మహిళలకు మెనోపాజ్ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ తగ్గిపోవడంతో హార్మోన్ ఇమ్బ్యాలేన్స్ ఏర్పడి ఓవర్ హీట్, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి కలుగుతాయి 

ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల స్లీపింగ్ డిజార్డర్స్, రాత్రివేళ చెమటలు, మూడ్ స్వింగ్స్ పెరిగి రోజువారీ జీవితం ప్రభావితమవుతుంది  

హార్మోన్ మార్పులతో ఎముకల బలహీనత పెరిగి పెళుసుగా మారతాయి. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ ప్రమాదం ఎక్కువవుతుంది

చర్మం పొడిబారడం జుట్టు పలుచన కావడం ఈస్ట్రోజెన్ లోప లక్షణాలు ఇవి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతాయి ఈ సమయంలో సామాజిక జీవితం మానసిక స్థితి కూడా మారుతుంది 

మెనోపాజ్ సమయంలో బరువు పెరగడం మెటబాలిజం మందగించడం సాధారణమే ఆరోగ్యకర ఆహారం కీలకం అవుతుంది. మహిళలకు ఈ దశలో వ్యాయామం, నడక జీవనశైలిలో మార్పులు అవసరం 

ఈస్ట్రోజెన్ తగ్గడంతో గుండె ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి రక్తపోటు కొలెస్ట్రాల్ నియంత్రణ చాలా ముఖ్యం. మహిళలకు ఈ వయసులో క్రమమైన పరీక్షలు వైద్య సలహాలు పాటించడం అవసరం 

మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి భావోద్వేగ సమస్యలు మెనోపాజ్ లో ఎక్కువగా కనిపిస్తాయి మహిళలకు ఈ దశలో ఫ్యామిలీ సపోర్ట్, మెడిటేషన్, కౌన్సెలింగ్ ఎంతో అవసరం.

లైంగిక ఆరోగ్యంలో మార్పులు రావచ్చు యోని పొడిబారడం ఆసక్తి తగ్గడం సాధారణ అనుభవాలు అవుతాయి ఈ సమస్యలకు వైద్య సహాయం తీసుకోవడం ఉపశమనం ఇస్తుంది 

హార్మోన్ థెరపీ కొందరికి ఉపశమనం ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరికీ సరిపోదు జాగ్రత్తగా నిర్ణయం అవసరం. ఈ దశలో మహిళలు వైద్యుడితో చర్చించి లాభ నష్టాలు తెలుసుకోవాలి 

మెనోపాజ్ జీవితానికి ముగింపు కాదు ఇది కొత్త శరీర అవగాహన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే దశ. ఈ సమయంలో మహిళలకు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాజిటివ్ థింకింగ్ ముఖ్యమైనవి