ఇన్సులిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగించే వ్యాధే డయాబెటిస్. డయాబెటిస్ వచ్చినప్పుడు ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి అనేక సైడ్ ఎఫెక్ట్స్ కి దారితీస్తాయి. ముఖ్యంగా తరచూ మూత్రవిసర్జన జరగటం, ఆకలి పెరగడం, దాహం పెరగటం, కంటి చూపు తగ్గటం, గాయం మానడం ఆలస్యం అవటం వంటి సాధారణ లక్షణాలతో పాటు కొన్ని చర్మ సమస్యలకి కూడా దారితీస్తుంది.
నిజానికి స్కిన్ డిసీజెస్ ఏవైనా వస్తే… వాటిని ట్రీట్ మెంట్ ద్వారా నయం చేయవచ్చు. కానీ, డయాబెటీస్ కారణంగా వచ్చే స్కిన్ డిసీజెస్ కి వెంటనే ట్రీట్ మెంట్ ఇవ్వటం కుదరదు. ఈ క్రమంలో అసలు మధుమేహులకి వచ్చే చర్మ సమస్యలు ఏవో… వాటిని ఎలా అధిగమించాలో… ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదికూడా చదవండి: మధుమేహులు కొబ్బరినీళ్లు తాగడం మంచిదేనా?
డయాబెటిక్ రోగులలో చర్మ సమస్యలు:
డయాబెటిస్ ఉన్నవారిలో ఫంగల్, మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఇంకా దురద వంటి చర్మ సమస్యలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి:
డయాబెటిక్ డెర్మోపతి:
ఇందులో చర్మంపై గుండ్రని, లేదా ఓవల్ ఆకారంలో ముదురు రంగు దద్దుర్లు కనిపిస్తాయి.
నెక్రోబయోసిస్ లిపోయిడికా డయాబెటికోరం:
ఇది ముఖ్యంగా పాదాల దిగువ భాగంలో కనిపించే పాచెస్.
డయాబెటిక్ అల్సర్స్ :
శరీరంపై పెద్ద పెద్ద బొబ్బలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాళ్లు, పాదాలు, చేతులు, ముంజేతులు వద్ద కనిపిస్తాయి. కానీ, ఈ బొబ్బలు మాత్రం నొప్పిని కలిగించవు.
డయాబెటిక్ దురద:
డయాబెటీస్ రోగులకు ఎక్కువగా చర్మం పొడిబారి దురద పెడుతుంది. డయాబెటీస్ కారణంగా రక్తప్రసరణ మందగించినప్పుడు ఈ సమస్య వస్తుంది.
గ్జాంథిలాస్మా:
రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగినట్లయితే కనురెప్పల మీద లేదా చుట్టూ పసుపు రంగు పొలుసులు ఏర్పడతాయి.
ఇదికూడా చదవండి: షుగర్ పేషెంట్స్ ఈ చిన్న సంకేతాలు గుర్తించకపోతే… ప్రాణాలకే ప్రమాదం
చర్మ సమస్యలను అధిగమించాలంటే:
- ముందుగా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి.
- చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి.
- వేడి నీటితో స్నానం చేయడం మానుకోవాలి.
- మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, సోప్స్ వంటివి ఉపయోగించాలి.
- స్నానం చేసిన తర్వాత బాడీ లోషన్ ఉపయోగించాలి.
- చర్మం పొడిబారకుండా నియంత్రించాలి.
- చర్మంపై కోతలు, గాట్లు వంటివి ఏర్పడితే వెంటనే అది మానటానికి చర్యలు తీసుకోవాలి.
డిస్క్లైమర్:
పైన తెలిపిన అంశాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. అంతేకానీ healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.