Site icon Healthy Fabs

What Happens When You Exercise on an Empty Stomach?

What Happens When You Exercise on an Empty Stomach?

The Truth About Working Out on an Empty Stomach: Benefits and Risks"

శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు  వ్యాయామం ఎంతో అవసరం. ఈ వ్యాయామం రెగ్యులర్ గా చేస్తే ఇంకా మంచిది. అయితే వ్యాయామం చేసేముందు ఏదైనా తినొచ్చా? లేదంటే ఖాళీ కడుపుతో చేయాలా? అనే డౌట్ మీలో చాలామందికి వస్తుంటుంది.  

ఫాస్టెడ్ కార్డియో అంటే ఏమిటి?

నిజానికి మనం చేసే వర్కౌట్ లకి సరైన రిజల్ట్ అందుకోవాలంటే ఎమ్టీ స్టమక్ తోనే ఉండాలని చెప్తున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. ఖాళీ కడుపుతో వ్యాయామం చేసే విధానాన్ని “ఫాస్టెడ్ కార్డియో” అంటారు. ఇలా చేస్తే తిన్న ఆహారానికి బదులుగా శరీరంలో నిల్వ చేయబడి ఉన్న  కొవ్వు, కార్బోహైడ్రేట్ల నుంచి శరీరం శక్తిని వినియోగించుకుంటుంది. దీనివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

ఎలాంటి వర్కౌట్లు మంచిది?

కొంతమంది టైమ్ కి ఏదో ఒకటి తినటం అలవాటు. అలాంటివారు ఏమీ తినకుండా ఎక్సర్సైజులు చేయలేరు. మరికొంతమంది క్రానిక్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నవాళ్ళు మెడిసిన్ వేసుకోవటం కోసం పొద్దున్నే ఏదో ఒకటి తినాల్సి ఉంటుంది, ఇలాంటి వారంతా వర్కౌట్స్ చేసేముందు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవటమే మంచిది.

మరికొంతమంది ఏమీ తినకుండా ఎంత సమయమైనా యిట్టె గడిపేస్తారు. మరీ ముఖ్యంగా బాడీ చురుకుదనాన్ని కోరుకొనేవారుఎప్పటికప్పుడు శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ జరగటానికి ఇష్టపడతారు.అలాంటివారు ఖాళీ కడుపుతో ఎక్సర్సైజులు చేయవచ్చు.

వ్యాయామానికి ముందు తినడం వల్ల ఏం జరుగుతుంది?

వర్కౌట్లకు ముందు ఆహారం తీసుకోవడం వల్ల వ్యాయామం చేయటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను తీసుకున్నప్పుడు మన శరీరం దానిని గ్లూకోజ్‌గా మారుస్తుంది. ఇది ప్రైమరీ ఎనర్జీ సోర్స్ గా పనిచేసి ఎక్కవ వర్కౌట్లు చేసేందుకు మనల్ని ప్రోత్సహిస్తుంది.

వ్యాయామానికి ముందు తినకపోవడం వల్ల ఏం జరుగుతుంది?

వర్కౌట్లకు ముందు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం ప్రోటీన్‌ను ఎనర్జీ సోర్స్ గా ఉపయోగించుకుంటుంది. ఇది మజిల్ బిల్డ్ అండ్ రిపేర్ కి సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

ఎక్సెస్ ఫ్యాట్ బర్నింగ్ 

సాధారణంగా రాత్రినుండీ ఏమీ తినకపోతే కాలేయం మరియు కండరాలలో గ్లైకోజెన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఇది ఫ్యాట్ ని ప్రైమరీ ఎనర్జీ సోర్స్ గా ఉపయోగించమని శరీరాన్ని బలవంత పెడుతుంది. క్విక్ ఎక్సర్సైజులు ఫ్యాట్ ఆక్సిడేషన్ ను పెంచుతాయి. దీనివల్ల బాడీ ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడం లేదా బాడీ కాంపోజిషన్ ని ఇంప్రూవ్ చేయడం లక్ష్యంగా పని చేస్తాయి. ఈ విధానం కాలక్రమేణా ఫ్యాట్ బర్నింగ్ లో మరింత సమర్థవంతంగా మారేలా గైడింగ్ ఇస్తుంది. 

ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్

క్రమం తప్పకుండా పరగడుపున చేసే వ్యాయామం ఇన్సులిన్‌ సెన్సివిటీని పెంచుతుంది, కణాలు గ్లూకోజ్‌ను మరింత సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల శరీరం పోషకాలను ఎక్కువగా ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది, ఇది ఎనర్జీ లెవెల్స్ పెరగటంలోనూ మెటబాలిక్ హెల్త్ కి దోహదపడుతుంది.

