శొంఠిలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందుకే, ఆయుర్వేదంలో దీనిని విరివిగా ఉపయోగిస్తుంటారు. పూర్వకాలంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే దీనినే వాడేవారు. అల్లాన్ని పాలలో ఉడకబెట్టి, తర్వాత దానిని ఎండబెడితే… శొంఠిగా మారుతుంది.
అయితే, ఈ శొంఠిని పొడిగా చేసి వివిధ అనారోగ్యాలకి ముందుగా ఉపయోగించవచ్చు. శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే… ఉపశమనం లభిస్తుంది. అలాగే మరుగుతున్న టీ, లేదా కాఫీలో కలిపి తీసుకుంటే… మేలు జరుగుతుంది. తాజా అల్లం కంటే శొంఠి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ శొంఠి పొడి వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
డైజేషన్ పెరుగుతుంది:
ఘాటుగా ఉండే శొంఠి బోలెడు ప్రయోజనాలని అందిస్తుంది. అన్ని అనారోగ్యాలకి కారణం జీర్ణకోశం. అలాంటి జీర్ణకోశంలో ఏ చిన్న తేడా వచ్చినా పూర్తి శరీరాన్నే బాధిస్తుంది. అందుకే, శొంఠి పొడిని డైట్‌లో భాగంగా చేసుకొని… క్రమం తప్పకుండా దానిని తీసుకున్నట్లయితే,,, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అందుకోసం రోజూ ఆహారం తినేముందు మొదటి ముద్దని శొంఠి పొడితో కలిపి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతుంది.
గ్యాస్ సమస్య దూరమవుతుంది:
తాజా అల్లం వాతాన్ని పెంచుతుంది కానీ, శొంఠి ఆ వాతాన్ని సమతుల్యం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే… గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి కలుపుకొని తాగితే… ఉపశమనం లభిస్తుంది. అలాగే, దీర్ఘకాలిక అజీర్తి వల్ల ఏర్పడిన కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలనుంచీ కూడా ఉపశమనం ఇస్తుంది.
మలబద్ధకానికి తగ్గిస్తుంది:
శొంఠిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం చేత ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఉదయాన్నే బౌల్ కదలికలు కష్టంగా మారినప్పుడు గోరువెచ్చని నీటిలో కోడిగా శొంఠి పొడి కలిపి తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుంది.
జలుబును తగ్గిస్తుంది:
జలుబు, దగ్గు అనేవి సీజనల్ వ్యాధులు. శొంఠి నీరు తీసుకుంటే ఇవి దూరమవుతాయి. అలాగే, శొంఠి కఫాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఫూ సమస్యతోనూ పోరాడుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
శొంఠిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంతో పాటు, ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఎలా తీసుకోవాలి?
శొంఠిని కషాయంగా చేసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు తీసుకోవాలి. అందులో 1 చిటికెడు శొంఠి పొడి వేసి మరిగించాలి. ఆ నీరు దాదాపు 1 గ్లాసు నీరుగా మిగిలే వరకు మరిగించాలి. ఆ తర్వాత దించివేసి, చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి.
ముగింపు:
శొంఠి పొడి అనేది ఒక స్ట్రాంగెస్ట్ స్పైస్. ఇది అనేక వ్యాదులకి ట్రెడిషనల్ హోమ్ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఇది అనేక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది ప్రతి ఇంట్లో ఔషదంగా ఎల్లప్పుడూ ఉండి తీరాల్సిందే!