Site icon Healthy Fabs

నిద్రలో కాలి కండరాలు పట్టేస్తుంటే… ఈ హోమ్ రెమెడీస్ పాటించండి!

Leg Cramps at Night

చాలా మందికి నిద్రపోతున్నప్పుడు కాలి కండరాలు పట్టేస్తుంటాయి. దీంతో కాలు మెలితిప్పిన భావన కలుగుతుంది. అప్పుడు వెంటనే మెలకువ వచ్చేస్తుంది. ఊహించని విధంగా నిద్రలో ఇలా జరగటం వల్ల… కాలిలో విపరీతమైన నొప్పి, తిమ్మిర్లు వంటివి కలుగుతాయి.  అసలే నైట్ టైమ్ కావటంతో పెయిన్ అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీంతో పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడటం తప్ప వేరొక మార్గం లేదు. 

అయితే మందులు వాడటం వల్ల అప్పటికి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చేమో కానీ, పూర్తిగా మాత్రం కాదు. అలాకాక, మెడిసిన్ కంటిన్యూ చేస్తే… కొత్త చిక్కులు వచ్చిపడతాయి.  ఈ నేపథ్యంలో సమస్య నివారణ కోసం కొన్ని హోమ్ రెమెడీస్ ని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుఫు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: నిద్రలో మీ చేతులు, కాళ్ళు తిమ్మిర్లు రావటానికి కారణాలు ఇవే!

ఆయిల్ మసాజ్:

కాళ్లు, లేదా పాదాలలో నొప్పి ఉన్నప్పుడు మసాజ్ ఇన్స్టంట్ రిలీఫ్ ని ఇస్తుంది. అందుకోసం నూనెను కాస్త వేడి చేసి కాళ్ళపై రుద్ది మసాజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇలా ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. మెదడు నుంచి రిలాక్స్ అవుతుంది. దీని వల్ల నొప్పి తగ్గుతుంది.

స్లీపింగ్ పొజిషన్ చేంజ్:

మనం నిద్రపోయే విధానం కూడా ఒక్కోసారి కాళ్లలో నొప్పికి కారణం అవుతుంది. ఓకే భంగిమలో కదలకుండా  పడుకోవటం వలన కండరాలు బిగుసుకుంటాయి. దీంతో ఆ ప్రాంతంలో నొప్పి కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడు కదులుతూ ఉండాలి. ఎప్పుడూ ఓకే భంగిమలో కాకుండా వివిధ భంగిమలని మార్చి మార్చి పడుకోవాలి. 

స్ట్రెచ్ అవుట్:

అప్పుడప్పుడూ కాలి కండరాలను సాగదీయాలి. ముఖ్యంగా కండరాల తిమ్మిరి వచ్చినప్పుడు నేలపై కూర్చోవాలి; కాలిని బాగా ముందుకి చాపాలి; ఆపై స్ట్రెచ్ అవుట్ చేయాలి. కండరాల తిమ్మిరి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి. 

ఇది కూడా చదవండి: అర్ధరాత్రుళ్ళు గొంతు ఎండిపోయి… దాహం వేస్తుందా..! దానికి గల కారణాలు ఇవే!

హీటింగ్ ప్యాడ్:

కండరాల తిమ్మిరి నివారణలలో మరొకటి హీటింగ్ ప్యాడ్, లేదా హాట్ వాటర్ షావర్. ఇది కండరాల తిమ్మిరితో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఆలాగే కండరాలు వదులుగా మారటానికి సహాయపడుతుంది.

ఐస్ క్యూబ్‌:

కండరాల నొప్పులు, లేదా  తిమ్మిరి ఉంటే… చల్లని ఐస్ క్యూబ్‌లతో అక్కడ మర్దన చేయాలి. కోల్డ్ కంప్రెస్ నొప్పిని తగ్గిస్తుంది.

డ్రింకింగ్ వాటర్:

కండరాల తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి తగినంత నీరు త్రాగడం ఒక మార్గం. ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల కూడా కండరాల తిమ్మిరివస్తుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు త్రాగటం వలన వాటిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు, మీ కండరాల కణాలు కూడా హైడ్రేట్‌గా ఉంటాయని గుర్తు పెట్టుకోండి.

డిస్క్లైమర్:

ఈ సాదారణ నివారణా చర్యలు చేపట్టి వీలైనంతవరకూ కాలి కండరాల తిమ్మిరి, లేదా నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇంకా అవసరమైతే, ఇబుప్రోఫెన్, లేదా పారాసెటమాల్ వంటి సాధారణ నొప్పి నివారిణిని తీసుకోండి. అయినా కూడా కాళ్లలో నొప్పి తగ్గకుండా తరచూ బాధిస్తుంటే, రక్త పరీక్ష చేయించుకోవాలి. వీలైనంత త్వరగా డాక్టర్ కి చూపించుకోవాలి. ఎందుకంటే, మజిల్ క్రాంప్ కి ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ కూడా కారణమే! అలాగే ఇది ఆర్థరైటిస్ కి కూడా దారితీయెచ్చు.

Exit mobile version