వేసవి తాపానికి శరీరాన్ని చల్లబరుచుకొనేందుకు చల్లని పానీయాలు తాగటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా అవి నేచురల్ డ్రింక్స్ అయితే మరీ మంచిది. ఎండాకాలంలో తాగే నేచురల్ డ్రింక్స్ లో బాగా పాపులర్ అయినవి రెండే రెండు. ఒకటి షుగర్‌కేన్ జ్యూస్, రెండవది కోకోనట్ వాటర్. వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు, శరీరంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
షుగర్‌కేన్ జ్యూస్
చెరకు కాడల నుండి తీసిన చెరకు రసం సాధారణంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లు, మరియు సూక్ష్మపోషకాలతో నిండి ఉంటుంది. ఈ జ్యూస్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా!
షుగర్‌కేన్ జ్యూస్ లో ఆరోగ్య ప్రయోజనాలు
షుగర్‌కేన్ జ్యూస్ లో సహజంగానే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. ఇంకా షుగర్‌కేన్ జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి:
తక్షణ శక్తిని అందిస్తుంది
చెరకు రసం సహజమైన గ్లూకోజ్‌తో నిండి ఉండి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
కాల్షియం మరియు ఐరన్ కంటెంట్
ఇందులో ఉండే కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ కారణంగా ఇది ఎముకల బలం పెంచేలా సహాయపడుతుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
చెరకు రసం లివర్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది మరియు జాండీస్ నివారణలో సహాయపడుతుంది.
పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది
చెరకు రసం పేగుల్లో నీటి కదలికను ఆప్టిమైజ్ చేసి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.
యాంటీఆక్సిడెంట్ల మూలం
ఇది యాంటీఆక్సిడెంట్లని కలిగి ఉండి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి సహాయపడుతుంది.
బీపీని నియంత్రిస్తుంది
చెరకు రసం రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాలని సడలింప చేసి, రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
షుగర్‌కేన్ జ్యూస్‌లో నష్టాలు
షుగర్ కేన్ జ్యూస్ వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చెప్పుకుందాం.
షుగర్ కంటెంట్ ఎక్కువ
ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం చేత మధుమేహ రోగులకు మంచిది కాదు.
బాక్టీరియా పెరుగుదల
చెరకు నుండీ తయ్యారైన రసం ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
కేలరీలు పెరిగే అవకాశం
ఈ జ్యూస్ లో ఉండే అధిక కేలరీల కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది.
కోకోనట్ వాటర్
కోకోనట్ వాటర్ అనేది లేత కొబ్బరి కాయల నుండి వచ్చే, పోషకాలతో నిండిన ద్రవం. ఇది ఎలక్ట్రోలైట్లతో నిండిన సహజ పానీయం. ఈ జ్యూస్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా!
ఇది కూడా చదవండి: మధుమేహులు కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?
కోకోనట్ వాటర్ లో ఆరోగ్య ప్రయోజనాలు
కోకోనట్ వాటర్ బాడీ డీ -హైడ్రేట్ అయినప్పుడు మినరల్స్ ని అందిస్తుంది. ముఖ్యంగా ఆటలు ఆడినప్పుడు దీనిని తాగితే కోల్పోయిన మినరల్స్ ని తిరిగి అందిస్తుంది. ఇంకా కోకోనట్ వాటర్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి:
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
సహజమైన ఎలక్ట్రోలైట్స్ వల్ల ఇది హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది.
హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
కొబ్బరి నీరు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
టాక్సిన్స్‌ను తొలగిస్తుంది
ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరచి మూత్ర సంభందిత సమస్యలను తగ్గిస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది
కొబ్బరి నీరు సహజమైన స్కిన్ టానిక్‌లా పనిచేస్తుంది, చర్మాన్ని తేజస్సుగా ఉంచుతుంది.
బరువు తగ్గిస్తుంది
కొబ్బరి నీరు తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది, తేలికగా జీర్ణమవుతుంది.
యాంటీ-వైరల్, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు
ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
కోకోనట్ వాటర్ లో నష్టాలు
కోకోనట్ వాటర్ వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు చెప్పుకుందాం.
రక్తపోటును తగ్గిస్తుంది
తక్కువ బీపీ ఉన్నవారు దీన్ని అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
మితంగా తీసుకోవాలి
ఎక్కువగా తీసుకుంటే కొందరికి పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.
షుగర్‌కేన్ జ్యూస్ vs కోకోనట్ వాటర్ వీటిలో ఏది ఉత్తమం?
శక్తి కోసం
తక్షణ శక్తి కావాలంటే చెరకు రసం మంచిది.
హైడ్రేషన్ కోసం
కొబ్బరి నీరు బెస్ట్.
బరువు తగ్గే వారికి
కొబ్బరి నీరు తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో బరువు తగ్గేవారికి ఉత్తమ ఎంపిక.
జీర్ణాశయ సమస్యలు
చెరకు రసం మంచిది కానీ పరిమిత మోతాదులో తీసుకోవాలి.
రక్తపోటు నియంత్రణ
కొబ్బరి నీరు అధిక రక్తపోటు ఉన్నవారికి అనుకూలం, కానీ తక్కువ బీపీ ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.
ముగింపు
షుగర్‌కేన్ జ్యూస్ మరియు కోకోనట్ వాటర్ ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవడం మంచిది. రోజూ త్రాగడం వలన కలిగే ప్రయోజనాలను గమనించి, పరిమిత మోతాదులో తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి సహజమైన పానీయాలను ఉపయోగించడం ఉత్తమ ఎంపిక.
డిస్క్లైమర్
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.