Site icon Healthy Fabs

కల్తీ పాలను ఇంట్లోనే ఈజీగా చెక్‌ చేసుకోండిలా..!

How to Check Adulterated Milk at Home

పాలు పోషకాహారం. అలాంటి పాలు కూడా కల్తీ అయిపోతున్న రోజులివి. తినే ఆహారం నుండీ తాగే నీటివరకూ అన్నీ కల్తీ అయిపోతున్న ఈ రోజుల్లో నాణ్యమైన, స్వచ్చమైన పాలని మనం తాగలేమా అంటే… ఖచ్చితంగా దానికో సొల్యూషన్ ఉంది. పాల నాణ్యతను, స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. అదికూడా ఇంటివద్దనే. మీరు విన్నది నిజమే! పాలల్లో కల్తీని ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

సింథటిక్: 

మనం తాగే పాలలో సింథటిక్ కలిస్తే… అలాంటి పాల వాసనను గుర్తించడం చాలా సులభం. పాలు మరుగుతున్న సమయంలో దాని వాసన మెల్లగా మొదలవుతుంది. ఆ పాలనుండీ వచ్చే చెడు వాసన ద్వారా పాలల్లో సింథటిక్ కలిసిందని గ్రహించవచ్చు. 

సోప్ పౌడర్:

ఒక్కోసారి పాలు సబ్బు వాసన వస్తుంటాయి. అలాంటి పాలని కొద్దిగా  చేతిలో వేసుకుని రుద్దినట్టయితే.. కాస్త సబ్బులా అనిపిస్తుంది, మరియు వేడి చేసినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. అలాంటి పాలల్లో సోప్ పౌడర్ మిక్స్ అయి ఉన్నట్లు అర్ధం.

యూరియా:

పాల కల్తీకి అత్యంత సాధారణ రూపం ఇది. రుచిని మార్చదు, దీనిని గుర్తించడం చాలా కష్టం. నిజానికి యూరియా చాలా ప్రమాదకరమైనది. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పాలలో ఉన్న యూరియాను గుర్తించేందుకు లిట్మస్ పేపర్‌ను ఉపయోగించాలి. దీనికోసం… కొన్ని పాలు తీసుకొని, అందులో సోయాబీన్ పొడి వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ పాలల్లో లిట్మస్ పేపర్ పెట్టి టెస్ట్ చేయాలి. లిట్మస్ పేపర్ నీలి రంగులోకి మారితే అందులో యూరియా ఉన్నట్టే! ఆ పాలు తాగితే విషంతో సమానం.

స్టార్చ్:

కొన్న పాలలో స్టార్చ్‌ ఉందని తెలుసుకోవాలంటే… 5 ml పాలకు 2 టేబుల్‌స్పూన్ల ఉప్పుని జోడించినట్లైతే…  దాని రంగు మారుతుంది. పాలు నీలం రంగులోకి మారితే అవి స్టార్చ్ (గంజిపొడి) కలిపిన పాలు, లేకుంటే అవి సాదారణ పాలు.

ఫార్మాలిన్: 

ఫార్మాలిన్ అనేది స్టోరేజ్ కోసం ఎక్కువగా   ఉపయోగించబడుతుంది. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది. ఎక్కువ కాలం పాలను నిల్వ చేయగలదు. కాబట్టి, తయారీదారులు దీనిని ఎక్కువకాలం నిల్వ ఉండటం కోసం ప్యాక్ చేసే సమయంలో ఉపయోగిస్తారు. పాలలో ఫార్మాలిన్ ఉనికిని పరీక్షించడానికి, టెస్ట్ ట్యూబ్‌లో 10ml పాలు తీసుకొని అందులో 2-3 చుక్కల సల్ఫ్యూరిక్ యాసిడ్ వేయండి. నీలిరంగు అత్యధికంగా ఉన్నట్లు అనిపిస్తే, ఆ పాలల్లో ఫార్మాలిన్ కలిపారన్నమాట.

వాటర్:

పాలల్లో కొద్దిపాటి నీళ్ళు కలపటం సాదారణమే! కానీ, ఎక్కువశాతం నీళ్ళు కలిపితే వాటిని కల్తీ పాలుగానే పరిగణిస్తాం. దీనిని టెస్ట్ చేయాలంటే… నేలపై 2-3 చుక్కల పాలను వేయండి. అది ఏదో ఒకవైపుకు మెల్లగా పారితే… అవి స్వచ్చమైన పాలు. అలాంటి పాలు పారిన దారిలో తెల్లటి మారక కనిపిస్తుంది. అలాకాక, వేగంగా పారితే… అవి కల్తీ పాలు. అలాంటి పాలు పారిన దారిలో ఏ మరక కనిపించదు.

డిస్క్లైమర్:

నిత్యం పాలతో అనేక వస్తువులను తయారు చేస్తుంటారు కాబట్టి దీని ప్యూరిటీని టెస్ట్ చేయాలంటే, పాలను 2-3 గంటల పాటు నెమ్మదిగా వేడి చేసి ఖోవాను తయారు చేయడానికి ప్రయత్నించండి. పాలు ఖోవా అయ్యే వరకు చెంచాతో కలుపుతూ ఉండండి. తక్కువ మంట మీద మరిగించండి. ఖోవా నూనెగా ఉంటే, పాలు మంచి నాణ్యతతో ఉన్నట్లు, అలా కాకుండా అది గట్టి రాయిలా ఉంటే, పాలు కల్తీ జరిగినట్లు గుర్తించండి.

Exit mobile version