ఆకాశంలో ఇంద్ర ధనస్సు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహారంలో రైన్ బో డైట్ అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. 

రైన్ బో డైట్ లో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.

ముఖ్యంగా ఈ డైట్ కూడా 7 రంగుల్లో ఉంటుంది. 

ఎరుపు రంగు ఆహారం హృదయానికి మేలు చేస్తాయి. ఉదాహరణ: రెడ్ బెల్ పెప్పర్, టమోటా, దుంపలు, దానిమ్మ, పుచ్చకాయ, యాపిల్,  స్ట్రాబెర్రీ. 

నారింజ రంగు ఆహారం కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఉదాహరణ: క్యారెట్, నారింజ, కమలా, గుమ్మడికాయ, పీచెస్.

తెలుపు రంగు ఆహారం కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుని తగ్గిస్తాయి. ఉదాహరణ: ఉల్లి, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, అరటిపండ్లు, టర్నిప్‌.

పసుపు రంగు ఆహారం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి, మరియు  రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఉదాహరణ: నిమ్మ, బొప్పాయి, మామిడి, పైనాపిల్, మొక్కజొన్న.

ఆకుపచ్చ రంగు ఆహారం మధుమేహం, మరియు గుండె జబ్బులతో పోరాడతాయి. ఉదాహరణ: ఆకుపచ్చ కూరగాయలు, ఆకుపచ్చ పండ్లు, ఆకు కూరలు.

నీలం రంగు ఆహారం గుండె ఆర్లోగ్యాన్ని కాపాడతాయి, మరియు మెదడు విధులు సక్రమంగా నిర్వర్తించేలా చేస్తాయి. ఉదాహరణ: బ్లూబెర్రీస్,  బ్లాక్‌బెర్రీస్.

ఊదా రంగు ఆహారం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి..మరియు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఉదాహరణ: పర్పుల్ కలర్ గ్రేప్స్, ఫిగ్స్, బ్రకోలి, క్యాబేజ్, క్యారెట్, పొటాటోస్, బీన్స్,