మన శరీరంలో విటమిన్ లోపాలు మొదటగా ముఖం మరియు జుట్టులో కనిపిస్తాయి ఎందుకంటే అవి హెల్త్ స్టేటస్ ని స్పష్టంగా రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి.

విటమిన్ A లోపం ఉన్నట్లయితే  డ్రై స్కిన్, యాక్నే, స్కిన్ గ్లో తగ్గడం వంటి లక్షణాలు స్పష్టంగా చూపిస్తుంది. 

విటమిన్ B12 తక్కువైతే ఫేస్ డల్ గా కనిపించడం, చాలా సార్లు పెదవుల చుట్టూ పగుళ్ళు రావడం వంటివి సాధారణంగా గమనించవచ్చు.

విటమిన్ C లోపం ఉన్నట్లయితే గాయాలు ఆలస్యంగా మానడం, చర్మంపై మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలను తరచుగా కలిగిస్తుంది. 

విటమిన్ D తక్కువగా ఉంటే జుట్టు ఎక్కువగా రాలడం, తల చర్మం బలహీనంగా మారడం, మూడ్ చేంజెస్ వంటివి జరుగుతాయి. 

ఐరన్ లోపం వల్ల ముఖం పాలిపోయినట్లు ఉండటం, కళ్ళ కింద నల్లటి వలయాలు కనిపించడం వంటివి సాధారణ లక్షణాలు అవుతాయి.

బయోటిన్ లోపం జుట్టు పలుచగా మారడం, వేగంగా చిట్లడం, జుట్టు పెరుగుదల మందగించడం వంటి సమస్యలు కలిగిస్తుంది.

విటమిన్ E తగ్గినట్లైతే చర్మం కాంతి కోల్పోవడం, పొడిబారడం, త్వరగా ముడతలు రావడం వంటి సంకేతాలు గమనించవచ్చు.

సమతుల ఆహారం తీసుకోకపోతే శరీరంలో పోషకాలు  లోపించి వాటి ప్రభావం ముఖం మరియు జుట్టు ఆరోగ్యంపై చూపిస్తాయి.

సరైన సమయానికి రక్తపరీక్షలు చేయించి సరైన ఆహారం తీసుకుంటే మీ చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.