Site icon Healthy Fabs

డయాబెటిక్స్ స్ట్రోక్ రిస్క్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

Diabetes and Stroke Prevention

Diabetes and Stroke Prevention

డయాబెటిక్ పేషెంట్లలో హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులతో పోలిస్తే వీరు చాలా చిన్నవయసులోనే ఈ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. వాస్తవానికి మధుమేహులకి స్ట్రోక్ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందట. దీనికి కారణాలు ఏవైనప్పటికీ జీవన శైలిలో మాత్రం కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  

ఇదికూడా చదవండి: ఎంతోమందిని బాధిస్తున్న ఈ రెండు జబ్బులకి… సింపుల్ గా ఇలా చెక్ పెట్టండి!

HbA1c టెస్ట్: 

ఈ టెస్ట్ 3 నెలల కాలంలో మీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూపిస్తుంది. దీనిని మధుమేహులు సంవత్సరానికి రెండు నుంచి నాలుగు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్  7% కి మించి పెరగకుండా చూసుకోండి. 

బ్లడ్ ప్రెజర్: 

డయాబెటీస్ పేషెంట్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరగకుండా చూసుకోవాలి. అంటే 140/90 mm Hg కంటే తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడే పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. 

కొలెస్ట్రాల్: 

లో డెన్సిటీ కలిగిన లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ నే ‘బ్యాడ్ కొలెస్ట్రాల్’ లేదా ‘LDL’  అని పిలుస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో కొలెస్ట్రాల్ డెన్సిటీ లెవెల్ 150 మి.గ్రా డిఎల్ నుంచి… 100 మి.గ్రా డిఎల్ వరకు ఉండాలి. డయాబెటీస్ గుడ్  కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. అలాగే ట్రైగ్లిజరైడ్ బ్యాడ్  కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే కొలెస్ట్రాల్ ను పెంచే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. 

నో స్మోకింగ్:  

స్మోకింగ్ వల్ల డయాబెటీస్ రానప్పటికీ, స్ట్రోక్, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ మానేయడం వల్ల మీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగుపడతాయి. అలాగే రక్తప్రసరణ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా శారీరకంగా కూడా చురుగ్గా ఉంటారు. 

హెల్దీ డైట్: 

మధుమేహులు ప్రతిరోజూ 1000 కేలరీలకు మించకుండా కనీసం 14 గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి. ఇందుకోసం ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తినాలి. కొలెస్ట్రాల్ ను రోజుకు 300 మిల్లీ గ్రాముల వరకు తగ్గించాలి. 

చివరి మాట:

పైన పేర్కొన్న విధంగా మీ లైఫ్ స్టైల్ లో కొన్ని చేంజెస్ చేసుకొన్నట్లైతే డయాబెటీస్ ఉన్నప్పటికీ స్ట్రోక్ రిస్క్ నుంచీ తప్పించుకోవచ్చు.

డిస్క్లైమర్:

ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version