Site icon Healthy Fabs

Why do Strokes Increase in the Winter Months?

Infographic illustrating the reasons behind the higher stroke risk in winter months"

Understanding the seasonal factors behind the increase in strokes during winter months

మన మెదడులో ఏదైనా ఒక భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతే  స్ట్రోక్ వస్తుంది. అయితే ఇది రెండు కారణాల వల్ల జరగవచ్చు. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ – అంటే ధమని మూసుకుపోవటం వల్ల కావచ్చు. రెండవది హెమరేజిక్ స్ట్రోక్ – అంటే రక్త నాళాలు చిట్లటం వల్ల కావచ్చు. రీజన్ ఏదైనా సరే ఈ అంతరాయం మెదడు కణాలకు ఆక్సిజన్ ని, పోషకాలని అందకుండా చేస్తుంది. దీనివల్ల అవి నిమిషాల్లోనే చనిపోతాయి.  

శీతాకాలంలో పెరిగే చలి ఉష్ణోగ్రతలు, జీవనశైలిలో   మార్పులు మరియు పర్యావరణ కారకాల కారణంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాలను అర్థం చేసుకోవడం మరియు నివారణ చర్యలు తీసుకోవడం వల్ల చల్లని నెలల్లో స్ట్రోక్‌ల తీవ్రత నుంచీ బయట పడవచ్చు. అయితే శీతాకాలంలో వచ్చే ఈ స్ట్రోక్‌ లని ఎలా నివారించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలోనే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉండటానికి కారణాలు 

నిజానికి మిగతా సీజన్లతో పోల్చి చూస్తే, చలికాలంలోనే ఎక్కువగా ఈ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. అది ఎందుకో, ఏమిటో, అందుకు దారితీసే పరిస్థితులు ఏమిటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

రక్తపోటు పెరిగటం 

చల్లని వాతావరణం రక్త నాళాలు కుంచించుకుపోవడానికి కారణమవుతుంది. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగ్గా రక్తపోటుకి దారితీస్తుంది. దీనిని నివారించాలంటే, వెచ్చని  దుస్తులు ధరించడం, ఇంటిలోపల ఫైర్ ఏర్పాటు చేయటం, రూమ్ హీటర్లు ఉపయోగించి మీ ఇంటిని తగినంతగా వెచ్చగా ఉంచుకోవటం ఇలాంటి సింపుల్ టిప్స్ ఉపయోగించి వీలైనంత వరకూ రక్తపోటును నియంత్రించవచ్చు.

రక్తం చిక్కబడటం 

చల్లని ఉష్ణోగ్రత కారణంగా రక్తం చిక్కబడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఇది గడ్డకట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే, బాడీలో వాటర్ పర్సంటేజ్ పెంచాలి.

రక్తం గడ్డకట్టటం

విపరీతమైన చలి వాతావరణానికి గురయ్యే వాళ్ళకి  రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. అందుకోసం చలికి ఎక్కువసేపు గురికాకుండా ఉండండి. ఇంకా రక్తం పల్చబడటానికి డాక్టర్ సూచించిన మందులను ఉపయోగించండి. 

శారీరక శ్రమ తగ్గటం 

సాదారణంగా శీతాకాలంలో ఎవరైనా వ్యాయామం తక్కువగా చేస్తారు. దీని వలన బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మరియు కార్డియోవాస్క్యులర్ హెల్త్ సరిగా లేకపోవడం జరుగుతుంది. 

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు

ఫ్లూ వంటి శీతాకాలపు అనారోగ్యాలు ఇన్ఫ్లమేషన్ ని  పెంచుతాయి. ఇది రక్త నాళాలలో ప్లేక్స్ ని  నిలిపివేస్తాయి. దీంతో అది స్ట్రోక్‌ను ప్రేరేపిస్తుంది. అందుకోసం ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు టీకాలు వేయించుకోవాలి.  రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలి.

ఇది కూడా చదవండి: How to Manage Arthritis Symptoms in Winter

సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ 

శీతాకాలంలో తరచుగా నిరాశ ఎక్కువవుతుంది. దీంతో  ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా కూడా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, మానసిక ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటివి చేయండి. శారీరకంగా చురుకుగా ఉండటానికి ట్రై చేయండి. సహజ సూర్యకాంతికి మిమ్మల్ని మీరు ఎక్స్ పోజ్ చేసుకోండి.

సోడియం ఎక్కువగా తీసుకోవడం

శీతాకాలంలో వెచ్చదనం కోసం గరం గరం ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాటిలో కారంతో పాటు ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అందుకే ఈ సీజన్లో ఉప్పు తీసుకోవడం పరిమితం చేయండి దానికి బదులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి  గుండెమేలు చేసే తక్కువ సోడియం ఉన్న భోజనాన్ని ఎంచుకోండి.

విటమిన్ డి స్థాయిలు తగ్గుటం 

శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్ల విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. ఇది వాస్కులర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఫ్యాటీ ఫిష్, న్యూట్రిషనల్ ఫుడ్ వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను మీ ఆహారంలో చేర్చండి లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించిన తర్వాత సప్లిమెంట్లను పరిగణించండి.

దీర్ఘకాలిక పరిస్థితుల ప్రభావం 

చలికాలంలో మధుమేహం, రక్తపోటు మరియు గుండె జబ్బులు వంటి పరిస్థితులు తరచుగా తీవ్రమవుతాయి. వీటివల్ల కూడా స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. 

ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ 

శీతాకాలంలో ఇంట్లో ఫైర్ ప్లేసెస్, హీటర్స్ మరియు పూర్  వెంటిలేషన్ ఉండటం వల్ల ఇండోర్ పొల్యూషన్ పెరుగుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ముగింపు 

మొత్తంగా ఈ ఆర్టికల్ ద్వారా శీతాకాలంలో వచ్చే స్ట్రోక్ ప్రమాదాన్ని ముందుగానే గమనించటం మరియు పరిష్కరించడం ద్వారా, వ్యక్తులు తమను తాము రక్షించుకో గలుగుతారు. దీనివల్ల చల్లని నెలల్లో స్ట్రోక్‌ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version