Site icon Healthy Fabs

ABC జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

A glass of ABC juice (Apple, Beetroot, Carrot) surrounded by fresh fruits and vegetables, representing a healthy lifestyle and natural wellness.

ABC Juice – A nutritious blend of apple, beetroot, and carrot for a healthier you!

సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవాలనుకొంటే, దానికి పోషకాహారం ఒక్కటే సరైన మార్గం. అలాంటి పోషకాహారం కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు ABC జ్యూస్ రైట్ ఛాయిస్. చాలామందికి జ్యూస్ తాగటంతో తమ రోజును స్టార్ట్ చేయటం అలవాటు. అలాంటి వాళ్లకి ఇదో గుడ్ ఆప్షన్. అంతేకాదు, మిగిలిన జ్యూస్ లతో పోలిస్తే ABC జ్యూస్ ఒక ప్రత్యేకమైనది. దీనికున్న మ్యాజికల్ పవర్స్ కారణంగా ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. 

ఇంతకీ అసలు ABC జ్యూస్ అంటే ఏమిటి? ఇందులో ఉన్న పోషక విలువలు ఏమిటి? ఈ జ్యూస్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? దీనిని ఎవరు తాగాలి? ఎవరు తాగకూడదు? దీనిని ఎలా తయారు చేసుకోవాలి? తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ABC జ్యూస్ రోజూ తాగితే దుష్ప్రభావాలేమైనా ఉన్నాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం.

Table of Contents

Toggle

ABC జ్యూస్ అంటే ఏమిటి?

ABC జ్యూస్ అనేది Apple (ఆపిల్), Beetroot (బీట్రూట్), Carrot (క్యారెట్) కలిపి చేసిన ఒక హెల్దీ జ్యూస్. ఇది విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉండటంతో, శరీరానికి మంచి శక్తినిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది.

ABC జ్యూస్ లో ఉన్న పోషక విలువలు ఏమిటి?

ఆపిల్ (Apple)

బీట్రూట్ (Beetroot)

క్యారెట్ (Carrot)

ABC జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవి?

ABC జ్యూస్ తాగటం వల్ల శరీరం మరియు మెదడు రెండింటికీ మేలు చేకూరుతుంది. అంతేకాదు మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు కలిగిస్తుంది. అవేంటో చూసేద్దామా మరి.

హిమోగ్లోబిన్ ని పెంచుతుంది 

బీట్రూట్‌లో అధికంగా ఉండే ఐరన్, ఫోలేట్ వల్ల రక్తం శుభ్రపడి హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల అనీమియా ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది 

ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

జీర్ణ వ్యవస్థకు మేలుచేస్తుంది 

ఆపిల్, క్యారెట్‌లో పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది

ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మ కాంతిని పెంచి, మొటిమలు, ముడతలు రాకుండా కాపాడుతుంది.

కంటి చూపును కాపాడుతుంది 

క్యారెట్‌లో ఉన్న విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రేచీకటి సమస్యని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ మెదడుకు రక్తప్రసరణను పెంచటంలో సహాయపడతాయి, ఇలా ఒకరకంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఈ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది

బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ రక్తనాళాలను విశ్రాంతి చెందేలా చేసి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

మూడ్‌ను మారుస్తాయి 

ఈ జ్యూస్‌లోని న్యూట్రియెంట్లు మెదడుకు శక్తినిచ్చి, ఆనందాన్ని కలిగించే హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి.

ఇమ్యూనిటీని పెంచుతుంది

విటమిన్ C అధికంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే క్యారెట్ అల్లం జ్యూస్

ABC జ్యూస్ ఎవరు తాగాలి? ఎవరు తాగకూడదు?

ABC జ్యూస్ ని ఎవరైనా  తాగచ్చా… అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీనిని అందరూ తాగకూడదు. మరి ఎవరెవరు తాగాచ్చో… ఎవరెవరు తాగకూడదో తెలుసుకుందాం.

తాగవలసిన వారు

తాగకూడని వారు

ABC జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి?

ఇంత ఎనర్జీని అందించే ABC జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడే చెప్పుకొందాం. 

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం

  1. అన్ని కాయలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  2. మిక్సీ జార్‌లో వేసి, ½ గ్లాస్ నీరు పోసి బ్లెండ్ చేయాలి.
  3. త్రాగేముందు అందులో రుచికి నిమ్మరసం కలుపుకోవచ్చు.
  4. కొంచెం తేనె కలిపి తాగితే మరింత రుచిగా ఉంటుంది.

ABC జ్యూస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? 

ABC జ్యూస్ తాగితే దుష్ప్రభావాలేమైనా ఉన్నాయా?

ముగింపు

ABC జ్యూస్ అనేది ఒక సూపర్ హెల్దీ డ్రింక్. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, దీన్ని అధికంగా తాగితే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే, పరిమితంగా తాగడం మంచిది!

మీరు ABC జ్యూస్ తాగారా? మీ అనుభవం కామెంట్ చేయండి! 🚀

డిస్క్లైమర్

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version