Site icon Healthy Fabs

చలికాలంలో ఉసిరికాయలు తింటే కలిగే లాభాలివే!

Eating Amla in Winter Season

ఎన్నో అనారోగ్య సమస్యలని నయం చేసే గుణం ఉసిరిలో ఉంది. అలాంటి  ఉసిరిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఓ మెడిసిన్ లా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే! మరి అలాంటప్పుడు వీటిని ఈ సీజన్‌లో అస్సలు విడిచిపెట్టకండి. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని ఎంతో రక్షిస్తుంది. చలికాలంలో ఉసిరికాయలను నిత్యం ఏదో ఒక రకంగా తీసుకుంటే  ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్‌ సి లోపాన్ని నివారిస్తుంది 

ఉసిరికాయల్లో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కన్నా విటమిన్‌ సి ఎక్కువగా మనకు ఉసిరికాయల్లోనే దొరుకుతుంది. అందుల్ల ఈ సీజన్‌లో ఉసిరికాయలను తీసుకుంటే విటమిన్‌ సి లోపం రాకుండా చూసుకోవచ్చు.

ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది 

డయాబెటిస్‌ ఉన్నవాళ్ళు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది. దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

శీతాకాలంలో సహజంగానే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అలాంటప్పుడు నిత్యం ఉసిరికాయల రసాన్ని తాగితే తిన్న ఆహారం వెంటనే జీర్ణమవుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

ఉసిరికాయల్లో ఉండే విటమిన్‌ సి అధికంగా ఉండటం వల్ల అది మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో తరచూ వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటివి రాకుండా చూస్తుంది.

చర్మ రోగాలని తగ్గిస్తుంది 

శీతాకాలంలో వచ్చే చర్మ రోగాలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం తాగాలి. 

జుట్టు రాలటాన్ని అరికడుతుంది 

ఈ సీజన్లో ఉసిరి ఎక్కువగా తీసుకుంటే వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.

చివరిమాట

ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నిటినీ ఆస్వాదించడానికి మీరు ఉసిరిని పచ్చిగానో, జ్యూస్‌లోనో, పౌడర్‌గానో లేదా సప్లిమెంట్ల రూపంలోనో ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. ఆమ్లా సాధారణంగా సురక్షితమైనది మరియు వినియోగానికి ఆరోగ్యకరమైనది. కానీ వినియోగానికి ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది, ప్రత్యేకించి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అలెర్జీలు ఉంటే.

డిస్క్లైమర్:

ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అంతకుమించి healthyfabs ఎలాంటి బాధ్యతా వహించదు.

Exit mobile version