అమ్మో ఓవర్ హీట్ చేసేసింది అంటూ చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే, వేడి చేస్తే ముఖం పీక్కుపోతుంది. పెదాలు పొడిబారి… నల్లబడిపోతాయి. స్కిన్ డ్రై గా మారుతుంది అలానే వేడి ఆవిర్లు కక్కుతుంది. ఇంకా కడుపులో మంట, కళ్ళు మంట, మూత్రంలో మంట, నోట్లో పుండ్లు, తల నొప్పి, మాడు నొప్పి, బీ.పి డౌన్ అవ్వడం ఇలా ఒకటేమిటి అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. వేడి చేయడం అంటే… మన బాడీలో వాటర్ పర్సంటేజ్ తగ్గి… బాడీ డీ-హైడ్రేషన్ కి గురవడమే! ఈ వేడి చేసినప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఆ వేడంతా బయటికి వెళ్ళిపోతుంది. అవేంటో మీరే చూడండి.
ఒంట్లో వేడి తగ్గాలంటే పాటించవలసిన సింపుల్ టిప్స్
- మనం తినే ఆహార పదార్ధాలలో… ఒక టేబుల్ స్పూన్ మెంతులు కలిపి వాడినట్లయితే… అవి మన శరీరంలోని వేడిని ఇట్టే లాగేస్తాయి.
- ఉప్పు, లేదా పంచదార కలిపిన ఒక గ్లాసుడు నిమ్మరసాన్ని రోజూ ఉదయాన్నే తాగితే… ఒంట్లో వేడి తగ్గుతుంది.
- దానిమ్మ జ్యూస్ తీసి… అందులో నాలుగు చుక్కల ఆల్మండ్ ఆయిల్ వేసుకుని తాగితే చలువ చేస్తుంది.
- గ్లాసుడు పాలలో రెండు టేబుల్ స్పూన్ల వెన్న కలుపుకొని తాగితే వేడి తగ్గిపోతుంది.
- ఒక గ్లాసుడు పాలు తీసుకొని.. అందులో చెంచాడు తేనె కలుపుకొని తాగితే… శరీరం అంతా కూల్ గా అయిపోతుంది.
- అలోవెరా ఆకుల మధ్య ఉండే జెల్ నుదుటికి రాసుకుంటే శరీరానికి చల్లదానాన్ని అందిస్తుంది.
- గంధాన్ని చల్లని నీరు, లేదా పాలతో కలిపి నుదుటకు రాసుకుంటే వేడి మటుమాయం.
- బార్లీ వాటర్ తాగితే వేడి తగ్గుతుంది.
- వీటన్నిటికంటే ముందు అసలు మంచి నీళ్లు ఎక్కువగా తాగితే… శరీరంలో వేడి తగ్గిపోయి.. టెంపరేచర్ కూడా బ్యాలన్స్డ్ గా ఉంటుంది.
ముగింపు
ఇవన్నీ ఒంట్లో వేడిని తగ్గించే టిప్స్ మాత్రమే! అలా కాకుండా అసలు వేడే చేయకుండా ఉండాలంటే… ప్రతిరోజూ 4, లేదా 5 లీటర్ల వరకూ నీటిని తాగుతూ ఉండాలి. బాడీ హీట్ తగ్గాలంటే… వాటర్ థెరపీని మించిన బెస్ట్ థెరపీ మరేదీ లేదు.
డిస్క్లైమర్:
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.