Site icon Healthy Fabs

చలికాలం కదా అని స్నానం చేయడానికి బద్ధకిస్తున్నారా..! అయితే ఈ సమస్యలను కొనితెచ్చుకున్నట్లే!!

What Happens When You Want to Skip Showering in Chilly Weather

What Happens When You Want to Skip Showering in Chilly Weather

చాలామంది వాతావరణం చల్లగా ఉంటే స్నానం ఎగ్గొట్టేస్తారు. ఇలా బద్దకించేవారిలో మీరూ ఉన్నారేమో ఓ లుక్కేయండి. 

సాదారణంగా చిల్లీ వెదర్ లో స్పైసీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటాం. అది ఓకే. కానీ, నో బాతింగ్ అంటే మీ అంత లేజీ ఫెలోస్ ఇంకెవ్వరూ ఉండరు. 

శీతాకాలం, వానాకాలాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది. అలానే ఈ సీజన్లలో వ్యాధులు కూడా ఎక్కువే. అది తెలిసి కూడా చాలా మంది బద్ధకిస్తూ ఉంటారు. చల్లటి  వాతావరణంలో ఏ పని చేయడానికైనా కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. అదే బద్దకంతో స్నానం కూడా స్కిప్ చేసేస్తాం. ఇలా చేయటం వల్ల స్కిన్ డిసీజెస్, సీజనల్ డిసీజెస్ త్వరగా వచ్చే ప్రమాదముంది. 

స్నానం మానేయటం వల్ల శరీరం దుర్వాసన రావటం, మొటిమలు పెరగడం, చర్మవ్యాధులు సంభవించటం వంటివి జరుగుతాయి. ఇంకా రోజంతా చికాకుగా ఉండి డల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవేకాక ఇంకా ఏయే సమస్యలు ఏర్పడతాయో తెలుసుకుందాం. 

చర్మ సమస్యలు:

స్నానం చేయకపోతే చెమట, మరియు ధూళి పేరుకుపోవడం వల్ల చర్మంపై రంగు మారిన పాచెస్ అభివృద్ధి చెందుతాయి. ఇది తీవ్రమైన చర్మ వ్యాధులకు దారి తీస్తుంది. స్నానం చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది.

ఇన్ఫెక్షన్స్:

స్నానం చేయకపోతే శరీరంపై మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా ఇవి గజ్జల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అంతేకాక, ఇవి  శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెంది మరిన్ని ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఇంకా చర్మంపై ఏవైనా కోతలు లేదా స్క్రాప్‌లు ఉంటే… వాటిని రక్తప్రవాహంలోకి బదిలీ చేస్తాయి. దీని వలన మీరు అనేక రకాల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడేలా చేస్తాయి.

దుర్వాసన:

స్నానం చేయకుండా బద్ధకించడం వల్ల బాక్టీరియా క్రమక్రమంగా శరీరం అంతటా వ్యాప్తి చెంది దుర్వాసనకు కారణమవుతుంది. దీంతో అసహ్యకరమైన వాసనతో పాటు.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది:

స్నానం మానేస్తే శరీరంలో వైరస్, బ్యాక్టీరియా ఎక్కువుగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని  క్షీణింపచేస్తాయి. 

హెయిర్ లాస్:

వింటర్, మరియు మాన్సూన్ సీజన్లలో హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. స్కాల్ప్​పై డాండ్రఫ్, మరియు దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది హెయిర్ లాస్ ​సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

చివరిమాట:

రెగ్యులర్ గా స్నానం చేయటం మీ శరీరం యొక్క పరిశుభ్రతను కాపాడటం మాత్రమే కాకుండా, మీరు శక్తివంతంగా, మరియు తాజాగా ఉండేలా చేస్తుంది. కేవలం స్నానం చేయడం అనేది తాజాదనం యొక్క అనుభూతి. స్నానం చేయని వ్యక్తి ప్రతిరోజు ఒకే విధమైన శక్తి స్థాయిని కలిగి ఉండకపోవచ్చు. కానీ స్నానం చేయడం వల్ల మరింత అందంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

డిస్క్లైమర్:

ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! అంతకుమించి https://healthyfabs.com ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version