Site icon Healthy Fabs

ఈ సంకేతాలు కనిపిస్తే మీకు ఛాతీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే!

కరోనా మహమ్మారి పుణ్యామా అని ఇటీవలికాలంలో ఏమాత్రం ఛాతీలో నొప్పి వచ్చినా భయపడాల్సి వస్తుంది. నిజానికి అన్ని రకాల చెస్ట్ పెయిన్స్… చెస్ట్ ఇన్ఫెక్షన్ కి దారి తీయవు. అలాగని చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని రకాల ఛాతీ నొప్పులు సాదారణమైనవే అయితే, మరికొన్ని రకాల ఛాతీ నొప్పులు మాత్రం ప్రాణాంతకంగా మారతాయి.

కొన్నిసార్లు మనం తిన్న ఆహార పదార్ధాల కారణంగా అసిడిటీ, గ్యాస్ వంటివి వస్తుంటాయి. దీనివల్ల ఛాతీలో నొప్పి వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు మారుతున్న వాతావరణం కారణంగా కూడా ఛాతీ నొప్పి వస్తుంటుంది. మరి కొన్నిసార్లు పొల్యూషన్ ఎక్కువగా ఉండే ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఛాతీ నొప్పి వస్తుంటుంది. తేలికపాటి ఛాతీ నొప్పి అయితే 7 నుంచి 10 రోజులలో నయమవుతుంది. అలా కాక, నొప్పి తీవ్ర రూపం దాలిస్తే, ఎక్కువ రోజులు సమయం తీసుకోవచ్చు. లేదంటే ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. మరి అలాంటి ఛాతీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దగ్గు:

ఛాతీలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు తీవ్రమైన దగ్గు వస్తుంది. అదే సమయంలో దగ్గుతోపాటు పసుపు రంగులో ఉండే ప్లమ్ కూడా బయటకు రావచ్చు. కాబట్టి చాలా కాలంగా కళ్ళెతో కూడిన దగ్గుతో బాధపడుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:

ఛాతీ ఇన్ఫెక్షన్ ఉంటే శ్వాసతీసుకోవటంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ సమయంలో ఊపిరి సరిగ్గా ఆడకపోవటం, శ్వాస వేగంపెరగటం వంటివి జరుగుతాయి. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే అస్సలు నిర్లక్షం చేయవద్దు.

ఛాతీ నొప్పి:

ఛాతీ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక్కోసారి ఛాతీలో నొప్పి వస్తుంది. అలాగే ఒక్కోసారి ఛాతీలో మంట కూడా వస్తుంది. ఇవన్నీ ఛాతీ ఇన్ఫెక్షన్ కి కారణాలు.

తలనొప్పి:

తలనొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది. అయితే, ఛాతీలో నొప్పి లేదా ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతుంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి.

పై సంకేతాల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

Exit mobile version