Site icon Healthy Fabs

కొత్తిమీర ఆకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Fresh green coriander leaves with visual icons representing their health benefits such as digestion, heart health, diabetes control, detoxification, and immunity boost.

Coriander leaves offer numerous health benefits, including improved digestion, detoxification, and immune system support.

కొత్తిమీర అనేది మనం వంటల్లో తరచుగా ఉపయోగించే ఒక సుగంధ ద్రవ్యము. ఇది కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒకరకంగా ఇది ఓషధ మొక్కని చెప్పొచ్చు. దీన్ని రోజూ మన ఆహారంలో ఏదో ఒక విధంగా తీసుకొంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తిమీర ఆకులలో ఉండే న్యూట్రి షనల్ వాల్యూస్ ఏమిటో తెలుసుకుందాం.

కొత్తిమీర ఆకులలో ఉండే న్యూట్రి షనల్ వాల్యూస్

కొత్తిమీర ఆకులు అనేక న్యూట్రి షనల్ వాల్యూస్ ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా…

✅ విటమిన్ A, C, K
✅ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం
✅ డైటరీ ఫైబర్
✅ యాంటీఆక్సిడెంట్లు

ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

కొత్తిమీర ఆకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీర ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ముందుగా…

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది

కొత్తిమీర ఆకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, అసిడిటీ, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే నేచురల్ ఆయిల్స్ ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది

కొత్తిమీరలోని అనేక క్రియాశీలక సమ్మేళనాలు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

కొత్తిమీరలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండుట వలన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇది మొటిమలు, పొడిబారిన చర్మం, అలర్జీ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

కొత్తిమీరలో విటమిన్ C మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండుట వలన రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది.

ఇది కూడా చదవండి: రోజూ మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మూత్ర సంబంధిత ఇబ్బందులను తగ్గిస్తుంది

కొత్తిమీర ఆకుల రసం  మూత్ర సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

కొత్తిమీర ఆకుల్లో విటమిన్ A అధికంగా ఉండుట వలన కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం మంచిది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది  

కొత్తిమీరలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. ఇది స్కిన్ అలర్జీ మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది 

కొత్తిమీరలోని సహజమైన డిటాక్సిఫైయింగ్ లక్షణాలు శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మతిమరుపును తగ్గిస్తుంది

కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి మతిమరుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

కొత్తిమీర ఆకులను ఎలా ఉపయోగించాలి?

ఆరోగ్య ప్రయోజనాలని అందించే కొత్తిమీరని ఆహారంలో ఎలా ఉపయోగిచాలో తెలుసుకుందాం. 

సలాడ్స్ 

కత్తిరించిన  కొత్తిమీర ఆకులను సలాడ్స్‌లో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది.

జ్యూస్ 

కొత్తిమీర ఆకులతో జ్యూస్ తయారు చేసి తాగితే బాడీని దితాక్సిఫై చేస్తుంది.

కూరలు 

రోజువారీ కూరల్లో, పచ్చళ్లలో కొత్తిమీర ఆకులను ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి.

వాటర్ 

గర్భిణీ మహిళలు మరియు మధుమేహ రోగులు కొత్తిమీర ఆకుల నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ముగింపు

కొత్తిమీర ఆకులు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థ నుంచి గుండె ఆరోగ్యాన్ని, చర్మం నుంచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచే అద్భుతమైన సహజ ఔషధం. ప్రతి రోజూ మన ఆహారంలో కొత్తిమీర ఆకులను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు.

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version