Site icon Healthy Fabs

పరగడుపున రాగి నీరు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Benefits of Drinking Water from Copper Vessels

నాగరికత పుట్టినప్పటినుండీ మనిషి ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. రాతి యుగం నుంచీ రాగి యుగానికి అప్ గ్రేడ్ అవ్వటానికి మానవుడు ఎంతో పురోగతిని సాధించాడు. కరెన్సీ నుండి కిచెన్ ఐటమ్స్ వరకూ వివిధ రూపాల్లో రాగిని ఉపయోగించాడు. అందుకే, ఆయుర్వేదంలో రాగి పాత్రలకి ప్రత్యేక స్థానం ఉంది.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఏకైక లోహం రాగి. అందుకే, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు పలు సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి. బాడీ డిటాక్సిఫికేషన్ జరగటానికి ఇది ఓ టానిక్ లా పనిచేస్తుంది. రెగ్యులర్ గా ఈ నీటిని తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు వస్తాయి. దీంతో పొట్ట శుభ్రపడుతుంది. మరి అలాంటి సందర్భంలో రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని పరగడుపున తాగితే ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది:

రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి గొడుగులా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు పడదు. వయసు మీద పడినపట్లు అనిపించదు. పురాతన ఈజిప్షియన్లు కాపర్ బేస్డ్ బ్యూటిఫైయింగ్ ఏజెంట్లను ఉపయోగించేవారు. ఈ రోజుల్లో చాలావరకు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రాగి ఆధారితమైనవే. ఎందుకంటే, రాగి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ మాత్రమే కాదు, ఇది సెల్ రీజనరేషన్ కి కూడా సహాయపడుతుంది.

బరువుని నియంత్రిస్తుంది:

రాగి పాత్రలో స్టోర్ చేసి ఉంచిన నీరు శరీరంలోని ఫ్యాట్ ని తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్స్‌ చేయడంతోపాటు పొట్టను శుభ్రపరచడంలో రాగి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందువల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, స్థూలకాయం నియంత్రణలో ఉండాలని అనుకొంటే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రాగి నీటిని తాగాలి.

కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది:

ఆర్థరైటిస్ సమస్య ఉంటే… ఖచ్చితంగా రాగి నీటిని తీసుకోవాలి. ఎందుకంటే, రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిలో రాగి కరిగి ఉంటుంది. ఇది శరీరంలో కీళ్లలో నొప్పి, మంట సమస్యను నివారిస్తుంది. అంతేకాక, కాపర్ వాటర్ శరీరంలోని యూరిక్ యాసిడ్ మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే… అనేక సమస్యలు తలిత్తుతాయి.

రక్తహీనతను నివారిస్తుంది:

శరీరంలో రక్తహీనత సమస్య ఉంటే రాగి నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ నీటిని తాగటం వల్ల శరీరంలోని శోషణ సామర్థ్యం పెరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన రక్తాన్ని ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది.

గుండె జబ్బులను నివారిస్తుంది:

కాపర్ వాటర్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులు, లేదా గుండెపోటు లాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే నివారణ కోసం రాగి నీటిని క్రమం తప్పకుండా తాగాలి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల హార్ట్ బ్లాక్ అయ్యే ప్రమాదం తగ్గుముఖం పడుతుంది.

క్యాన్సర్‌తో పోరాడుతుంది:

రాగిలో ఉండే యాంటీఆక్సిడెంట్… ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ మానవ శరీరంలో క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. రాగి మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది, ఇది చర్మం మరియు కళ్ళకు రంగును ఇస్తుంది, అలాగే సూర్యుని యొక్క హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది.

థైరాయిడ్ గ్రంధి పనితీరు పెంచుతుంది:

థైరాయిడ్ రోగులకి ఉండే అత్యంత సాధారణ లక్షణం రాగి. రాగి థైరాయిడ్ గ్రంధి యొక్క అసమానతలను సమతుల్యం చేస్తుంది. అంటే – థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అయితే శరీరంలో రాగి నిల్వలు ఎక్కువైనా కూడా థైరాయిడ్ గ్రంధి పనిచేయటం మానేస్తుంది. దీని వలన రోగులలో హైపర్ లేదా హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రాగి నిల్వలు బ్యాలెన్స్డ్ గా ఉండాలి.

జీర్ణక్రియకు సహకరిస్తుంది:

పురాతన రోమన్స్ పొట్టలోని సూక్ష్మక్రిములను చంపడానికి రాగి ఆధారిత ఔషధాన్ని తీసుకోనేవారట. ఆయుర్వేదం ప్రకారం “తామ్ర జల్” తాగడం వల్ల కడుపు నిర్విషీకరణ జరుగుతుంది. రాగిలో పెరిస్టాల్సిస్ ని స్టిమ్యులేట్ చేసే లక్షణాలు కూడా ఉన్నాయి, దీనివల్ల కడుపు వాపు తగ్గి, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇంకా పొట్టలో పుండ్లు, అజీర్ణం, మరియు కడుపు ఇన్ఫెక్షన్లకు కూడా రాగి అద్భుతమైన ఔషధం.

మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది:

మానవ మెదడు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ద్వారా శరీరంలోని మిగిలిన భాగాలతో ఇంటరాక్షన్ చెందుతుంది. ఈ ప్రేరణలను నిర్వహించడం ద్వారా కణాలు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయడంలో రాగి సహాయపడుతుంది, మెదడు మరింత సమర్థవంతంగా పని చేస్తుంది.

గొంతు సమస్యలను నివారిస్తుంది:

పురాతన కాలంలో ప్రజలు ప్రతిరోజూ ఉదయం రాగి సీసా లేదా పాత్రలో నిల్వ చేసిన నీటితో పుక్కిలించేవారు. ఎందుకంటే, రాగి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి. అందుకే రాగిని కలిపిన నీటిని తాగినప్పుడు అది గొంతు సమస్యలని క్లియర్ చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు.

ముగింపు:

రాగి ప్రయోజనాలు కేవలం మానవ శరీరానికి మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా పరిగణించబడతాయి. ఇది చౌకైన లోహం, సమృద్ధిగా లభిస్తుంది, మరియు రీసైకిల్ చేయడానికి కూడా సులభమైనది. అందువల్లనే రాగిని విరివిగా ఉపయోగించటం ఇన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

Exit mobile version