటి గదిలో నిద్రించడం వల్ల గొంతు ఎండిపోయి దాహంతో మేల్కొనే అవకాశం ఉంది. సాదారణంగా పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలలో గాలిలో హ్యూమిడిటీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే అలాంటి ప్రాంతాలకి వెళ్ళినప్పుడు గొంతు పిడచగట్టుకుని పోతుంది. ఇక వింటర్ సీజన్లో కూడా గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు ఉన్న గదిలో నిద్రించటం వల్ల గాలిలోని తేమ మొత్తం అవే పీల్చేసుకుంటాయి. దీంతో కూడా నిద్రలోనే గొంతు ఎండిపోయి… దాహం వేస్తుంది.
ముగింపు:
కాబట్టి అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేసి… నిద్రనుండీ మేల్కొన్నట్లితే, దానికి కారణం దానికి కారణం మీరు నిద్రించే విధానం, వాతావరణం, గది ఉష్ణోగ్రత, హైడ్రేషన్, మీ అలవాట్లు, లేదా మీరు తీసుకుంటున్న మందులు కావచ్చు. కారణం ఏదైనా సరే, రొటీన్ గా ప్రతిరోజూ మీరు నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నట్లయితే, అది మీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి ప్రభావం చూపిస్తుంది. అలాంటి సందర్భంలో వెంటనే డాక్టర్ ని సంప్రదించటం మంచిది.