గ్రీన్ టీ తో ఇన్ని ప్రయోజనాలా..!

గ్రీన్ టీ హైలీ న్యూట్రీషియస్ బేవరేజ్ అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఇది మైల్డ్ ఫ్లేవర్ కలిగి ఉండి… వాటర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు తీసుకునే డ్రింక్. గ్రీన్ టీ యొక్క న్యూట్రిషనల్ వ్యాల్యూసే దానికి ఆ స్థానం తెచ్చిపెట్టాయి. అయితే, గ్రీన్ టీని అసలు ఎందుకు తాగాలో తెలుసుకోండి.

Table of Contents

గ్రీన్ టీ ఉపయోగం

ప్రెజెంట్ జనరేషన్ లో ఎక్కువగా వాడే హెల్త్ డ్రింక్స్ లో గ్రీన్ టీ ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్లు, పాలీఫినాల్స్ వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో తోడ్పడతాయి. అందుకోసమే గ్రీన్ టీని ఖచ్చితంగా తాగాలి. ఇటీవల డాక్టర్లు కూడా దీనిని ప్రిఫర్ చేస్తున్నారు.

గ్రీన్ టీ తయారీ

ముందుగా నీటిని మరిగించి ఒక బౌల్ లో పోయండి. అందులో గ్రీన్ టీ లీవ్స్ కానీ, లేదా గ్రీన్ టీ బ్యాగ్ కానీ వేయండి. ఒక రెండు, మూడు నిమిషాలు అలానే మూత పెట్టి ఉంచేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత మీ కప్పుల్లో ఈ గ్రీన్ టీ పోసిన తరువాత దానికి కొంచెం నిమ్మ రసం కానీ, తేనె కానీ మీ ఇష్టాన్ని బట్టి కలుపుకొని తాగండి.

గ్రీన్ టీ లో ఉండే పోషక విలువలు

గ్రీన్ టీ లో ప్రొటీన్, కెఫిన్, జింక్, ఐరన్, మెగ్నీషియం, రాగి, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ సి వంటివి పుష్కలంగా లభిస్తాయి.

గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్… మన శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.ఈ రకంగా ఇది మొత్తం ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. అందుకే ఇప్పుడు గ్రీన్ టీ వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: గ్రీన్ టీ ఇలా తాగడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువ

రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది

గ్రీన్ టీ “అథెరోస్క్లెరోసిస్” వంటి సర్క్యులేటరీ డిసీజెస్ ని రెడ్యూస్ చేస్తుంది. ధమనులు మరియు సిరల లోపలి పొరలో కనిపించే కణాలకు తెల్ల రక్త కణాలు అంటుకొని ఉన్నప్పుడు అథెరోస్క్లెరోసిస్ సంభవించవచ్చు. ఆక్సిడైజ్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఈ వైట్ సెల్స్ ఇలా మారతాయి. గ్రీన్ టీలోని కాటెచిన్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తుంది దానిద్వారా అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది

ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వారు, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ గ్రీన్ టీ తీసుకుంటే, బరువు తగ్గుతారు. ఓవరాల్ గా హెల్త్ కూడా బాగుంటుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువవడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ గుండె జబ్బులకి దారి తీస్తాయి. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఆర్టరీస్‌లో ప్లేక్ ఫార్మ్ అయ్యి హార్ట్ డిసీజెస్ కీ, హార్ట్ స్ట్రోక్‌కీ దారి తీస్తుంది. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఈ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ని ఆక్సిడైజ్ అవ్వకుండా కాపాడతాయి.

మెదడుని చురుకుగా మారుస్తుంది

గ్రీన్ టీ రెగ్యులర్‌గా తాగడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ రిస్క్ కూడా తగ్గిస్తుంది. స్ట్రయిట్ గా చెప్పాలంటే, బ్రెయిన్‌ని హెల్దీగా మారుస్తుంది.

బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది

గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించకుండా గ్రీన్ టీలో ఉండే కాటెచిన్‌లు నిరోధిస్తాయి. అలానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.

ఓరల్ డిసీజెస్ ని తగ్గిస్తుంది

గ్రీన్ టీ దంతాల మద్య ఏర్పడే క్యావిటీలని తగ్గిస్తుంది. నోటి దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులకు మూలమైన బ్యాక్టీరియాని ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డిస్ట్రాయ్ చేస్తాయి. ఇంకా ఓరల్ కాన్సర్ రిస్క్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది.

