Site icon Healthy Fabs

బిర్యానీ vs పులావ్ – ఆరోగ్యానికి ఏది మంచిది?

A top-down view of two bowls, one filled with flavorful Biryani with chicken and saffron-infused rice, and the other with colorful vegetable Pulao.

A side-by-side comparison of Biryani and Pulao – which one is the healthier option?

హాయ్ ఫుడీస్! మీ కోసం ఈరోజు ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని తీసుకొచ్చాను. బిర్యానీ, పులావ్ ఈ రెండు వంటకాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆహారం. చూడటానికి ఈ రెండూ ఒకే మాదిరిగా ఉంటాయి. రుచులు కూడా దాదాపు ఒకే దగ్గరగా ఉంటాయి. కానీ, ఈ రెండు వంటకాల తయారీ విధానంలో, ఆరోగ్య ప్రయోజనాలలో మాత్రం తేడా ఉంది. మరి, వీటిలో ఏది ఆరోగ్యకరం? ఏది ఎక్కువ న్యూట్రిషన్ కలిగి వుంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి.

బిర్యానీ & పులావ్ – వీటి మద్య తేడాలు ఏమిటి?

బిర్యానీ మరియు పులావ్ ఈ రెండూ ఇండియన్ టేస్టీ అండ్ స్పైసీ ఫుడ్స్. అయితే, వీటి తయారీ విధానాన్ని బట్టి రెండింటినీ ప్రత్యేకంగా చేస్తాయి. ముందుగా…

బిర్యానీ

ఇది ఒక ముస్లిం వంటకం. ఎక్కువగా హైదరాబాదీ, లక్నో, అవధి స్టైల్ బిర్యానీలు బాగా ఫేమస్. బిర్యానీ తయారీకి ఎక్కువ మసాలాలు, నూనె, మాంసం, లేదా కూరగాయలు, పొదిన, కొత్తిమీర, వంటి పదార్థాలతో కలిపి ఉడికిస్తారు. బిర్యానీని ప్రత్యేకించి బాస్మతి రైస్‌తో మాత్రమే చేస్తారు. దీనిని వండేముందు మాంసాన్ని మసాలాలతో మారినేట్ చేస్తారు. దానిని లేయర్లుగా రైస్ లో వేసి  కలిపి, దమ్ చేసి ఉడికిస్తారు. బిర్యానీలో వేసే మసాలాలు ఎక్కువ. అందుకే,  బిర్యానీ ఘాటు ఎక్కువగా ఉంటంది. 

పులావ్

పులావ్ లైట్‌ వంటకం. ఇందులో బిర్యానీ కంటే తక్కువ మసాలాలు ఉంటాయి. సాధారణంగా పులావ్ ని పొడవైన బియ్యంతో చేస్తారు. దీనిని వండేముందు బియ్యం, కూరగాయలు లేదా మాంసాన్ని ఒకే సారి వేసి ఉడికిస్తారు. ఇందులో నూనె లేదా నెయ్యి తక్కువగా ఉపయోగిస్తారు.  అందుకే, పులావ్‌ మైల్డ్ టేస్ట్ ఉంటుంది. 

ఆరోగ్య పరంగా ఏది బెస్ట్?

పులావ్ మరియు బిర్యానీ రెండింటిలోనూ పోషకాలు ఉంటాయి. అయితే ఆరోగ్య పరంగా చూస్తే…

కాలరీలు

ఫ్యాట్ 

ప్రోటీన్లు

న్యూట్రిషన్ 

ఇది కూడా చదవండి: కంచు పాత్రలో వండిన ఆహారం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసుకోండి!

బిర్యానీ vs పులావ్ – ఎవరికి ఏది మంచిది?

బరువు తగ్గాలనుకునేవారు

వీరికి పులావ్ మంచిది, ఎందుకంటే తక్కువ నూనె, తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది.

బలమైన శక్తి కావాలనుకునేవారు

వీరికి బిర్యానీ మంచిది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

మధుమేహం ఉన్నవారు

వీరికి పులావ్ బిర్యానీ కంటే ఆరోగ్యకరం, ఎందుకంటే తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

హృదయ సంబంధిత సమస్యలు ఉన్నవారు

వీరికి పులావ్ మేలైనది, ఎందుకంటే కొవ్వు తక్కువగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన బిర్యానీ & పులావ్ తయారీ చిట్కాలు

ముగింపు

బిర్యానీ, పులావ్ రెండూ రుచికరమైన వంటకాలు. కానీ ఆరోగ్య పరంగా చూస్తే, తక్కువ కొవ్వు మరియు తేలికగా జీర్ణమయ్యే పులావ్ ఉత్తమ ఎంపిక. అయితే, మీరు మంచి మాసం, తక్కువ నూనెతో చేసిన బిర్యానీ తింటే, అది కూడా ఆరోగ్యకరమే. మీరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ భోజనాన్ని ప్లాన్ చేసుకుంటే, రెండు వంటకాలను కూడా సరైన మోతాదులో ఆస్వాదించవచ్చు!

“ఆరోగ్యంగా తింటే, ప్రతి భోజనం ఔషధంగా మారుతుంది!🍛😊”

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version