కోవిడ్-19 మహమ్మారి నుండి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో WHO మరో బాంబు పేల్చింది. కరోనా కంటే 7 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపే ప్రాణాంతకమైన ఓ అంటువ్యాధి రాబోతోంది..! ఈ ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలక్రిందులు చేయబోతోంది. దాని పేరు ‘X’ అని నామకరణం చేశారు.
చరిత్రని ఒకసారి తిరగేస్తే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారులు చాలానే ఉన్నాయి. ఇవి భూమిపై తీవ్ర ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం మిగిల్చి వెళ్లాయి. వీటి ప్రభావం నుంచి కోలుకోవటానికి ప్రజలకు చాలా కాలమే పట్టింది. గత 400 ఏళ్ళల్లో మానవాళిని అతలాకుతలం చేసిన మహమ్మారిలలో 1720లో వచ్చిన ప్లేగు, 1817లో వచ్చిన కలరా, 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ, 2019లో వచ్చిన కరోనా ఉన్నాయి.
ప్రపంచంలోని ఏ దేశమూ వీటి బారినుండీ అంత త్వరగా బయట పడలేదు. ఈ వ్యాధుల బారిన పడి లక్షల కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి.
ప్లేగు వ్యాధి 50 వేల మంది ప్రాణాలను కబళించింది. కలరా వ్యాధి లక్షల మందిని బలితీసుకుంది. స్పానిష్ ఫ్లూ 5 కోట్లకు పైగా మరణాలకు కారణమైంది. కోవిడ్-19 7 మిలియన్ల మందిని బలిగొంది. X 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొనే అవకాశం ఉందని అంచనా.
డిసీజ్ X అంటే ఏమిటి?
‘డిసీజ్ X’ అనేది వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలా ఏ రూపంలోనైనా మనమీద దాడి చేయవచ్చు. ఈ దాడి ఎవరిపై ఎక్కడ మొదలవుతుందో వైద్య శాస్త్రానికి కూడా తెలియదు. అందుకే ప్రజలంతా సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆధునిక ఆహారపు అలవాట్లను మానుకోవాలి. మేలైన పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
డిసీజ్ X ఎలా బయటపడుతుంది?
‘డిసీజ్ X’ మొదట రెస్పిరేటరీ వైరస్‌గా స్టార్ట్ అవుతుంది. గబ్బిలాలు పక్షులు లేదా కొన్ని ఇతర రకాల జంతు జాతుల నుండీ ఈ వ్యాధి అంటువ్యాధి రూపంలో బయటపడుతుంది.
ఇది కూడా చదవండి: What Are the Common Signs and Symptoms of High Stomach Acid?
డిసీజ్ X వైరస్ లక్షణాలు ఏమిటి?
డిసీజ్ X అనేది ఏ రకంగానైనా మానవులకి వ్యాపించ వచ్చు. ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే…
- జ్వరం
- తలనొప్పి
- మెడ నొప్పి
- గొంతు నొప్పి
- వెన్నునొప్పి
- కండరాలలో తిమ్మిరి
- కళ్ళ వాపు
- వికారం
- వాంతులు
- విరేచనాలు
- పొత్తికడుపులో అసౌకర్యం
- మూర్ఛ
ఎలాంటి సన్నాహాలు అవసరం?
ఈ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని WHO కోరింది. దీన్ని నివారించేందుకు యావత్ ప్రపంచం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని హెచ్చరించింది. ‘X’ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించింది.
అందుకోసం ప్రజలంతా సరైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆధునిక ఆహారపు అలవాట్లను తగ్గించి మేలైన పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకొనే క్రమంలో రోజూ యోగా, ఎక్సర్సైజుల వంటివి చేయాలి. విటమిన్ డి కోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. విటమిన్ C ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగాలి.
ముగింపు
డిసీజ్ X అనేది ఒక రహస్యమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధికారకం. ఇది ప్రపంచ ఆరోగ్యానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుంది. భవిష్యత్తులో ఈ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి అప్రమత్తత అవసరం.
డిస్క్లైమర్
ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.