Site icon Healthy Fabs

గోండ్ కటిరా: ఈ తినే గమ్ లో ఎన్ని  ఆరోగ్య ప్రయోజనాలో..!

A bowl of soaked Gond Katira (Tragacanth Gum) with a jelly-like texture, surrounded by almonds, milk, and honey, showcasing its health benefits.

A nutritious and natural cooling agent – Discover the health benefits of Gond Katira (Tragacanth Gum).

గోండ్ కటిరా… ఈ పేరు వినటానికే చాలా విచిత్రంగా ఉంది కదూ! నిజానికిది ఓ నేచురల్ గమ్, దీనిని తినొచ్చు కూడా. అంతేకాదు, ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించబడే ఈ గోండ్ కటిరా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అదేంటో తెలుసుకొనే ముందు అసలు గోండ్ కటిరా గురించి బ్రీఫ్ గా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

Table of Contents

Toggle

గోండ్ కటిరా అంటే ఏమిటి?

గోండ్ కటిరా అనేది ట్రాగా క్యాంతుస్ మొక్క  వేర్ల నుండి  సేకరించబడుతుంది. ఈ మొక్క  ఆస్ట్రాగలస్ జాతికి చెందిన చెట్లలో ఒకటి. ఈ జాతులు ప్రపంచంలోని మిడిల్ ఈస్ట్  ప్రాంతానికి చెందినవి. ఈ గమ్ ప్రధానంగా ఇరాన్లో ఉత్పత్తి అవుతుంది. పర్షియన్ వైద్యంలో కూడా ఎక్కువగా వాడటం జరుగుతోంది. 

నేచురల్ గమ్‌ను కొన్నిసార్లు “షిరాజ్ గమ్”, “షిరాజ్”, “గమ్ ఎలెక్ట్” లేదా “గమ్ డ్రాగన్” అని పిలుస్తారు. తెలుగులో అయితే దీనిని “గోధుమ బంక” లేదా “బాదాం బంక” అనే పేర్లతో పిలుస్తారు. 

దీనికి రుచి, వాసన అంటూ ఏమి ఉండదు. ఈ గమ్ ని నీటిలో వేసినపుడు కొద్దిగా కరిగి జెల్లీలాగా సాఫ్ట్ గా మారుతుంది.  దీనిని పేస్ట్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ జెల్లీలాంటి స్వభావం వల్ల శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. 

గోండ్ కటిరా యొక్క పోషక విలువలు

గోండ్ కటిరాలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి మరియు ఆల్కలాయిడ్‌లతో పాటు దాదాపు 3% ప్రోటీన్ కూడా ఉంటుంది.

గోండ్ కటిరా యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

గోండ్ కటిరా దాని ప్రత్యక స్వభావం కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజానలని అందిస్తుంది. అవి:

శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది

వేసవి కాలంలో శరీరం అధిక ఉష్ణోగ్రతను పెంచుకుంటుంది, దీని వల్ల అలసట, నీరసం, దాహం వంటి సమస్యలు ఎదురవుతాయి. గోండ్ కటిరా శరీరాన్ని చల్లగా ఉంచే శక్తిని కలిగి ఉండడం వల్ల, వేసవిలో దీన్ని తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. 

దాహాన్ని తగ్గిస్తుంది 

ఈ గమ్ నీటిలో నానిపోతే జెల్లీ మాదిరిగా మారుతుంది. దీన్ని పానీయాల్లో కలిపి తాగితే శరీరంలో తేమ స్థాయిని పెంచి, ఒంటిపై చల్లదనాన్ని తీసుకొస్తుంది.

హార్మోన్లను సమతుల్యం చేస్తుంది

గోండ్ కటిరాలోని సహజ గుణాలు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఇది ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే రుతు చక్ర సమస్యలు, మెనోపాజ్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఈ గమ్ మంచి నేచురల్ లాక్సటివ్‌గా పనిచేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే  పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తుంది.

శక్తిని పెంచుతుంది

గోండ్ కటిరాలో ఉన్న పోషకాలు శరీరానికి ఉల్లాసాన్ని, శక్తిని అందిస్తాయి. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే, అలసట తగ్గి, శక్తి స్థాయులు మెరుగుపడతాయి.

తీవ్ర తలనొప్పిని తగ్గిస్తుంది

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల తలనొప్పి వచ్చే సమస్య ఉంటుంది. గోండ్ కటిరాను ఉపయోగించడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

చర్మాన్ని తేమగా ఉంచే గుణాలు గోండ్ కటిరాలో ఉన్నాయి. ఇది చర్మాన్ని సహజంగా అందంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు పెరిగేందుకు సహాయపడుతుంది

అతి తక్కువ బరువు ఉన్నవారికి ఈ గమ్ బాగా  ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వును పెంచేలా చేస్తుంది.

ఇమ్మ్యూనిటీ పెంచుతుంది

ఇందులో సహజ యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది

ఇది గర్భిణీ స్త్రీలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రసవానంతర శక్తిని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Semolina Nutrition Facts and Benefits

గోండ్ కటిరా యొక్క ఇతర ప్రయోజనాలు 

గోండ్ కటిరా దాని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. అవి:

గోండ్ కటిరా ఉపయోగించే విధానం

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ గోండ్ కటిరాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

నీటిలో నానబెట్టి తాగడం 

ఈ గోండ్ కటిరాను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగితే మంచి ప్రయోజనం పొందవచ్చు.

షేక్స్, జ్యూస్‌లలో కలిపి 

పాలను లేదా జ్యూస్‌లను తీసుకుంటున్నప్పుడు అందులో ఈ గమ్ ని కలిపి తాగితే రుచి కూడా మెరుగవుతుంది.

స్వీట్స్‌లో ఉపయోగించడం 

దీనిని లడ్డూలు, మిఠాయిలలో కూడా ఉపయోగించొచ్చు.

గోండ్ కటిరా యొక్క దుష్ప్రభావాలు

గోండ్ కటిరాను ఉపయోగించడం అప్పుడప్పుడు ప్రమాదకరంగా కూడా నిరూపించబడింది. ఆస్ట్రాగలస్ గమ్మిఫర్ యొక్క అనేక జాతులు హానికరమైన గ్లైకోసైడ్‌లను కలిగి ఉంటాయి. ఇవి అలర్జీలని కలిగిస్తాయి. 

ఇంకా, గోండ్ కటిరా తినప్పుడు వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. లేదంటే మలబద్ధకం, ఉబ్బరం వంటివి సంభవించవచ్చు. అంతే కాదు ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొంతమందికి అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి. అంతటితో ఆగకుండా వాంతులు, విరేచనాలు లేదా చర్మం పై దద్దుర్లు మొదలైన వాటికి కారణం కావచ్చు. 

ముగింపు

గోండ్ కటిరా అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఉత్పత్తి. ఇది వేడి నుండి రక్షించడంతో పాటు, జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శరీర శక్తిని పెంచేలా చేస్తుంది. దీనిని మితంగా మరియు సరైన విధంగా ఉపయోగించుకుంటే, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే అంతకుమించి దుష్ఫలితాలు కూడా పొందవచ్చు. అందుకే దీనిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో బాగా తెలిసి ఉండాలి. 

👉 “ఆరోగ్యమే అసలైన సంపద! 💪🍏”

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version