Site icon Healthy Fabs

యోగా ఇన్వర్షన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

A collage of four yoga inversion poses for beginners, including Downward Facing Dog, Shoulder Stand, Legs Up the Wall, and Headstand in a peaceful yoga studio.

4 Best Yoga Inversion Poses for Beginners to Improve Balance & Flexibility

యోగా ఇన్వర్షన్స్ అంటే శరీరాన్ని తలకిందులుగా ఉంచే ఆసనాలు. ఇవి మన శరీరానికి, మెదడుకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. ముఖ్యంగా రక్త ప్రసరణను మెరుగుపరిచే ఈ ఆసనాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని మొదటి సారి ప్రయత్నించేవారికి ఈజీగా ఉండేందుకు అనువైన కొన్ని ఆసనాలను ఇప్పుడు చూద్దాం.

యోగా ఇన్వర్షన్స్ లో రకాలు 

తల గుండె కంటే క్రిందగా ఉండే ఆసనాలను యోగా ఇన్వర్షన్స్ అంటారు. ఇందులో ఏయే రకాల ఆసనాలు ఉన్నాయో ఈ క్రింద చూడండి.

అధో ముఖ శ్వానాసనం (Downward Facing Dog Pose)

బేసిగ్గా ఈ ఆసనం  ఓ మంచి ఇన్వర్షన్

ఎలా చేయాలి?

  1. చేతులు, కాళ్లు నేలపై ఉంచి, నడుమును పైకి లేపండి.
  2. మీ శరీరం ఒక త్రిభుజ ఆకారంలో ఉండాలి.
  3. తల నేలవైపుగా ఉండాలి, శరీర బరువును సమంగా పంపించాలి.

 ప్రయోజనాలు

సర్వాంగాసనం (Shoulder Stand)

ఈ ఆసనం సంపూర్ణ శరీర విన్యాసంగా ఉంటుంది.

ఎలా చేయాలి?

  1. పడుకుని మీ కాళ్ల పై బాగాన్ని అంటే మీ తొంటిభాగాన్ని పైకెత్తండి.
  2. చేతులను నడుముకు అండగా ఉంచి, శరీరాన్ని నిటారుగా నిలపండి.
  3. తలను నేలపై ఉంచి, కాళ్లను పైకి చాపండి.

ప్రయోజనాలు

ఇది కూడా చదవండి: యోగా ద్వారా మజిల్స్ బిల్డ్ చేయటం సాధ్యమేనా!

విపరీత కరణి (Legs Up The Wall Pose)

ఇది చాలా సులభమైన ఆసనం.

ఎలా చేయాలి?

  1. గోడకు ఆనుకుని పడుకుని, కాళ్లను గోడపై నిలువుగా ఉంచండి.
  2. చేతులను పక్కలకు ఉంచి, నిశ్వాసాన్ని సమతుల్యం చేసుకోండి.
  3. కనీసం 5-10 నిమిషాలు ఈ స్థితిలో ఉండండి.

ప్రయోజనాలు

శీర్షాసనం (Headstand – Advanced)

ఇది కొంత సాధనతో చేయగలిగే ఆసనం

ఎలా చేయాలి?

  1. మోకాళ్ల మీద కూర్చొని, రెండు చేతుల మధ్య తలను ఉంచాలి.
  2. తర్వాత కాళ్ళను పైకి లేపాలి.
  3. శరీరాన్ని నిటారుగా నిలిపి, బ్యాలెన్స్ చేయాలి. 

ప్రయోజనాలు

ముగింపు

ఇన్వర్షన్ ఆసనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే, మొదటిసారి చేసినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని నెమ్మదిగా సాధన చేస్తూ, గోడకు ఆనుకుని లేదా ట్రైనర్  సహాయంతో ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే, మంచి ఫలితాలను పొందవచ్చు!

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version