ఈ కాలంలో ఎవరికైనా డ్రెస్ సెన్స్ అనేది చాలా ముఖ్యం. మీ డ్రెస్సింగ్ స్టైల్ ని బట్టే మీ క్యారెక్టర్ ని అంచనా వేయటం ప్రారంభిస్తారు. అందుకే నేటి యువత ఫ్యాషన్ డిజైన్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే, అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఫ్యాషన్ నాలెడ్జ్ తక్కువని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో, కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మీ డ్రెస్సింగ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి స్టైలిష్ లుక్ తో కనిపించాలంటే మీరు పాటించవలసిన ఆ 5 ఫ్యాషన్ టిప్స్ ఏంటో ఈ రోజు డిస్కస్ చేసుకుందాం.
సరైన కలర్ డ్రెస్ ఎంచుకోవటం:
స్టైలిష్ గా కనిపించాలంటే ఫస్ట్ వాడే డ్రెస్ కలర్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. అందుకోసం జీన్స్, క్యాజ్వల్ షర్ట్ లేదా టీ-షర్టు ఇలా ఏదైనా సరే దాని రంగుతో పోలి ఉండే కాంట్రాస్ట్ కలర్ డ్రెస్ ధరించండి. ఇది మీకు ఎంతో ఎట్రాక్షన్ తో కూడి ఉండే అప్పియరెన్స్ ని ఇస్తుంది. అలాగే స్టైలిష్‌గా కనిపించాలంటే ఏ డ్రెస్ వేసుకున్నామనేది కాదు, ముందు మీకు ఏ రంగు డ్రెస్ మంచి లుక్ ని ఇస్తుందో ఒకటికి… పదిసార్లు చెక్ చేసుకోండి.
సరైన సైజు డ్రెస్ ఎంచుకోవటం:
డ్రెస్సుల విషయంలో ముందు ముఖ్యంగా సరైన సైజు ఉండేలా చూసుకోవాలి. లూజ్ గా ఉన్న దుస్తులు వేసుకుంటే… మీరు లావుగా ఉన్నట్లు కనిపిస్తారు. టైట్ గా ఉన్న దుస్తులు వేసుకుంటే… ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకే మీకు సరిపడే సైజు దుస్తులను ధరిస్తే మరిత లుక్ పెరుగుతుంది. అసౌకర్యంగా ఉండే దుస్తువలను అస్సలు ఎంపిక చేసుకోవద్దు.
బట్టలను బట్టి షూస్ ని ఎంచుకోవటం:
మీరు ధరించే షూస్ మీ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఉదాహరణకు, మీరు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొంటే… దానితో పాటు స్పోర్ట్స్ షూస్ మాత్రమే ధరించండి. పార్టీ వేర్ డ్రెస్ వేసుకొన్నప్పుడు దానికి సంబందించిన హాఫ్ షూస్ వంటివి ధరించండి. ఇలా అకేషన్ ని బట్టి మీ షూ స్టైల్ ని కూడా మార్చేయండి. అవి మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతాయి.
హెయిర్ స్టైల్, బియర్డ్ ఎట్రాక్టివ్ గా ఉండేలా ప్లాన్ చేయటం:
మీ హెయిర్ స్టైల్ సరిగ్గా లేకుంటే అది మొత్తం మీ అప్పియరెన్స్ నే పాడు చేస్తుంది. స్టైలిష్‌గా కనిపించాలంటే, మీ హెయిర్‌స్టైల్, మరియు బియర్డ్ ని కరెక్ట్ గా మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా చేస్తుంది. మీ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.
వీలయినంత వరకు V-నెక్ డ్రెస్ ధరించటం:
టీ-షర్టుల వంటివి వేసుకున్నప్పుడు.. వీలైనంత వరకూ V నెక్ డ్రెస్‌లను ఎంచుకోండి. ఇవి మీరు స్లిమ్‌గా కనిపించడంలో సహాయపడతాయి. అంతేకాక వేరేదైనా నెక్ డిజైన్ వేసుకుంటే మీరు లావుగా కనిపించే ఛాన్స్ ఉంది.
పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీరెంతో స్టైలిష్ లుక్ తో కనిపిస్తూ… అందరినీ ఎట్రాక్ట్ చేయవచ్చు. అంతేకాదు, ఫ్యాషన్ ప్రపంచంలో ఇక మీకు సాటి వేరొకరు ఉండరు.