Site icon Healthy Fabs

జాగింగ్ ఉదయం చేస్తే మంచిదా? సాయంత్రం చేస్తే మంచిదా?

Best Time to Run

జాగింగ్ లేదా వాకింగ్ లేదా రన్నింగ్… ఏదైనా సరే ఉదయం చేస్తే మంచిదా? లేక సాయంత్రం చేస్తే మంచిదా? అనే డౌట్ చాలామందిలో ఉంది. నిజానికి ఆరోగ్యంగా ఉండాలంటే, రోజుకు కనీసం ఒక అరగంటైనా వ్యాయామం అవసరం. ముఖ్యంగా వీటిని ప్రతిరోజూ తప్పనిసరిగా చేస్తుండాలి. అప్పుడే మన బాడీ ఫిట్ గాను, హెల్దీగాను ఉంటుంది. 

ఫిట్నెస్ కోసం జిమ్ కి వెళ్లేకంటే… రోజూ ఒక అరగంట పాటు ఇంట్లో కసరత్తులు చేస్తే… శరీరం మొత్తానికి మంచి వ్యాయామం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి జిమ్‌కు వెళ్లలేకపోతున్నామని బాధపడకుండా… డైలీ జాగింగ్ కంటిన్యూ చేసేయచ్చు. అయితే, ఈ జాగింగ్ ని కొంతమంది ఉదయం చేస్తే… ఇంకొంతమంది సాయంత్రం వేళల్లో చేయడానికి ఇష్టపడతారు. మరి ఏ సమయంలో జాగింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదో! ఇప్పుడు చూద్దాం.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం చేయగలిగే ఉత్తమమైన పనులలో జాగింగ్ ఒకటి. ఉదయం 6–7, మధ్యాహ్నం 3–5, మరియు సాయంత్రం 6–8 జాగింగ్ చేయటానికి సరైన సమయాలు. ఇలాంటి సమయాల్లో జాగింగ్ చేయడం వల్ల కొన్ని లాభాలు ఉంటే, కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఉదయం 6–7:

లాభాలు:

ఉదయం వేళల్లో జాగింగ్ చేయటం వల్ల ఫ్యాట్ బర్నింగ్ జరిగి బరువు తగ్గుతారు. మజిల్స్ కి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. రోజంతా బ్లడ్ ప్రజర్ కంట్రోల్ లో ఉంటుంది. డిప్రెషన్ తగ్గుతుంది. 

నష్టాలు:

గాయాలు ఏమైనా ఉంటే, వాటి తాలూకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి తెలిత్తే ప్రమాదం ఉంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. లంగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

మధ్యాహ్నం 3–5:

లాభాలు:

మజిల్ బిల్డింగ్ బాగుంటుంది. రోజంతా ఎంతో యాక్టివ్ గా, ఎలర్ట్ గా ఉంటుంటారు. గాయాల తాలూకు ప్రమాదం తక్కువగా ఉంటుంది. 

నష్టాలు:

జాబ్ చేసేవాళ్ళకైతే, ఈ టైమ్ కన్వినెంట్ గా ఉండదు. వాతావరణం పరంగా చూస్తే, ఈ సమయం అంతగా అనుకూలించదు.  

సాయంత్రం 6–8: 

లాభాలు:

బాడి టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బ్లడ్ ప్రజర్ తగ్గుతుంది. ఎనర్జీ, స్టామినా వంటివి పెరుగుతాయి. గాయాల తాలూకు ప్రమాదం తక్కువగా ఉంటుంది. 

నష్టాలు:

స్లీపింగ్ టైమ్ డిలే అవుతుంది. చీకటి పడడం వల్ల బాడీ త్వరగా అలసిపోతుంది.

ఇకపోతే, ఉదయం వేళల్లో కంటే సాయంత్రం వేళల్లో జాగింగ్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిదని తేలింది. ఎందుకంటే, సాయంత్రం వేళ్లలో వాకింగ్, రన్నింగ్, లేదా జాగింగ్ వంటివి చేయడం వల్ల 50% ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక, మెటబాలిక్ యాక్టివిటీ కూడా ఎక్కువవుతుంది. 

చివరి మాట 

జాగింగ్ చేయటం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది కాబట్టి దానిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా పునరావృతం చేయడం ముఖ్యం. ఇది ఏ సమయంలో చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత తరచుగా చేశాం అన్నదే ముఖ్యం. మార్నింగ్ టైమ్ చేస్తే… ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఆఫ్టర్ నూన్ టైమ్ చేస్తే… హేల్డీగా, ఫిట్ గా ఉంటారు. ఈవెనింగ్ టైమ్ చేస్తే… బాడి టెంపరేచర్ కంట్రోల్ లో ఉంటుంది.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version