Site icon Healthy Fabs

భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ గుండెపోటుని తగ్గిస్తుందా?

Digital illustration showing a person walking after eating to reduce heart attack risk

Walking for 15 minutes after meals can lower heart attack risk by 40%.

రోజుకు 15 నిమిషాల వాకింగ్ హార్ట్ ఎటాక్ రిస్క్ ని తగ్గిస్తుందా? నిజమేనని అంటున్నారు నిపుణులు. వాస్తవానికి మనమంతా ఆరోగ్యం కోసం ఖరీదైన మెడిసిన్స్, కాంప్లికేటెడ్ సర్జరీల కోసం పరిగెడతాం.  కానీ, అవేవీ అవసరం లేకుండా, కేవలం వాకింగ్ తో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ అలవాటు అంటే ఏమిటి?

భోజనం చేసిన వెంటనే పడుకోవడం, కుర్చీలో కూర్చోవడం, మొబైల్‌లో స్క్రోల్ చేయడం ఇవన్నీ మనకు సహజంగా అలవాటే. కానీ శాస్త్రవేత్తలు చెబుతున్న అలవాటు చాలా సింపుల్ – భోజనం చేసిన వెంటనే 15 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల  అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అని. అంటే కష్టమైన జిమ్ వ్యాయామం అవసరం లేదు. కేవలం ఇంటి చుట్టూ లేదా ఆఫీస్‌లో చిన్న వాకింగ్ చేస్తే సరిపోతుంది.

15 నిమిషాల వాకింగ్ గుండెకు ఎలా ఉపయోగపడుతుంది?

భోజనం చేసిన తర్వాత చేసే వాకింగ్ మన గుండెకి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఇది కేవలం మనకే కాకుండా మన కుటుంబానికి కూడా ఒక గొప్ప హెల్త్ గిఫ్ట్. అది ఎలాగంటే…

బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది

భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుతాయి. దీన్ని “Postprandial Sugar Spike” అంటారు. 15 నిమిషాల వాకింగ్ ఆ చక్కెరని కణాల్లోకి చేర్చటంలో సహాయపడుతుంది. దీంతో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది

వాకింగ్ వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల హై బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

క్యారెట్ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందా?

మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది

వాకింగ్ వల్ల శరీరంలో HDL (good cholesterol) పెరిగి, LDL (bad cholesterol) తగ్గుతుంది. ఇది గుండెకు రక్షణ కవచం లాంటిది.

బరువు తగ్గిస్తుంది

భోజనం తర్వాత నడక వల్ల కాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫ్యాట్ పేరుకుపోవడం తగ్గుతుంది. దీనివల్ల ఊబకాయం తగ్గి గుండెకు మేలు జరుగుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

15 నిమిషాల వాకింగ్ వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్ణం, గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి.

శాస్త్రీయ ఆధారాలు

భోజనం తర్వాత నడకకు సరైన సమయం?

✔️ భోజనం తర్వాత వాకింగ్ ఎవరు చేయాలి:?

భోజనం తర్వాత వాకింగ్ ఎవరు చేయకూడదు?

15 నిమిషాల వాకింగ్ ని అలవాటు చేసుకోవడానికి టిప్స్

  1. భోజనం తర్వాత వెంటనే మొబైల్‌లో టైమర్ పెట్టుకోండి.
  2. ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి వాకింగ్ చేయండి.
  3. వాకింగ్ చేసేటప్పుడు లైట్ మ్యూజిక్ వింటే అలవాటు బోర్ అనిపించదు.
  4. ఆఫీస్‌లో అయితే లంచ్ తర్వాత కారిడార్‌లో లేదా మెట్లపై నడవండి.

ముగింపు

భోజనం తర్వాత 15 నిమిషాల వాకింగ్ – హార్ట్ అటాక్‌కి నేచురల్ ప్రొటెక్షన్! ఇది ఖరీదైన మందులు, కష్టమైన వ్యాయామాలు లేకుండానే మీ హృదయాన్ని కాపాడుకునే ఒక గొప్ప మార్గం. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు. కాబట్టి నేటి నుంచే ప్రారంభించండి. మీ కుటుంబానికి గుండె ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వండి.

📢 ఈ  ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి. 

2 నెలల్లో 10 కిలోలు తగ్గాలి? సీక్రెట్ ఇదే!

👉 ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ తెలుసుకోవాలంటే మా వెబ్‌సైట్‌ ను రెగ్యులర్‌గా విజిట్ చేయండి. 

💬 మీ అభిప్రాయాలని కింద కామెంట్ చేయండి.

“నేడు వేసే చిన్న అడుగు, రేపటి మీ జీవితానికి పెద్ద ఆయుష్షు”

డిస్క్లైమర్: ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version