Site icon Healthy Fabs

మధుమేహులు కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?

సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాలలోనూ తాగ గలిగిన పానీయం ఏదైనా ఉందా అంటే… అది కొబ్బరినీళ్ళు ఒక్కటే! నిజానికి కొబ్బరినీళ్ళని ఎండనపడి వచ్చినవాళ్ళు సమ్మర్ డ్రింక్ గా తాగుతుంటారు. అలానే, బాడీ ఓవర్ హీట్ ని తగ్గించే పానీయంగా కూడా తీసుకుంటుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎవరైనా దీనిని తాగొచ్చు. మరి అలాంటి ఔషద గుణాలున్న కోకోనట్ వాటర్ ని డయాబెటిక్ పేషెంట్లు వాడొచ్చా..! అనే డౌట్ మీకు రావొచ్చు. 

సాదారణంగా మధుమేహులు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్తుంటారు. మరి కొబ్బరిలో స్వీట్ నెస్ ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవుతుంది? మధుమేహ వ్యాధిగ్రస్తులు అసలు కొబ్బరినీరు తాగొచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కొబ్బరినీళ్లు జీరో కేలరీస్ కలిగిన నేచురల్ డ్రింక్. దీంతోపాటు ఎలక్ట్రోలైట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కోకోనట్ వాటర్ రుచికి చాలా తియ్యగా ఉంటాయి. అలాగని అందులో ఎలాంటి కృత్రిమ చక్కర కలపరు.,అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు ఈ కొబ్బరినీళ్లు తాగినట్లైతే షుగర్ లెవెల్స్ పెరగవు. మరియు షుగర్ కంట్రోల్ అవుతుంది కూడా. 

కొబ్బరి నీళ్ళలో ఉండే అనేక న్యూట్రిషన్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలాగే కిడ్నీలో రాళ్లు తగ్గించడానికి, కొలెస్ట్రాల్, మరియు ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడేలా చేస్తాయి. రక్తపోటును నియంత్రించటంలో కూడా కొబ్బరినీళ్లు మంచి హెల్ప్ అవుతాయి. 

కొబ్బరి నీళ్లలో నేచురల్ స్వీట్నర్, మరియు  ఫ్రక్టోజ్‌ ఉన్న కారణంగా మధుమేహులు దీనిని లిమిట్ గా తీసుకోవాలి.  రోజుకు 240 ml అంటే – 1 కప్పు కంటే ఎక్కువ తాగకూడదు. 

ముగింపు: 

ఇందులోని అంశాలు కేవలం మీలో అవేర్నెస్ పెంచటం కోసం మాత్రమే! ఫైనల్ గా హెల్త్ స్పెషలిస్ట్ లని సంప్రదించి… వారి  సలహాలు మరియు సూచనల మేరకు మాత్రమే ఏ పనైనా చేయండి. 

Exit mobile version