40+ వచ్చిన తర్వాత జాబ్, ఫ్యామిలీ రెస్పాన్సిబులిటీస్ మనుషుల్ని దూరం చేస్తాయి సమయం లేకపోవడం వల్ల కొత్త పరిచయాలకు అవకాశాలు తగ్గిపోతాయి. 

ఈ వయసులో మనం మారిపోతాం అభిరుచులు అభిప్రాయాలు స్పష్టమవుతాయి అందుకే కొత్తవారితో కలవడం కష్టంగా అనిపిస్తుంది  

వయసు పెరిగేకొద్దీ పరిచయాలు పరిమితమవుతాయి. గత అనుభవాలు జాగ్రత్తగా ఉండమంటాయి నమ్మకం రావడానికి సమయం పడుతుంది

40 తర్వాత చాలామంది తమ చుట్టూ ఒక సర్కిల్  ఏర్పరచుకుని కొత్త స్నేహాలకు ఆసక్తి చూపరు. రిస్క్ తీసుకోరు భావోద్వేగంగా జాగ్రత్త ఎక్కువగా ఉంటారు.

ఫ్రెండ్ షిప్ ఫెయిల్యూర్ తాలూకు గాయాలు ఇచ్చిన అనుభవాలు మనసులో గోడలు కడతాయి కొత్తవారిని దూరం పెడతాయి నమ్మకం తగ్గి,  మళ్లీ ఫ్రెండ్ షిప్ చేయటం  కష్టమవుతుంది. 

డిజిటల్ లైఫ్ పెరిగినా నిజమైన ఫేస్ టు  ఫేస్ కాన్వర్జేషన్స్ తగ్గాయి దీని వల్ల డీప్ ఫ్రెండ్ షిప్స్ అరుదయ్యాయి సోషల్ స్కిల్స్ తగ్గి, ఒంటరితనం పెరుగుతుంది 

ఈ వయసులో స్నేహం అంటే ఉపయోగం నమ్మకం విలువలు కలవాలని మనం ఎక్కువగా ఆశిస్తాం చిన్న మాటలతో సరిపోదు లోతు కావాలి సమానత్వం కావాలి గౌరవం అవసరం

సమయం శక్తి పరిమితంగా ఉండటంతో మనం పెట్టుబడి పెట్టే స్నేహాలను జాగ్రత్తగా ఎంచుకుంటాం ప్రతి పరిచయం అవసరం కాదు ఎంపిక ముఖ్యం అనిపిస్తుంది అనుభవం నేర్పిన పాఠమిది. 

వర్క్, ఫ్యామిలీ హెల్త్ మధ్య బ్యాలెన్స్ కాపాడుతూ స్నేహాలకు స్థానం ఇవ్వడం సవాలుగా మారుతుంది ప్రాధాన్యతలు మారిపోతాయి.  

అయితే ఓపికగా ఉండి ఒకే అభిరుచులున్న వారితో కలిస్తే 40 తర్వాత కూడా బలమైన స్నేహాలు సాధ్యం నెమ్మదిగా మొదలుపెట్టి నిజాయితీ చూపితే ఖచ్చితంగా నమ్మకం పెరుగుతుంది