చలి సమయంలో అల్లం ఒక అద్భుతమైన సహజ హీటింగ్ ఫుడ్. అల్లం టీ లేదా అల్లం నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, శరీరంలో వేడి పెరుగుతుంది.
పసుపు
పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థం శరీరానికి సహజ వేడి అందిస్తుంది. రాత్రిళ్లు వేడి పాలలో పసుపు వేసి తాగితే బెటర్.
బెల్లం
బెల్లం తినడం వల్ల రక్తప్రసరణ మెరుగై శరీరంలో సహజ వేడి పెరుగుతుంది. చలికాలంలో బెల్లం పల్లీలు లేదా నువ్వులతో కలిపి తింటే జాయింట్ పెయిన్స్ తగ్గి శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.
బాదం
బాదం పప్పుల్లో ప్రోటీన్, విటమిన్ E, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా చలిలో స్కిన్ డ్రైనెస్‌ని కూడా తగ్గిస్తాయి.
నువ్వులు
నువ్వులు చలికాలంలో తినడం వల్ల ఎముకలు బలంగా మారి శరీరానికి వేడి అందుతుంది. నువ్వుల లడ్డూ తింటే చలికి సహజ రక్షణ ఇస్తుంది.
పెసర పప్పు
చలికాలంలో పెసర పప్పు సూప్ లేదా పెసర కిచిడీ తినడం వల్ల శరీరానికి వేడి మరియు ప్రోటీన్ రెండూ అందుతాయి. ఇది సులభంగా జీర్ణమవుతూ ఎనర్జీని ఎక్కువగా ఇస్తుంది.
తేనె
తేనె సహజ యాంటీ ఆక్సిడెంట్. చలి సమయంలో వేడి నీటిలో తేనె కలిపి తాగడం వల్ల దగ్గు, జలుబు తగ్గిస్తుంది. అలాగే తేనె శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది.
నెయ్యి
నెయ్యి చలికాలంలో తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. ఇది శరీరానికి లోపల నుంచి వేడి అందిస్తుంది. ప్రతి రోజు ఒక చెంచా నెయ్యి తినడం వల్ల చర్మం మృదువుగా ఉండి శరీరం వేడిగా ఉంటుంది.
మిరియాలు
మిరియాలు చలి సమయంలో శరీరాన్ని వేడి ఉంచడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. మిరియాల సూప్ లేదా మిరియాల రసం తాగడం వల్ల జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షణ కలుగుతుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాలు చలికాలానికి సహజ ఎనర్జీ బూస్టర్. ఇవి ఐరన్, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా కలిగి ఉంటాయి. రోజూ 2–3 ఖర్జూరాలు తింటే శరీరానికి తగిన వేడి, శక్తి రెండూ అందుతాయి.