ఏజింగ్ సమస్యలని పోగొడుతుంది

ఫ్రీ రాడికల్స్ కారణంగా మన స్కిన్ డ్యామేజ్ కాకుండా గ్రీన్ టీ లో ఉండే పాలీ ఫెనాల్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా చర్మంపై ముడతలు రాకుండా చేసి కొలాజెన్ ఏజీయింగ్‌ని ఇవి డిలే చేస్తాయి.

హైబీపీ రిస్క్ ని తగ్గిస్తుంది

గ్రీన్ టీ వల్ల హైబీపీ రిస్క్ తగ్గుతుంది. హై బ్లడ్ ప్రెజర్ కి కారణమయ్యే హార్మోన్‌ని గ్రీన్ టీ అణిచి వేస్తుంది.

ఇది కూడా చదవండి: జామ ఆకుల టీ తో ప్రయోజనాలెన్నో!

హెయిర్ ఫాల్ ని అరికడుతుంది

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్‌ లాస్‌ని ప్రివెంట్ చేస్తాయి. హెయిర్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది.

కాన్సర్ రిస్క్ ని రెడ్యూస్ చేస్తుంది

ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాన్సర్‌కి దారితీస్తుంది. ఈ డ్యామేజ్ జరగకుండా గ్రీన్ టీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఫలితంగా కాన్సర్ వచ్చే రిస్క్ ని కూడా తగ్గిస్తుంది.

బోన్ హెల్త్ ని కాపాడుతుంది

గ్రీన్ టీలో ఉండే ఫ్లోరైడ్ కంటెంట్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. ఆస్టియో పొరాసిస్ వచ్చే రిస్క్ ని కూడా తగ్గిస్తుంది.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండీ ప్రొటెక్ట్ చేస్తుంది

గ్రీన్ టీలో ఉండే కాటెచిన్‌లు బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది ఈకోలి మరియు సూడోమోనాస్ వంటి బాక్టీరియాకు వ్యతిరేకంగా పని చేస్తుంది.

బౌల్ డిసీజ్ ని తగ్గిస్తుంది

ఈ బౌల్ డిసీజ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చిన ఇన్ఫ్లమేషన్ కారణంగా వస్తుంది. అతిసారం, కడుపునొప్పి, అలసట మరియు ఆకలి తగ్గడం దీని యొక్క ప్రధాన లక్షణాలు. అందుకే డైజెస్టివ్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే గ్రీన్ టీ వాటిని పారద్రోలుతుంది.

మొటిమలని నివారిస్తుంది

గ్రీన్ టీ మొటిమలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కాటెచిన్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల, ఇది ఇన్ఫ్లమేటరీ సైటోకిన్‌లను తగ్గిస్తుంది. అలానే, మొటిమలకు కారణమైన సూక్ష్మజీవికి వ్యతిరేకంగా పని చేస్తుంది.

ఫ్యాటీ లివర్ ని తగ్గిస్తుంది

గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ కాలేయ వ్యాధులపై పోరాడి… దాని పనితీరును మెరుగుపరుస్తుంది.

గ్రీన్ టీ వలన ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్

గ్రీన్ టీ తాగటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి:

  • భయాన్ని మరియు ఆందోళనను కలిగిస్తుంది
  • ఇది తలనొప్పికి కారణం కావచ్చు
  • ఇది వణుకుకు కారణం కావచ్చు
  • ఇది రక్తపోటును తగ్గించవచ్చు
  • ఇది అశాంతికి కారణం కావచ్చు
  • ఇది నిద్రలేమికి కారణం కావచ్చు
  • ఇది జీర్ణవ్యవస్థను చికాకు పెట్టవచ్చు

గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా కనిపిస్తే, వెంటనే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.

గ్రీన్ టీ తాగేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గ్రీన్ టీ తీసుకునే ముందు ఈ క్రింది తెల్పిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి:

  • గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
  • కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మీకు ముందే ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే గ్రీన్ టీని తీసుకునే ముందు డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి.

ముగింపు

గ్రీన్ టీలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. అలాగే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా… హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే… పర్ఫెక్ట్ డోస్ లో మాత్రమే గ్రీన్ టీని తీసుకోవాలి. అంతేకానీ, హెల్త్ కండిషన్‌ ఏదైనా సరే ఇదో ‘మ్యాజిక్ క్యూర్’ అని మాత్రం అస్సలు అనుకోవద్దు.. కాబట్టి, హెల్దీ లైఫ్ స్టైల్ కోసం మీ డేని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి.

డిస్క్లైమర్: ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Leave a Comment