హార్మోన్ గ్రోత్ పెరుగుతుంది 

ఫాస్తింగ్ వల్ల సహజంగానే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి.  ఇది వ్యాయామంతో జత చేసినప్పుడు, ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. మజిల్ రిపేర్, ఫ్యాట్ మెటబాలిజం  రికవరీలో హార్మోన్ గ్రోత్ కీలక పాత్ర పోషిస్తుంది. అధిక స్థాయిలో హార్మోన్ గ్రోత్ ఉంటే అవి కండరాల పెరుగుదలను మెరుగుపరుస్తాయి, ఫ్యాట్ లాస్ అవుతుంది.  మరియు పోస్ట్-వర్కౌట్ రికవరీని వేగవంతం చేస్తాయి.

మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ

ఏమ్తీ స్టమక్ తో చేసే వర్కౌట్స్  వల్ల శరీరం కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు రెండింటినీ ఎనర్జీ సోర్సెస్ గా  ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఈ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ ముఖ్యంగా అథ్లెట్లకి ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది లాంగ్ టైమ్ ఫ్హిజికల్ యాక్టివిటీ సమయంలో ఎనర్జీ స్టెబిలిటీని పెంచుతుంది మరియు కాలక్రమేణా ఫెర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేస్తుంది.

ఎనర్జీ కన్జంప్షన్ పెరుగుతుంది 

క్విక్ ఎక్సర్సైజులు శరీరాన్ని గ్లైకోజెన్‌ను సంరక్షించడానికి మరియు వర్కౌట్ టైంలో కొవ్వు నిల్వలపై ఆధారపడేలా ప్రోత్సహిస్తాయి.  అందుచేత ఫాస్థింగ్ తో చేసే వర్కౌట్స్ ఎనర్జీ కన్జంప్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. 

బరువు నిర్వహణకు తోడ్పడుతుంది

ఇది కూడా చదవండి: Foods to Improve Physical Performance

ఫాస్థింగ్ తో చేసే వర్కౌట్స్ వల్ల గ్రెలిన్ వంటి ఆకలి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది, తరువాత రోజులో ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు  నియంత్రణ మరియు కేలరీల నిర్వహణకు దారి తీస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రయోజనాలతో కలిపి, ఫాస్టింగ్ వర్కౌట్స్ ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన బరువు తగ్గడానికి తోడ్పడతాయి.

కార్డియో వాస్క్యులర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది 

చురుకైన నడక, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి వేగవంతమైన కార్డియో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడం మరియు HDL ని పెంచడం ద్వారా లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరుస్తుందని తేలింది. ఈ మార్పులు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు కాలక్రమేణా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

టైమ్ ఎఫిషియన్సీ

వ్యాయామానికి ముందు భోజనాన్ని దాటవేయడం వల్ల సమయాన్ని ఆదా చేసుకోవచ్చు మరియు ముఖ్యంగా ఉదయం సమయంలో బిజీ షెడ్యూల్‌లో వర్కవుట్‌లను సులభంగా చేయవచ్చు. అందువల్ల ఇది ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.

మెంటల్ ఫోకస్ మరియు మెంటల్ స్టేట్ ని పెంచుతుంది 

ఫాస్థింగ్ ఎక్సర్సైజులు అడ్రినలిన్ మరియు ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది మానసిక స్పష్టతను మరియు మానసిక స్థితిని పెంచుతుంది. చాలా మంది వ్యక్తులు ఫాస్థింగ్ ఎక్సర్సైజుల తర్వాత రోజంతా మరింత శక్తివంతంగా, ఏకాగ్రతతో మరియు చురుకుదనంతో  ఉన్నట్లు తెలిపారు.

చివరిమాట 

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది ప్రతి ఒక్కరికీ సరిపడకపోవచ్చు, ప్రత్యేకించి కొన్ని ఆరోగ్య పరిస్థితులు లేదా మందులు తీసుకునే వారికి. మీ శరీరాన్ని వినడం మరియు తదనుగుణంగా మీ దినచర్యను సర్దుబాటు చేయడం చాలా అవసరం. సరైన హైడ్రేషన్ చాలా ముఖ్యం. ఎనర్జీని తిరిగి నింపడానికి బ్యాలన్స్ద్ పోస్ట్-వర్కౌట్ డైట్ అవసరం. ఏదైనా కొత్త వ్యాయామ నియమాన్ని ప్రారంభించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. జాగ్రత్తగా మరియు సరైన గైడెన్స్ తో, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మీ ఫిట్‌నెస్ జర్నీకి వాల్యుబుల్ ఆడిషన్ గా ఉంటుంది.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version