Site icon Healthy Fabs

Benefits of Turmeric Water for Skin

Benefits of Turmeric Water for Skin

యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగినటువంటి పసుపు కేవలం ఆహారం, ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించి అనేక రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. ఇక చర్మ సంరక్షణలో పసుపు చేసే మేలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వాపును తగ్గిస్తుంది

పసుపులో ఉండే యాక్టివ్ కాంపౌండ్ అయిన కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని కలిగి ఉంది. ఇది మొటిమల వలన కలిగే  చికాకులు, చర్మం ఎర్రబారటం వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది.

మచ్చలని నయం చేస్తుంది

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు డార్క్ స్పాట్స్, మచ్చలు, కోతలు, స్క్రాప్‌లు మరియు గాయాల వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.

స్కిన్ టోన్ పెంచుతుంది 

హైపర్‌ పిగ్మెంటేషన్‌కు కారణమయ్యే మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా చర్మపు రంగును పెంచుతుంది. అలానే చర్మాన్ని కాంతివంతంగా కూడా మారుస్తుంది.

హైడ్రేట్ గా ఉంచుతుంది

టర్మరిక్ వాటర్ స్కిన్ పై ఉండే తేమని లాక్ చేయటంలో సహాయపడుతుంది. అందువల్ల స్కిన్ ఎప్పుడూ మృదువుగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది.

ముడతలను తగ్గిస్తుంది

పసుపు యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఏజింగ్ సమస్యలని పోగొడతాయి. దీనివల్ల చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలు వంటివి పోతాయి.

చర్మ సమస్యలని ఉపశమింప చేస్తుంది 

తామర, సోరియాసిస్ మరియు రోసేసియా వంటి చర్మ సమస్యల నుండీ పసుపు నీరు ఉపశమింప చేస్తుంది. 

ఇన్‌ఫెక్షన్ల బారినుండీ కాపాడుతుంది 

పసుపు యొక్క క్రిమినాశక లక్షణాలు బ్రేక్‌అవుట్‌లను నివారించడంలో మరియు ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

రక్తస్రావాన్ని నివారిస్తుంది

పసుపు యొక్క యాంటీ సెప్టిక్ లక్షణాలు రక్త స్రావాన్ని నివారించి చర్మ రంధ్రాల పరిమాణాన్ని తగ్గించి చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. 

స్కిన్ గ్లోని పెంచుతుంది 

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడతాయి.

ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుండీ కాపాడుతుంది 

కాలుష్యం బారినుండీ కూడా మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

పై ప్రయోజనాలన్నీ పొందేందుకు, పసుపు నీటిని క్రమం తప్పకుండా త్రాగండి లేదా తేనె, పెరుగు లేదా వోట్ మీల్ వంటి ఇతర సహజ పదార్థాలతో కలిపి ముఖానికి మాస్క్‌గా ఉపయోగించండి.

పసుపుని ఫేస్ ప్యాక్ లా అప్లై చేయాలంటే… ఒక బౌల్ లో పసుపును వేసి, అందులో పెరుగు, తేనె వంటివి కూడా వేసి కలిపి దానిని ఫేస్ మాస్క్‌ లా తయారు చేసుకోవాలి.  ఈ మాస్క్‌ను మీ ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు ఉంచి ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version