Site icon Healthy Fabs

మైదా పిండితో చేసిన వంటకాలు తింటే ఏం జరుగుతుందో మీరే చూడండి!

Side Effects of Eating Maida Flour

Side Effects of Eating Maida Flour

ఇటీవలి కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ పుణ్యామా అని ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేయటం ఫ్యాషనై పోయింది. ఫుడ్ ఆర్డర్ చేయటం తప్పుకాదు, కానీ వాళ్ళు చూస్ చేసుకొనేది ఏంటో తెలుసా! పిజ్జాలు, బర్గర్లు, బ్రెడ్లు, కేకులు. ఇలాంటి జంక్ ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

నిజానికి చాలా మంది పేరెంట్స్… తమ పిల్లలకు పెడుతున్న ఫుడ్ ఇదే! పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కేక్స్, కుకీస్ వంటి వాటిని ఇష్టంగా తింటారు. ఇవి మాత్రమే కాదు, బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తినే చపాతీ, పూరీ, పుల్కా, బోండా వంటివి కూడా చాలా డేంజర్. ఎందుకో తెలుసా! ఇవన్నీ మైదా పిండితో తయారు చేసినవే కాబట్టి.

నిత్యం మనకు తెలియకుండానే వివిధ రకాల ఫుడ్స్ రూపంలో మైదా పిండిని తినేస్తున్నాం. కానీ నిజానికి ఈ మైదాపిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనే విషయం మీకు తెలుసా!

మైదాపిండి ఎలా తయారవుతుంది?

వాస్తవానికి మైదాపిండి ఎలా తయారవుతుందో చాలామందికి తెలియదు. శనగపప్పు నుంచి శనగపిండి, బియ్యం నుంచి బియ్యప్పిండి, గోధుమల నుంచి గోధుమ పిండి తయారయినట్లే… మైదా పిండి కూడా గోధుమల నుండే తయారవుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. 

మైదా పిండి రావాలంటే… ముందుగా గోధుమలను మిల్లులో బాగా పాలిష్ చేస్తారు. వాటిని పిండి చేసి.. అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ వంటి కెమికల్స్ ని మిక్స్ చేస్తారు. మైదాలో “అల్లోక్సాన్” అనే టాక్సిక్ కెమికల్ ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. 

మైదాపిండితో చేసిన పదార్ధాలను తింటే ఏం జరుగుతుతుంది?

మైదాపిండితో చేసిన పదార్ధాలను తినడం అంటే… మన చేత్తో మనమే వైట్ పాయిజన్ ని తినటం అనమాట. ఈ విషయం  తెలియక చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకి బ్రేక్ ఫాస్ట్, లేదా స్నాక్స్ రూపంలో వీటినే ప్రిఫర్ చేస్తున్నారు.  మరి అలాంటి మైదాని మనం రెగ్యులర్ గా తింటే ఏం జరుగుతుందో మీరే ఓ లుక్కేయండి.

మైదా పిండితో చేసే ఆహారాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు:

ముగింపు 

ఇవి మాత్రమే కాదు, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఈ మైదా పిండితో చేసిన వంటకాలని తినటం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే.. వీలైనంత వరకు  దీనికి దూరంగా ఉండండి.

డిస్క్లైమర్:

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version