Site icon Healthy Fabs

తిన్న వెంటనే స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా!

Disadvantages of Showering After Eating

చాలామందికి తిన్న వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటే మీకూ ఉంటే గనుక వెంటనే మానుకోండి. లేదంటే అనర్ధాలని కొని తెచ్చుకున్నట్లే! పూర్వకాలంలో మన పెద్దలు తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటారు. అది ఎందుకో చాలా మందికి తెలియదు. కానీ, అవన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టిపారేస్తుంటాం. 

నిజానికి పూర్వకాలంలో ఈ ఆచారాలన్నీ ఊరికే పెట్టలేదు, దాని వెనుక గొప్ప సైంటిఫిక్ రీజనే ఉంది. ఎలాగంటే,  భోజనం చేసిన తర్వాత చేసే పనులు మన జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే మనం చేసే కొన్ని రకాల పనుల వల్ల అనారోగ్యాలకు గురవుతుంటాం.  

తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయంలో పొట్టపై ఎక్కువ ఒత్తిడి పడినట్లయితే… ఆ ఆహారం సరిగ్గా జీర్ణమవకపోగా, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడతాయి. అలానే, ఆహారం జీర్ణం కావడానికి పొట్టకి సరైన మొత్తంలో రక్తప్రసరణ అవసరం. ఆ రక్త ప్రసరణలో తేడాలు వచ్చినట్లయితే… శరీర ఉష్ణోగ్రతలలో మార్పులు వస్తాయి.

అయితే స్నానం చేయటం వల్ల రక్తప్రసరణలో మార్పులు వస్తాయి. శరీరంలోని రక్తం అంతా చర్మం వైపుకి ప్రసరించి బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఆహారం అరగటానికి కావలసిన రక్తమంతా చర్మానికి సరఫరా అవుతుంది. దీంతో డైజేషన్ కి మరింత ఎక్కువ సమయం పడుతుంది. ఈ క్రమంలో అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. 

మరో రకంగా చూస్తే… స్నానం చేశాక శరీరంపై పేరుకున్న మురికి మొత్తం వదిలిపోతుంది. శరీరంలోని ప్రతి అణువు ఉత్తేజం పొందుతుంది. అందుకే స్నానం చేశాక ఎంతో ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఫీలవుతాం. అందువల్ల స్నానం చేశాక  ఆకలి వేయడం కూడా మొదలవుతుంది. కాబట్టి స్నానం చేశాకే అన్నం తినాలి. అలా తింటే తిన్నది ఒంటబడుతుంది. దీంతో పోషకాలు శరీరానికి అందుతాయి. అప్పుడు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

డిస్క్లైమర్: 

అందుకే తిన్న వెంటనే కాకుండా… కనీసం గంట, గంటన్నర ఆగి… ఆ తర్వాత స్నానం చేయడం మంచిదని నిపుణుల అభిప్రాయం.

Exit mobile version